నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

6, సెప్టెంబర్ 2009, ఆదివారం

కడప ప్రజల స్పందన

నిన్న, మొన్న ఉద్యోగ రీత్యా ప్రత్యెక బాధ్యతలతో కడపలో ఉన్నాను. కడపలో అధికారులు, అనధికారులు, మిత్రులు, అభిమానులతో సంభాషణలలో నివ్వేరపరిచే అనేక విషయాలు తెలిసాయి.

సంభాషణ కడప జిల్లా ప్రాచీన చరిత్ర, దానికి కలెక్టర్లుగా పని చేసిన ఇంగ్లీషు దొరలు,YSR కుటుంబం, వారి తాతముత్తాతల వద్దనుంచి నేటి వరకు విషయాలు, సమకాలీన రాజకీయాలు,YSR దుర్మరణం ఇత్యాది అనేక విషయాలమీద సాగింది.

వీటిలో అనేకం నేను బయటకు చెప్పలేని,
బ్లాగులో వ్రాయటానికి అసలు వీలుకాని విషయాలున్నాయి. నాకున్నపరిమితుల దృష్ట్యా వీటిని పక్కన పెడితే కడప జిల్లా ప్రజల నోటివెంట నేను విన్న కొన్ని మాటలు ఇవి :-

>>కడప జిల్లాలో చరిత్రను చూస్తె, అకస్మాత్తుగా లేచి ఎదిగిన అనేకులు నాయకులు హటాతు గానే కనుమరుగుఅయ్యారు. లేచిన కెరటం పడక తప్పదు.
>> CM తదితరులు తమ fuel తామే మోసుకొని పోయి(Aviation fuel రూపంలో ) ఎక్కడో కొండల్లో చెట్ల మధ్యనతమ అంత్య క్రియలు తామే జరుపుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నవి బంధువుల తృప్తి కోసం వీరు చేస్తున్నఅంత్యక్రియలు మాత్రమె.
>>కులం మతం దేవుడు అనేవి అంత ముఖ్యమైన విషయాలు కావు. ఉన్నదల్లా డబ్బు ఒక్కటే. డబ్బే కులం, డబ్బేమతం, డబ్బే దేవుడు.
>>అవసరం ఒక్కటే ముఖ్యమైనది. మన పని కావటం ఒక్కటే ప్రధానం. దానికి అవసరమైతే అన్నీ మార్చుకోవచ్చు. కులం, మతం, ఏదీ అడ్డు కాదు. అవసరం వస్తే ఎందరినైనా అంతం చెయ్యొచ్చు.
>>హెలికాప్టర్ ఎక్కిన సూరీడు దిగి చావు తప్పించుకున్నాడు. కింద ఉన్న వెస్లీ ఎక్కి ప్రమాదం లో చిక్కుకున్నాడు.
>>CM కనిపించక పొతే 24 గంటలు కనుక్కోలేక పోవటం అధికార యంత్రాంగం ఎంతగా దారి తప్పిందో తెలుస్తున్నది. నాయకుల ఆజ్ఞలు పాలించటం, protocol డ్యూటీలు చెయ్యటం తప్ప అసలు Administration అనేది లేదు. ప్రజలసొమ్ము తినటానికే అధికారులున్నారు గాని పని చేయటానికి కాదు.
>> లక్షలాది పిచ్చి జనం ఎవరి మత ప్రార్థనలు వారు చేసారు. దేవుడు వీళ్ళ ప్రార్తనలు వినే పనైతే ప్రమాదం ఎందుకునివారించలేదు? ఇన్ని మహిమలు చేస్తున్న దేవుడు, కనీసం ప్రమాద స్థలాన్ని మహా భక్తుడికో ఎందుకుచూపలేదు? ఇరవై నాలుగ్గంటలు కాలుతూ, వానలో తడుస్తూ అడివిలో చెట్ల మధ్య ఎందుకు అవస్థ పట్టింది? కాబట్టి, ఎవడి కర్మ వాడనుభవించక తప్పదు. కాలం మూడినపుడు దేవుడూ అడ్డు రాడు. అసలు దేవుడనేది ఒక భ్రమ.
>> మానవ మాత్రుడు ఏమీ చెయ్యలేని స్థాయికి ఎదిగిన వాణ్ని, ప్రకృతే ఏదో ఒకటి చేస్తుంది.
>> రెండురోజుల్లో ఎవరు కారణంతో పోయినా, దుఖం భరించలేక పోయారు అని మీడియా ప్రచారం చెయ్యటం, ప్రజలను గొర్రెల్ని చెయ్యటమే.
>>రాష్ట్ర రాజకీయాలు భయంకర స్థితికి చేరుకున్నాయి. ఒక ప్లాన్ అనేది లేకుండా రాష్ట్రాన్ని ఏదో కొండ కొమ్ముకుతీసుకుపోతున్నారు. Welfare measures పూర్తిగా పక్కన బెట్టి శాస్త్రీయంగా ప్లాన్ ప్రకారం నడపకపోతే ముందుముందు రాష్ట్రం ఘోర విపత్తులో పడబోతున్నది. ఇప్పటికే సామాన్యుడు బ్రతకలేని పరిస్తితి ఉంది. ముందు ముందుఇంకేం జరుగుతుందో.

ఇవీ నేను కడప జిల్లాలో కొందరు ప్రజల నోటి వెంట విన్న- బ్లాగులో వ్రాయదగ్గ- కొన్ని విషయాలు.