మొన్న 26-9-2009 న శ్రీమతి స. ఆగని దగ్గుతో రాత్రి పదకొండు గంటలకు ఆస్పత్రిలో చేరింది. డాక్టర్లు బ్రాంఖైటిస్ అనిట్రీట్మెంటు మొదలు పెట్టారు. సరైన గుణం కనిపించటం లేదు. డాక్టర్లు వారి మాట వారిదే గాని మన మాట వినరు కదా.
27-9-2009 సాయంత్రం 6.50 కి ప్రశ్న కుండలి వేసి అసలు సమస్య ఎక్కడ ఉంది అని చూడటం జరిగింది.
లగ్నం మీనం-27-03
లగ్నాధిపతి - గురువు
నక్షత్రాధిపతి-బుధుడు
KP సబ్ అధిపతి- గురువు
హోరాధిపతి-గురువు
గురువు వక్రించి రాహువుతో కలసి ఉన్నాడు. బుధుడు రోగ స్థానంలో శుక్రునితో కలసి వక్ర స్థితిలో ఉన్నాడు. కనుక- అసలు సమస్య జీర్ణ కోశం లోనూ, ఇంకా చెప్పాలంటే లివర్, గాళ్ బ్లాడర్ లోనూ ఉంది అని చెప్పాను. గురువు రాహువుతో కలసిఉండటంతో సమస్య వెంటనే అర్థం కాక డాక్టర్లు కూడా మోసపోతారు. బుధుని రోగ స్థాన స్థితితో నరాల నొప్పులు ఉంటాయి.
మరి ఎప్పటికి నయం కావచ్చు? అని ఇంకో ప్రశ్న వేశాడు పృచ్చకుడు . రోగ స్థానం లో ఉన్న బుధుడు 29-9-09 కి వక్ర గతి వీడి రుజుత్వంలోకి వస్తున్నాడు. కనుక ఆ రోజుకు నయం కావచ్చు. కాని చంద్రుడు మీన రాశిలో ఇదే డిగ్రీకి 4-10-2009 నాటికివస్తున్నాడు. కనుక పూర్తిగా నయం అయ్యి ఇంటికి వచ్చే సరికి 4-10-2009 అవుతుంది అని ఊహించాను. అదే మాట చెప్పాను.
మరుసటి రోజు స్కానింగ్ తీయగా fatty liver and sluldge formation in gall bladder అని రిపోర్ట్ వచ్చింది. దగ్గుఅనేది అనుబంధ లక్షణం కాని, అసలు బాధ జీర్ణ కోశం లోనే ఉంది అని తెలిసింది. దానికి తగిన మందులు వాడగా 29-9-09 కి రిలీఫ్ వచ్చింది. డిశ్చార్జి చెయ్యమని అడుగగా నాలుగు రోజులు అబ్జర్వేశన్లో ఉంచుదాం అని చెప్పి చివరికి 4-10-09 ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసారు.
ప్రశ్న జ్యోతిష్యం నిత్య జీవితంలో ఎలా ఉపయోగ పడుతుందో ఇదొక ఉదాహరణ. అద్భుతాలు మన మధ్యనే జరుగుతుంటాయి. చూచే దృష్టి మనకు ఉండాలి. అంతే.