Once you stop learning, you start dying

13, డిసెంబర్ 2008, శనివారం

బృహస్పతి మకర ప్రవేశం-ఘోరాలు

బృహస్పతి మకర రాశిలోకి డిసెంబరు పదవ తేదీన ప్రవేశించాడు. ఇది ఆయనకు నీచ రాశి. అక్కడ ఇంతకూ ముందే రాహువున్నాడు. మకరం భారత దేశానికి సంకేతం. కనుక మన దేశంలో విపరీత సంఘటనలు, దారుణాలు, ఉగ్రవాద చర్యలు, అధర్మం పెరిగిపోవటం జరిగే సూచనలున్నాయి. ఇంకో నెలలో వీరికి జతగా కుజుడు చేరబోతున్నాడు. ఇక రోడ్డు, అగ్ని ప్రమాదాలు తప్పేటట్లు లేవు. బయటి దేశాల కుట్రలు కుతంత్రాల వల్ల ప్రమాదం ఉన్నది . మొత్తానికి ఈ ఏడాది మన దేశానికి కష్ట కాలమే. వీరి దృష్టి కర్కాటకం మీద పడుతోంది కాబట్టి, చిన్న పిల్లలకు, ఆడపిల్లలకు కష్ట కాలం. ఉన్నట్టుండి ఆడపిల్లల మీద దాడులు దీని ప్రభావమేనా? దీనికి తోడు డిసెంబరు పదవ తేదీ నుంచి చంద్రుడు భూమికి దగ్గరగా రావడం కూడా అగ్నిలో ఆజ్యం పోసింది. పాడి పరిశ్రమలకు చేటు , జల సంబంధ ప్రమాదాలు తప్పవు. తస్మాత్ జాగ్రత.