“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

17, మే 2009, ఆదివారం

భగవాన్ బుద్ధుని బోధనలు-1

గౌతమ బుద్దుడు అనుత్తర సమ్యక్ సంబోధిని పొందిన రోజు వైశాఖ పూర్ణిమ. రోజు బౌద్ధులకు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకనగా రోజున బుద్ధుని జననము, జ్ఞానోదయము, పరినిర్వాణము జరిగాయి. పున్నమి చంద్రుడు ఎలాగైతే తన చల్లని వెలుగును లోకానికి వేదజల్లాడో బుద్ధుడు తానూ కనుగొన్న దుఃఖ నాశన మార్గాన్ని లోకానికి దాదాపు 40 ఏళ్ళు బోధించి పరినిర్వాణం చెందాడు.

భగవాన్
బుద్ధుడు కనుగొని లోకానికి బోధించిన జ్ఞానం ఏమిటి? దీనిని క్లుప్తంగా రెండు మాటలలో చెప్ప వచ్చు.
1.
నాలుగు ఆర్య సత్యములు
2.
ఆర్య అష్టాంగ మార్గము

భగవాన్ బుద్ధుడు తాను పొందిన జ్ఞానాన్ని గురించి చాలా చోట్ల వివరించే టపుడు అది రెండు విధాలుగా ఉన్నదని చెప్పాడు.
ఒకటి- నాలుగు ఆర్య సత్యములను దర్శించుట.
రెండవది- ప్రతీత్య సముత్పాద నియమమును దర్శించుట.

నాలుగు
ఆర్య సత్యములు.
1.
దుఃఖము సత్యము
2.
దుఃఖ కారణము సత్యము
3.
దుఃఖ నాశనము సత్యము
4.
దుఃఖ నాశన మార్గము సత్యము.

ఆర్య అష్టాంగ మార్గము.
1.
సమ్యక్ దృష్టి
2.
సమ్యక్ సంకల్పం
3.
సమ్యక్ వాక్
4.
సమ్యక్ కర్మ
5.
సమ్యక్ ఆజీవం
6.
సమ్యక్ వ్యాయామం
7.
సమ్యక్ స్మృతి
8.
సమ్యక్ సమాధి

ఇవి తిరిగి శీల, సమాధి, ప్రజ్ఞలుగా విభజింప బడినవి. వీటిలో ఒక్కొక్కటి వివరంగా చూద్దాము. అపుడు బుద్ధుని దర్శనము, చింతన, బోధనలు స్పష్టంగా అర్థం చేసుకొనడానికి వీలవుతుంది.