నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

30, జూన్ 2009, మంగళవారం

మైకేల్ జాక్సన్ జాతకం

కళా కారులు, లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించే వారు జన్మించే త్రికోణ రాసులు మిథున, తులా, కుంభ రాసులు. వీనిలో ఒకటైన కుంభ రాశిలో మైకేల్ జాక్సన్ జననం జరిగింది. ఆయనే ఒకసారి తన జాతకం చెప్పించుకోడానికి ఒక భారతీయ జ్యోతిష్కునికి తన జనన సమయాన్ని రాత్రి 7.30 ప్రాంతం గా చెప్పాడు. ఆ సమయం ప్రకారం వేశిన జాతక చక్రం ఇక్కడ ఇస్తున్నాను.  ఈయన శ్రావణ బహుళ పాడ్యమి శుక్రవారం పూర్వాభాద్ర నక్షత్రం...
read more " మైకేల్ జాక్సన్ జాతకం "

29, జూన్ 2009, సోమవారం

కాళీ తత్త్వం-3

కాళికా దేవిని భయంకరంగా ఎందుకు చిత్రిస్తారు? సౌమ్య మూర్తిగా ఉండవచ్చు కదా? అని కొందరు అడుగుతారు. దీని వెనుక కొన్ని మౌలికమైన మనస్తత్వ అంశాలు దాగి ఉన్నాయి. ఈ ప్రశ్న చాలా సమంజసం గా ఉంటుంది. ఎందుకంటే మనకు అంతా సవ్యం గా జరగటం ఇష్టం గా ఉంటుంది. ఎక్కడా ఏ విధమైన నాశనం, ధ్వంసం లేకుండా హాయిగా సాగి పోవాలని ప్రతి మనిషి, జంతువు, పక్షి, క్రిమి కీటకాలతో సహా సమస్త ప్రకృతి కోరుకుంటుంది. కాని ప్రకృతి లో ఉన్న నియమం ప్రకారం ఎల్లకాలం అన్నీ హాయిగా...
read more " కాళీ తత్త్వం-3 "

27, జూన్ 2009, శనివారం

కాళీ తత్త్వం-2

కాళి అనగా ఒక క్షుద్ర దేవత అని తప్పుడు భావన ప్రపంచంలో ఉంది. దీనికి చాలా వరకు మన కథలు, సినిమాలు నమ్మకాలు కారణం. పాశ్చాత్యుల తప్పుడు ప్రచారం కూడా ఒక కారణం. కాని అసలు నిజం అది కాదు. కాళి గురించి తెల్సుసుకోవాలంటే తాన్త్రికులను అడగాలి. ఎందుకంటే ఆమె తాన్త్రికులకు ఇష్ట దేవత. ఆమె గురించిన రహస్యములు అన్నీ తంత్ర గ్రంథములలో నిక్షిప్తములై ఉన్నాయి.నవీన కాలములో కాళీ ఉపాసన ను పునరుజ్జీవింప చేసిన వారు శ్రీ రామకృష్ణ...
read more " కాళీ తత్త్వం-2 "