కుంగ్ఫూ అనేక విధాలు. షావోలిన్ బాక్సింగ్ ,సౌత్ బాక్సింగ్, చోయిలేఫట్, వింగ్చున్, జంతువిధానాలు డ్రాగన్, స్నేక్, క్రేన్, లెపర్డ్, టైగర్, హంగ్గార్, ప్రేయింగ్ మాన్టిస్, డ్రంకెన్ బాక్సింగ్, ప్లంఫ్లవర్ బాక్సింగ్, స్ప్రింగ్ లెగ్, వైట్ ఐ బ్రో ఇలా చాలా ఉన్నాయి.
వీటిలో వింగ్చున్ ప్రత్యేకతలు అనేకం.
1.దీన్ని మొదలు పెట్టింది ఒక స్త్రీ కావడం.
2.ఇతర విధానాల కంటే తేలికగా నేర్చుకోగలగటం.
3.తక్కువ ఫామ్స్ కలిగి ఉండడం ( Sil Lum Tao etc ).
4.సెంటర్ లైన్ విధానం.
5.చక్రభ్రమణం (circular foot work) లేకపోవడం.
6.కి సావు, లాప్ సావు పద్దతులు ( switching hands, trapping hands, haunting hands)
7.వుడేన్ డమ్మీతో అభ్యాసం
8. కళ్ళకు గంతలతో యుద్ధం చేయగలగటం ఇటువంటివి.
అన్నింటి కంటే ముఖ్యమైనది సెన్సిటివిటి ట్రైనింగ్. దీనివల్ల ప్రత్యర్థి తరువాతి కదలిక ముందుగానే మనకు తెలిసిపోతుంది. క్లిష్టమైన అడుగులు, గాలిలో ఎగరడం, పల్టీలు ఇందులో ఉండవు. ఆయుధాలు కూడా తక్కువ. సీతాకోకచిలుకఖడ్గాలు (butterfly knives), ఎనిమిదడుగుల కర్ర మొదలైన వెపన్స్ వాడతారు. కదలికలలో పొదుపు (economy of movement) ఇందులో మూలసూత్రం. ప్రత్యెకమైన పంచింగ్ ,బ్లాకింగ్ మరియు కిక్కింగ్ పద్ధతులు దీని సొంతం.
చాలా ప్రాక్టికల్ గా ఉపయోగపడే కుంఫ్ఫూ స్టైల్స్ లో వింగ్చున్ ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు.