...
31, మే 2009, ఆదివారం
27, మే 2009, బుధవారం
కుండలినీ యోగం
దైవశక్తి ఊర్ధ్వస్తాయిలలోనుంచి అవరోహణాక్రమంలో క్రమేణా దిగివచ్చి స్థూలంగా మారి కుండలినీశక్తిగా మనిషి వెన్నెముక అడుగున నిద్రాణస్థితిలో ఉంటుంది.కనుక మనిషి ప్రకృతికి,పంచభూతాలకు దాసుడై జీవితం గడుపుతున్నాడు. ఈ శక్తిని ఊర్ధ్వగామినిగా చేసి శిరస్సుపైన ఉన్న సహస్రదళపద్మంలోకి తీసుకు వెళ్ళగలిగితే మనిషి ప్రకృతి దాస్యంనుండి విముక్తుడై దైవత్వాన్ని పొందుతాడు.ఈ ప్రక్రియనే కుండలినీయోగం అంటారు.
దీనికి కులంతో మతంతో పనిలేదు....
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
20, మే 2009, బుధవారం
టైగర్ స్టైల్ కుంగ్ ఫూ
టైగర్ స్టైల్ చైనీస్ కుంగ్ ఫూ లో ఒక సామెత ఉంది. రెండు పులులు యుద్ధం చేస్తే ఒకటి చనిపోతుంది. రెండవది కుంటిదౌతుంది. ఇది టైగర్ స్టైల్ కుంగ్ ఫూ లోని భయంకరమైన టెక్నిక్స్ కు చక్కని ఉదాహరణ. దక్షిణ చైనాలో పుట్టిన కుంగ్ ఫూ శాఖలలో టైగర్ స్టైల్ ఒకటి. దీనినే టైగర్ క్రేన్ స్టైల్ అని కూడా అంటారు. ప్రస్తుతానికి క్రేన్ స్టైల్ ను ప్రక్కన ఉంచి టైగర్ స్టైల్ ఏమిటో చూద్దాము.
దీని మూలాలు చరిత్రకు అందని చీకటిలో ఒదిగి ఉన్నాయి. కాని షావోలిన్ జెన్...
లేబుళ్లు:
వీర విద్యలు
19, మే 2009, మంగళవారం
బుద్ధుని బోధనలు-2
అస్సజి బుద్దుని మొదటి అయిదుగురు శిష్యులలో ఒకడు. మిగిలిన నలుగురు భద్దియ, కొండన్న, మహానామ,వప్ప. వీరు బుద్ధుడు నిరాహారిగా ఉంటూ తీవ్ర సాధనాలు చేస్తున్న సమయంలో ఆయనను అనుసరించి ఉండేవారు. ఆహారంమానేసి శరీరాన్ని కృశింప చేసి ఇంద్రియ దాస్యం నుంచి ముక్తి పొందటమే మోక్షం అని ఒక భావన ఆ కాలంలో ఉండేది. కాని బుద్దుడు ఇది తప్పు అని స్వానుభవం ద్వారా తెలిసుకొని ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభం చేస్తాడు. ఇది చూచి ఈఅయిదుగురు భిక్షువులూ ఆయన సాధనా మార్గంలో...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
17, మే 2009, ఆదివారం
భగవాన్ బుద్ధుని బోధనలు-1

గౌతమ బుద్దుడు అనుత్తర సమ్యక్ సంబోధిని పొందిన రోజు వైశాఖ పూర్ణిమ. ఈ రోజు బౌద్ధులకు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకనగా ఆ రోజున బుద్ధుని జననము, జ్ఞానోదయము, పరినిర్వాణము జరిగాయి. పున్నమి చంద్రుడు ఎలాగైతే తన చల్లని వెలుగును లోకానికి వేదజల్లాడో బుద్ధుడు తానూ కనుగొన్న దుఃఖ నాశన మార్గాన్ని లోకానికి దాదాపు 40 ఏళ్ళు బోధించి పరినిర్వాణం చెందాడు.భగవాన్ బుద్ధుడు కనుగొని లోకానికి బోధించిన జ్ఞానం ఏమిటి? దీనిని క్లుప్తంగా...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)