Pages - Menu

Pages

1, ఫిబ్రవరి 2009, ఆదివారం

శ్రీ పంచమి నాడు మహా నటుడు నాగేష్ మరణం,

నాకు ఇష్టమైన హాస్య నటులలో నాగేష్ ప్రథముడు. సర్వర్ సుందరం నుంచి నేటి దశావతారం వరకు ఆయనది ఎంత చిన్న పాత్ర అయినా తెర మీద కనిపిస్తే నవ్వులు పూసేవి. రాజేంద్ర ప్రసాద్ "మేడం" చిత్రంలో ఆయన పాత్ర నాకు బాగా నచ్చింది. ఇకపోతే ఆయనతో నాకున్న పరిచయం. విజయవాడలో కళా క్షేత్రంలో సుమధుర కళా నికేతన్ నాటకాలకు ఆయన అతిథి గా వొచ్చారు. దాదాపు 1999 లో అనుకుంటా. రెండు రోజులు మాతోనే ఉన్నారు. ఆయన బసా తిండి తిప్పలు మిత్రుడు ప్రసాద్ చూసుకున్నాడు. ఆయనను రైలెక్కిన్చేటప్పుడు " బాబూ, ఈ రెండు రోజులు నా వెంట వుండి జాగ్రత్తగా చూసావు. ఈ వుంగరం తీసుకో అంటూ తన చేతి బంగారు వుంగరం తీసి బలవంతం గా ప్రసాద్ చేతిలో పెట్టి రైలెక్కారు." ఏ మాత్రం గర్వం లేని మనిషి. కోటీ స్వరుడై వుండి మేమిచ్చిన మామూలు వసతులతో మాట్లాడ కుండా సరి పెట్టు కున్న నిగర్వి. ఆయన అభిప్రాయాలు సూటిగా నిక్కచ్చిగా వుండేవి. చాలా మంచి మనిషి. తెలుగు భాషనూ తెలుగు వారినీ చాలా ప్రేమించే వారు. ఆయన ఆత్మకు ఉత్తమ గతులు కలుగు గాక అని భగవంతుని ప్రార్థిస్తూ...మనిషి జీవితం చావులో తెలుస్తూంది అంటారు. లలిత కలాధి దేవత అయిన సరస్వతి మాతకు ఇష్టమైన, పరమ పవిత్ర మైన శ్రీ పంచమి రోజున ఆయన కన్ను మూయడం ఆయన ఉత్తమ జన్మను పుణ్య బలాన్ని తెలియ చేస్తోంది. ఆయన జాతకం రెండు రోజుల్లో పరిశీలిద్దాము.