Pages - Menu

Pages

13, ఫిబ్రవరి 2009, శుక్రవారం

మాస్ ఒయామా జీవితం


కరాటే అన్న పదానికి నిలువెత్తు నిర్వచనం మాస్ ఒయామా. కరాటే అంటే, భయాన్నిఎరుగని ధీరత్వం, కఠోర సాధన, నికార్సైన వ్యక్తిత్వం, విలువలకు కట్టుబడిన జీవితం, నిరాయుధుడుగా ఎందరినైనా ఎదుర్కోగల నైపుణ్యం వంటి ఉన్నత అంశాలతో కూడినప్రాచీన జపాన్ వీరులు గుర్తుకు వస్తారు. వారి ప్రతి రూపం సోసై మాస్ ఒయా మా. జపాన్భాషలో సోసై అంటే అధినేత, ఉన్నత అధికారి, ప్రారంభకుడు, గ్రాండ్ మాస్టర్ అనే అర్థాలువస్తాయి. పాత కాలంలో imperial prime minister ను సోసై అనేవారు.

ఈయన అసలు పేరు యోంగ్--చోయి. 27-7-1923 దక్షిణ కొరియాలో జన్మించాడు. తొమ్మిదేళ్ళ చిన్న వయసులోమంచురియాలో తన సోదరి ఇంటిలో ఉన్నపుడు,
18 hand form of chinese kenpo అభ్యాసం చేయడం ప్రారంభంచేసాడు.

15 ఏళ్ల వయసులో పైలట్ కావాల
నే ఆలోచనతో జపాన్ చేరాడు. ఒకరోజు ఒకినావ కరాటే ను కొందరు అభ్యాసం చేయడంచూసి, తకుశోకు యునివర్సిటీ లోని మాస్టర్ గిచిన్ ఫునకోషి క్లాసులో చేరి సాధన మొదలు పెట్టాడు. 17 ఏళ్లకు 2 nd Dan Black Belt ను, 20 ఏళ్లకు 4 th Dan Black Belt ను సాధించాడు. దీనితో బాటు జూడో విద్యను కూడా సాధనచేసి అందులో 2 nd Degree Black Belt ను పొందాడు. తరువాత జపాన్ ఇంపీరియల్ సైన్యం లో చేరాడు.

తరువాత
Goju Style of Karate లో గొప్ప మాస్టర్ అయిన సో-ని- చు పరిచయం తో తన జీవితం కరాటే సాధనకుఅంకితం చెయ్యాలనే నిర్ణయానికి వొచ్చాడు. కరాటే లో ఉన్నత ప్రమాణాలు అందుకోవాలంటే 3 ఏళ్ళు ప్రపంచానికి దూరంగా కొండలు అడవుల్లో సాధన చెయ్యమని సో-ని-చు ఈయనకు సలహా ఇచ్చాడు.

23 ఏళ్ల వయసులో ఎజి యోశికవ
పరిచయం తో ప్రాచీన సమురాయ్ సిద్ధాంతమైన " బుషిడో " ఈయనను ప్రభావితంచేసింది. మినోబు పర్వతం పైన ఎక్కడైతే సమురాయ్ ముసాషి తన నిటో-ర్యు ఖడ్గ విద్యను సాధన చేసాడో అదే చోటునుతన సాధనకు అనువుగా భావించాడు. ఆర్నెల్లు గడిచాయి. కఠిన సాధన, ఒంటరి జీవితం, అడవి, కొండలు, తొడు. ప్రపంచం తో సంబంధం లేదు. తనకు తోడుగా వచ్చిన యశిరో అనే శిష్యుడు ఒక రాత్రి చెప్పా పెట్టకుండా పారిపోయి అడవినుంచి బయట పడతాడు. బయట ప్రపంచాన్నిమరచి పోటానికి ఒక కనుబో మను కత్తిరించు కుంటాడు. అటువంటివేషంలో జనులకు కనపడటం చాలా వమానం గా జపాన్ లో భావిస్తారు. 14 నెలల కఠిన సాధన తరువాత మామూలుప్రపంచంలో అడుగు పెట్టి 1947 లో జరిగిన All Japan Karate Championship లో ప్రథమ స్థానంలో నెగ్గాడు. కానితృష్ణ తీరక తిరిగి కియోజోమి పర్వతంపైన ఉంటూ ఒంటరిగా సాధన చేసాడు.

ఈయన సాధన గురించి వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. ప్రతిరోజూ 12 గంటలు సాధన చేసేవాడు, బండ రాళ్ళను, చెట్లను
punching bags గా వాడుతూ, శీతల జలపాతాల కింద గంటల తరబడి నిలిచి ప్రాణాయామ సాధన చేసేవాడు. రాత్రిళ్ళుజెన్, బుషిడో, ప్రాచీన వీరుల జీవితాలు అధ్యయనం చేసేవాడు. అలా 18 నెలల కఠోర సాధన నంతరం ఉక్కు శరీరం తో, అచంచల ఆత్మ విశ్వాసంతో తిరిగి మామూలు ప్రపంచం లో అడుగు పెట్టాడు.

కొమ్ములు తిరిగిన కరాటే వీరులు కూడా ఆయనకు ఎదురు నిలవ
లేక పోయారు. మనుషులు తనకు ప్రత్యర్థులుకాలేరని అర్థమైన ఒయామా ఎద్దులతో యుద్ధం చేయాలని నిశ్చయానికి ఒస్తాడు. 1950 నుంచి ఆయన 52 ఎద్దులతో యుద్ధం చేసాడు. అందులో 3 ఎద్దులు ఆయన చేతి ఒకేఒక గుద్దుతో ప్రాణాలు కోల్పోయాయి.

1952 నుంచి ఆయన అమెరికాలో పర్యటించి తన కరాటే ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. 270 మంది
challengers ను ఎదుర్కొని అందర్నీ ఓడించాడు. వీరిలో చాలా మంది ఒకేగుద్దు తో మట్టి కరిచారు. fight అయినా మూడు నిమిషాల లోపే ముగిసేది. ఆయనకు Godhand అనే బిరుదు ఖాయం అయ్యింది. జపాన్ వీరుల మూల సూత్రమైన Ichi Geki, Hissatsu లేదా One Punch Certain Death అనే దానికి ఆయన ప్రతి బింబం అయ్యాడు.

1953 లో
యన తన మొదటి దోజో ను టోకియో లో ప్రారంభం చేసాడు. 1964 లో కరాటే లో తనదైన స్టయిల్ నురూపొందించి దానికి క్యోకు-శిన్-కాయ్ అని పేరు పెట్టాడు. అత్యంత ప్రమాద కరమైన Full Contact Karate దీని ప్రథానసూత్రం. ఉన్నత స్థాయి Black బెల్ట్ పొందాలంటే 300 మంది బ్లాక్ బెల్ట్ యోధులతో వరుసగా పోరాడి అందర్నీ గెలుస్తూరావాలి. 299 మందిని గెలిచి చివరిలో ఒకరితో ఓడిపోయినా తిరిగి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క Bout కు మూడు నిమిషాల వ్యవధి మాత్రం ఉంటుంది. మానవాతీత పరీక్ష తానొక్కడే చేసి చూప గలిగాడు. ఇప్పటి వరకూ రికార్డు ఎవరూ అధిగమించ లేదు.

26-4-1994 ఊపిరి తిత్తుల కేన్సర్ తో 70 ఏళ్ల వయసులో మరణించాడు. నేటికి ఈయన ప్రారంభించిన క్యోకు-శిన్-కైకరాటే
స్కూళ్ళు 135 దేశాలలో ఉన్నాయి. వీటిలో దాదాపు కోటి మంది శిష్యులు ప్రపంచ వ్యాప్తం గా విద్యను నేడుసాధన చేస్తున్నారు.

ఇటువంటి మానవాతీత సాధన తో ధీరోదాత్త జీవితం గడిపి చూపిన సోసై మాస్ ఒయామా అంటే రోజు
10 Million Students భక్తితో తల వంచి వందనం చేస్తారు. ప్రాచీన కరాటే విద్య లోచెప్పిన అద్భుతాలు సాధ్యమే అని నిరూపించిన మహా వీరుడు, గ్రాండ్ మాస్టర్--- సోసై మాస్ఒయామా. ఈయన జీవితం పైన జపాన్ లో సినిమాలు వచ్చాయి. ఈయన జీవితం గురించిక్లుప్తం గా చెప్పటం కష్టం. అయినా మహా వీరుడంటే నా కున్న గౌరవంతో చిన్ని ప్రయత్నంనేను చేశాను.

ఆయన జాతకం త్వరలో చూద్దాం.