నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, సెప్టెంబర్ 2009, బుధవారం

నేటి రాజకీయాలు-సమాజం-వేమన పద్యం

మధ్యలో జరుగుతున్నరాజకీయ పరిస్థితిని చూస్తుంటే నాకు వేమన పద్యం ఒకటి గుర్తుకొచ్చింది.

అంతరంగమందు అపరాధములు చేసి
మంచివాని వలెనె మనుజుడుండ
ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా
విశ్వదాభిరామ వినుర వెమ.

నేటి సమాజంలో విచిత్ర పోకడలు ఎక్కువ అవుతున్నాయి. భక్తులమని చెప్పుకునేవారు, మతాలు మార్చేవారుఘోరమైన పాపాలు చేస్తున్నారు. ప్రజలందరూ ఏదో ఒక దేవుణ్ణి నమ్మేవారే. కాని తప్పులు పాపాలు కూడా విచ్చలవిడిగా చేస్తున్నారు. వారానికొకసారి చర్చికో, గుడికో, మసీదుకో ఇవి కాకపోతే ఇంకెక్కడికో పోయి నమస్కారం పడేసివస్తే అన్నీ ప్రక్షాళన అయిపోయి మళ్ళీ clean slate మిగులుతుంది. అనుకోడం పెద్ద భ్రమ. ఇలా జరుగుతుంది అనిచెప్పే మత గ్రంథాలు కూడా తప్పుల తడికలే. వాటిని నమ్మటమే ప్రజలు చేస్తున్న పెద్ద తప్పు.

మనం చేసిన పాపాలు ఎక్కడికీ పోవు. దేవుడూ వాటిని క్షమించడు. అలా క్షమిస్తూ పొతే ఇక సృష్టికే అర్థం లేదు. ఒకరాజ్యంలో రాజుగారు- మీరేం తప్పులు చేసినా నేను క్షమిస్తూ ఉంటాను. ఏమీ పరవాలేదు అని చెబితే రాజ్యంలోఎంతమంది పాపాలు చెయ్యకుండా ఉంటారో మనం తేలికగా ఊహించవచ్చు. మనం ఒక దేవుణ్ణి నమ్మినంత మాత్రానమనం చేసిన పాపాలు పోతాయనుకోవటం పెద్ద భ్రమ. మళ్ళీ అవే పాపాలు చేస్తూ పోవటం ఇంకో ఘోరమైన తప్పిదం.

నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అనేది కూడా ఒక పెద్ద భ్రమ, దీర్ఘ రోగం. దీనివల్ల మనుషుల్లో తగాదాలు గొడవలు, ప్రేమ తత్త్వం లేకపోవటం, ఒకరిని చూస్తె ఒకరికి పడక పోవటం జరుగుతున్నాయి. దీన్నలా ఉంచితే, తాను చేస్తున్నదితప్పు అని తెలిసినా ఏదో కారణం చూపి సమర్థించుకునే పోకడలు, ఏదో ఒక దేవుని నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని తనపాపాలు క్షమించబడతాయని గుడ్డిగా నమ్మటం ఒక పెద్ద బలహీనత. అలా ఎన్నటికీ జరుగదు. జరిగినట్లు దాఖలాలులేవు. అమాయకులైన వారినే ఇలాంటి పిచ్చి నమ్మకాలతో వంచించి మతాలు మార్చగలరు. మాత్రం తెలివి ఉన్నామనిషి ఇలాంటి ఎత్తులకు లొంగ కూడదు.

మనుషులలో reason అనేది ఉంది. దానిని ఎందుకు ఉపయోగించరో అర్థం కాదు. లౌకిక జీవితంలో ఎంతో తర్కాన్ని, తెలివిని ఉపయోగించే మనుషులు, మతం దగ్గరికి వచ్చేసరికి దాన్ని పెట్టెలో పెట్టి తాళం వేస్తారు. ఏదో ఒక చెదలు పట్టినమత గ్రంధం చెబుతున్నది కనుక మనం నమ్మాలి. నమ్మకాన్ని ప్రశ్నిస్తే blasphemy దైవద్రోహం చేసినట్టుఅవుతుంది అన్న కాకమ్మ కబుర్లు చెప్పి ఇతర మతాలలో జనానికి నరక భయం బూచిలా చూపి అణగదొక్కి ఉంచారు. ఒక్క సనాతన ధర్మం అనబడే హిందూ మతం మాత్రమె ఎల్లలు లేకుండా ప్రశ్నించటాన్ని ఆమోదించింది. ఇది నమ్మకంమీద ఆధారపడినట్టి మతం కాదు. తన సిద్ధాంతాలను కూడా ప్రశ్నించిన తదుపరి మాత్రమె ఆచరించు అనిఘంటాపధంగా చెప్పిన మతం ఇదొక్కటే. వేదాలలోంచి ప్రమాణం చూపటం ఎందుకు? భగవద గీత లోనుంచి ఇదుగోప్రమాణం--త్రైగుణ్యా విషయా వేదా నిస్త్రై గుణ్యో భవార్జున--

ఏదో ఒక మతం ప్రచారం చేస్తున్న దేవుణ్ణి నమ్మనంత మాత్రాన నరకం వస్తుంది అని హిందూ మతం ఎక్కడా చెప్పలేదు. సనాతన ధర్మం వంటి ఉదాత్త మతానికి, అసలు అటువంటి ఆలోచనే హాస్యాస్పదం గా కనిపిస్తుంది. నువ్వు పాపాలుచేస్తే దానికి శిక్ష అనుభవించాలి కనుక మంచిగా పవిత్రంగా జీవించు అని మాత్రమె మహోన్నతమైన మతంచెప్పింది. idea అమలులో ఉంది గనుకనే ప్రాచీన భారతీయులలో అబద్దాలు చెప్పటం,దొంగతనం, వ్యభిచారంమొదలైన పాపాలు లేవు. విషయాన్ని మధ్య యుగాలలో మన దేశాన్ని దర్శించిన విదేశీ యాత్రికులు ఎందఱోవ్రాసారు. అదే మధ్య యుగాలలో- నేడు ప్రపంచ మతాలుగా ప్రచారం చేసుకుంటూ జనాన్ని మోసం చేస్తున్న మతాలుపుట్టిన దేశాలు- దారి దోపిడీలు, దురాక్రమణలు, హత్యలు, సమస్త పాపాల పుట్టలుగా ఉన్నాయి. దురదృష్ట వశాత్తూకలి ప్రభావం ఎక్కువై కుక్క మూతి పిందేల్లాంటి ఇతర దేశాల మతాలు మన దేశంలోకి చోచుకు వచ్చి "ఎన్ని తప్పులుపాపాలు చేసినా పరవాలేదు, క్షమించబడతాయి. మా దేవుణ్ణి నమ్మండి చాలు" అనే అసంబద్ద అహేతుక వాదనలతోపాపాలు చెయ్యటానికి లైసెన్సు ఇచ్చాయి. ఇటువంటి మతాలవల్లనే నేడు సమాజంలో పాపాలు మోసాలు ఎక్కువఅయ్యాయి. శిక్షలు కూడా వాటికి తగినట్టే పడుతున్నాయి. కళ్లు తెరిచి చూస్తె అన్నీ కనిపిస్తాయి. నమ్మకం విశ్వాసంచాటున దాక్కుంటే ఏవీ కనిపించవు.

బెర్ట్రాండ్ రస్సెల్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు.
I would never die for my beliefs because I might be wrong.
నమ్మకం కోసం నా ప్రాణాలు ఎన్నటికీ అర్పించను. ఎందుకంటే నా నమ్మకం తప్పు కావచ్చు. అంటాడు. నమ్మకం వల్లనేమనిషి తప్పులు చేస్తున్నాడు. దాని బదులు reason ఉపయోగిస్తే మనిషి తప్పులు పాపాలు చెయ్యడు. తిరిగి తిరిగి అవేపాపాలు చేస్తూ దేవుని మీద నమ్మకం అనే ముసుగు చాటున దాక్కునే పనీ చెయ్యడు. రీజన్ అన్న దాన్ని ఒక్కహిందూ మతమే గొప్పగా పెంచి పోషించింది. ఇతర మతాలలో రీజన్ అణగదొక్కబడి దాని స్థానంలో గుడ్డి నమ్మకంవేళ్ళూనుకుంది. పెంచి పోషించబడింది. అందుకే హిందువుగా పుట్టిన వానికి పరమత సహనం ప్రత్యేకంగానేర్పనక్కరలేదు. అలాగే ఇతర మతాల వారికి హింస, ద్వేషం ప్రత్యేకంగా నేర్పనక్కరలేదు.

కాని ప్రక్రుతి కళ్లు మూసుకొని ఊరుకోదు. ప్రకృతికి మన మత గ్రంధాలు, పిచ్చి నమ్మకాలతో పని లేదు. ప్రక్రుతి లోనేభగవంతుడు నిండి ఉన్నాడు అని భారతీయ సనాతన ధర్మం చెబుతుంది. ఆరు రోజులు సృష్టి చేసి తరువాత రెస్టుతీసుకుంటున్నాడు. అని ఎక్కడా చెప్పలేదు. ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యా జగత్... అంటూ విశ్వమంతానిండి నిబిడీకృతమై భగవంతుడు ఉన్నాడు అని చెప్పింది.

భగవంతుడు మనం చేస్తున్న తప్పులు, ఆడుతున్న నాటకాలు చూస్తూ, మన దొంగ ప్రార్ధనలకు కరిగిపోతూ మనపాపాలను క్షమిస్తూ ఊరుకొడు. ఎక్కడికక్కడ ఎవరికీ తగిన శిక్షలు వారికి పడుతూనే ఉంటాయి. స్వర్గం నరకం ఎక్కడోలేవు. చూడగలిగితే ఇక్కడే ఉన్నాయి.ఇతరులెరుగకున్న ఈశ్వరుండు ఎరుగడా అని వేమన ప్రశ్నించింది ఇటువంటిడంబాచార పరాయణులనే.