Pages - Menu
▼
Pages
▼
26, జనవరి 2009, సోమవారం
కరాటే- ఎంప్టీ హ్యాండ్
కరాటే అన్న పదానికి జపనీస్ భాషలో ఎంప్టీ హ్యాండ్ అని అర్థం. అంటే ఉత్త చేతులతో ప్రత్యర్థులనుమట్టి కరిపించే యుద్ధ విద్య. దీనికి ఓషో రజనీష్ మంచి ఆధ్యాత్మిక అర్థం చెప్పాడు. మనం ఉత్తచేతులతోనే ఈ లోకం లోకి వస్తాం, తిరిగి ఉత్త చేతులతోనే వెళతాం.
శరీరం అశాశ్వతం. జీవితంఅశాశ్వతం. ఈ స్పృహ ఉన్న కరాటే వీరుడికి భయం ఉండదు. భయం లేని వాడు ఎంత మందినైనా మొండి గా ఎదుర్కోగలడు. ఏళ్ల తరబడి "మకివార", "తామెషివారి" అభ్యాసం వల్ల దెబ్బకొకణ్ణి చంప గలడు. అలాగే చావడానికి కూడా భయపడడు.
అందుకనే కరాటేలో "ఒన్ పంచ్ సర్టెన్ డెత్" అనేది మూలసూత్రం గా అనుసరిస్తారు. దీనికోసమే "కంకు", " కుసాంకు" అనే కటాలలో ముందుగా శూన్య ముద్ర పట్టి చేతుల మధ్యనగల శూన్యాన్ని చూస్తూ సాధన మొదలు పెట్టాలి.
శూన్య సాధన వల్ల మనసు ఆలోచనా రహితమై నిర్భయ స్థితికిచేరతాడు. ద్వంద్వ యుద్ధంలో భయ రహితుడే గెలుస్తాడు. భయ రహితుడే తల ఎత్తుకుని జీవించ గలడు.