“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

23, మార్చి 2009, సోమవారం

హోమియో విజ్ఞానం- శీఘ్ర, దీర్ఘ వ్యాధులు

హన్నేమాన్ వ్యాధులను Acute and Chronic అని రెండు విధాలుగా విభజించాడు.

దీనిలో మొదటి దానిని శీఘ్ర (తరుణ)వ్యాధి అని పిలవ వచ్చు. ఆటలమ్మ, పొంగు, వడదెబ్బ,కలరా, జపనీస్ ఎన్కెఫలైటిస్, అంటు జ్వరాలు,కోరింత దగ్గు మొదలైనవి కోవకు చెందుతాయి. ఇవి చాలా త్వరగా వ్యాపిస్తాయి. వీటి నడక కూడా త్వరగా ఉంటుంది. ఇవి వాటంత అవే తగ్గుతాయి లేదా మరణానికి దారి తీస్తాయి.

వీటిని totality of symptoms ద్వారాను Peculiar symptoms ద్వారాను ఎంపిక చేయ బడిన మందులను వెంట వెంటనే ఇచ్చి నయం చేయ వచ్చు. సాధారణంగా పోటేన్సి 30 or 200 సరిపోతుంది. Anti Psoric remedies or Polychrest remedies వాడవలసిన అవసరం సామాన్యం గా ఉండదు. ఎకోనైట్, బెల్లడోనా, బ్రయోనియా, కేంఫర్, విరేట్రం, ఫాస్ఫరస్ మొదలైన మందులు వ్యాధి నడకను బట్టి మందు త్వర త్వరగా ఇవ్వాలి.కాని మయాజం యొక్క పునాదితో వచ్చే తరుణ ఉద్రేక వ్యాధులు లోతైన polychrest remedies వాడనిదే తగ్గవు.

దీర్ఘ వ్యాధుల నడక నిదానం గా ఉంటుంది. జీవితాంతం బాధ పెడుతాయి. ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి మారుతూ, లోలోతులకు పోతాయి. చివరకు ముఖ్య అవయవాలైన గుండె, మూత్ర పిండాలు, ఊపిరితిత్తులు మొ|| వాటిని పాడు చేస్తాయి. వీటిని లోతుగా పనిచేసే మందులు దీర్ఘ కాలం వాడితే గాని తగ్గించ లేము. వైద్యునికి, రోగికి కూడా ఓపిక కావాలి. వేచి చూడాలి. హన్నేమాన్ అంతటివాడే కనీసం రెండు ఏళ్ళు పడుతుందని చెప్పాడు.

శీఘ్ర వ్యాధులు మందులతో వెంటనే తగ్గుతాయి. కాని దీర్ఘ వ్యాధులు చాలా సార్లు చర్మం మీదకు వచ్చి తగ్గుతాయి. అటువంటి స్థితిలో అదేదో చర్మ వ్యాధి అని ఆయింటుమెంటులు వాడితే తిరిగి వ్యాధి లోపలకు అణిగి పోతుంది. అప్పుడు నయం కావటం కష్టం అవుతుంది. దీర్ఘ వ్యాదులలో నాలుగైదు లోతైన మందులను మార్చి మార్చి వాడ వలసి వస్తుంది. శీఘ్ర వ్యాదులలో ఒకే మందుతో వెంటనే తగ్గుతుంది.

హోమియో మందులకున్న ముఖ్య గుణం- రోగం తగ్గిన తరువాత నీరసం ఉండదు. రోగి పూర్తీ గా వెంటనే కోలుకుంటాడు. ఇంగ్లీషు వైద్యంలో రోగం తగ్గుతుంది కాని నీరసం తగ్గదు. అది నివారణ కాదు అణచివేత అన్నదానికి ఇదే రుజువు. దానికి మళ్ళీ టానిక్కులు వాడవలసి వస్తుంది.

దీర్ఘ వ్యాదులలో 1M,10M,50M,CM,MM,DM పోటేన్సి లను వాడ వలసి రావచ్చు. వీటిని వెంట వెంటనే మార్చి వాడరాదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక డోస్ నెలల తరబడి పనిచేస్తుంది. మా క్లినిక్ లో లేకసిస్ అనే మందు ఒక్క డోస్ ఇచ్చి ఆగితే ఆరు నెలల తర్వాత చర్మం మీద తీవ్ర మైన ఎరప్షన్స్ తీసుకు రావటం చూచాము.