
అవతార సంకల్పంకం || అలపాల కడలి యందునచెలువంబున లక్ష్మి చెంత నలరుచు నుండన్తిలకించుచు సురలెల్లరునిలలో దుష్టుల దునుమగ నిను బిలువగనే ||రఘువంశమున జననంకం || ఇనకులమున నింపారగఘన కీర్తిని బుట్టినావు గణముల తోడన్అనవరతము ప్రీతి గొనుచుతనయుల బెంచగ నధిపుడు కొనగొని సతులున్ ||యాగ రక్షణం - సీతా పరిణయంకం || వీక్షిం పుచు యాగంమునురక్షించితి వీవు దాని రాక్షస వధచేదీక్షగ శివు విల్లు విరచిదక్షత వరియించినావు ధరణీ జాతన్ ||అరణ్య...