Pages - Menu

Pages

9, జనవరి 2009, శుక్రవారం

ఏది సత్యం ఏదసత్యం?

ఊహించినట్లుగానే దక్షిణాదిన ఒక పెద్ద మోసం బైట పడింది. సత్యం కంప్యూటర్స్ రామలింగ రాజు ఏడు వేల కోట్లకు ప్రజలను మోసగించి దొంగ లెక్కలు చూపి ఈ రోజు మొహం చాటేయడం, సంస్థ కొత్త లీడర్లు గాయానికి మందు పుయ్యడం, ప్రెస్ మీట్లు, రాజకీయ నాయకుల మాదిరి వాగ్దానాలు వెరసి ఒక్కటి మాత్రం ఖాయం అనిపిస్తోంది. మన దేశంలో కాస్త తెలివి ఉండి నీతిని గాలికి ఒదిలేస్తే ఎంతైనా దోచుకోవచ్చు. పైవారికి కొంత తినిపిస్తే చాలు. మొదటి నుంచీ అరబ్బులు, తుర్కులు, మొఘలులు,పోర్చుగీసు, డచ్చి,ఫ్రెంచి, ఇంగ్లిష్ వారు దోచుకోంగా మిగిలిన దాన్ని ఇప్పుడు నల్ల దొరలు దోచుకుంటున్నారు. వెరసి మన దేశం దోచుకోబడ డానికే పుట్టిందా అనిపిస్తుంది. దాదాపు వెయ్యి ఏండ్ల నుండీ దోపిడీ జరుగుతున్నా ఇంకా మిగిలి ఉందంటే మన దేశం రత్న గర్భ కాక మరేమిటి? మకర రాశిలో గురు చండాల యోగం తో ఇంకా ఎన్నెన్ని మోసాలు, స్కాములు, ఫ్రాడులు, జరుగుతాయో చూద్దాం. ఇరవై ఆరున సూర్య గ్రహణం దగ్గరకొస్తోంది. ఈ లోపల ఇంతకూ ముందు పోస్టు లో రాసినట్లు ఇంకా ఎన్నెన్ని జరుగుతాయో వేచి చూడడం తప్పదు మరి. అమెరికాలో అయితే ఇటువంటి నేరాలకు తీవ్ర శిక్షలుంటాయి. ఇక్కడ రేపటికి ఎవరికీ గుర్తుండదు. ప్రజలు చైతన్య వంతులు కానంత వరకు ఇటువంటి గతి తప్పదు. మన ఖర్మ ఏమిటంటే ఇక్కడ ప్రజలే అవినీతిపరులు. పాలకులు వీరికి తగిన వారే. మరి దేశం గతి ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది?