Pages - Menu

Pages

15, ఫిబ్రవరి 2009, ఆదివారం

హఠ యోగ సాధనా క్రమం

హఠ యోగ మునకు ప్రామాణిక గ్రంథాలు , హఠ యోగ ప్రదీపిక, ఘేరండ సంహిత, హఠ రత్నావళి మొదలగునవి.వీటిలో, స్వాత్మారామ యోగీంద్రుడు రచించిన హఠ యోగ ప్రదీపిక ననుసరించి హఠ యోగ సాధనా క్రమం ఇట్లా ఉండాలి.

శ్లో||
ఆసనం కుంభకం చిత్రం ముద్రాఖ్యం కరణం తథా
అతః నాదాను సంధాన మభ్యాస క్రమో హఠే ||

1. ఆసన అభ్యాసము
2. ప్రాణాయామము
3. ముద్రాభ్యాసము
4. కరణములు.
5. నాదానుసంధానము.

స్వాత్మారామ యోగి ఇంకా చేబుతూ, రాజయోగమునకు దారి చూపక పొతే, హఠ యోగము ఎంత అభ్యాసము చేసినా శోభించదు అని అంటాడు.
శ్లో|| రాజ యోగం వినా పృధ్వీ రాజ యోగం వినా నిశా
రాజ యోగం వినా ముద్రా విచిత్రాపి శోభతే ||

కనుక సాధనా క్రమములో హఠ యోగము, రాజ యోగమునకు దారి తీయ వలెను.