ఎన్నిసార్లు ఆడావీ నాటకం
ఈ విశాల రంగస్థలంలో
పోషించావు ప్రతి పాత్రనీ
రకరకాల వేషాలలో
నీ కోసమా
వీక్షకుల కోసమా
ఈ అంతులేని నాటకం
ఆలోచించు ఒకసారి
నాటకం ముగిశాక
ప్రతిసారీ మిగిలేది
నువ్వూ, రంగస్థలం
కాదనగలవా మరి
అన్ని పాత్రలూ నీకు
సుపరిచితాలే కదా
ప్రతి నాటకమూ
విషాదాంతమే. కాదా?
ఆ ప్రేమ మధువు కోసం
తిరిగావెన్నో పానశాలలు
రకరకాల వేషాలలో
నీ కోసమా
వీక్షకుల కోసమా
ఈ అంతులేని నాటకం
ఆలోచించు ఒకసారి
నాటకం ముగిశాక
ప్రతిసారీ మిగిలేది
నువ్వూ, రంగస్థలం
కాదనగలవా మరి
అన్ని పాత్రలూ నీకు
సుపరిచితాలే కదా
ప్రతి నాటకమూ
విషాదాంతమే. కాదా?
ఆ ప్రేమ మధువు కోసం
తిరిగావెన్నో పానశాలలు
నీ ప్రియ వధువు కోసం
వెదికావెన్నో సుదూర లోకాలు
యాచించావెన్నో చోట్ల
నీవు కోరే అమృతాన్ని
నీవు కోరే అమృతాన్ని
ఎవ్వరూ నీకివ్వలేదు
నీవాశించే స్వాగతాన్ని
చూచావా ఎన్నడైనా
యుగాల నీ దాహం
తీర్చే మధురజలం
దొరికిందా ఎక్కడైనా?
రగులుతున్న నీ హృదయం
ఆశించిన చల్లదనం
రగులుతున్న నీ హృదయం
ఆశించిన చల్లదనం
చేజారిందిగా నువు కోరే
అద్భుత స్వర్గం
దొరికిన ప్రతిసారీ
ఏ మోమున చూచినా
చీకటి నీడలే గాని
నువు కోరిన దరహాసం
లేదుకదా ఈ లోకంలో
ఎక్కడికో నీ పయనం
ఎందుకో ఈ ఆరాటం
పయనిస్తున్న పడవలో
సహచరులు లేరేవ్వరూ
సుదూర తీరం నుంచి
మరల్చు నీ దృష్టిని
నీ లోనికి
ఎందుకో ఈ ఆరాటం
పయనిస్తున్న పడవలో
సహచరులు లేరేవ్వరూ
సుదూర తీరం నుంచి
మరల్చు నీ దృష్టిని
నీ లోనికి
నీ ఉనికే నీకు తోడు
కూల్చి వెయ్యి నీ సృష్టిని
వెరువకు లోకానికి
ఏకాకిగా నావను నడుపుతూ
మహాసముద్ర మధ్యంలో
ఎక్కడికి నీ ఒంటరి పయనం
ఎక్కడుంది నీ గమ్యం?
ఎన్ని యుగాల అన్వేషణ ఇది?
ఎన్ని జన్మల ఆలోచన ఇది?
మహాసముద్ర మధ్యంలో
ఎక్కడికి నీ ఒంటరి పయనం
ఎక్కడుంది నీ గమ్యం?
ఎన్ని యుగాల అన్వేషణ ఇది?
ఎన్ని జన్మల ఆలోచన ఇది?
నిశీధిలో పాంధుని వలె
గమ్యం లేని ప్రయాణం
చివరికి తప్పని ఆశాభంగం
ప్రతి పానశాలా
నువ్వెళ్ళే సరికి మూతపడింది
ప్రతి ఇంటి ముందూ నీ భిక్షాపాత్ర
ఖాళీగా మిగిలింది
చివరికి తప్పని ఆశాభంగం
ప్రతి పానశాలా
నువ్వెళ్ళే సరికి మూతపడింది
ప్రతి ఇంటి ముందూ నీ భిక్షాపాత్ర
ఖాళీగా మిగిలింది
నీకేం కావాలో
నీకే తెలియదు
అయినా ఆగదు పయనం
ఇదే నీ జీవితచిత్రం
ఓ అవిశ్రాంత ప్రేమికా
నీ ప్రేమను పొందే అర్హత
ఇక్కడ లేదేవ్వరికీ
తెలుసుకో ఈ నిజం
ఓ నిరంతర అన్వేషకా
దొరకదు నీ గమ్యం
ఎన్నటికీ...నమ్మవా?
శోధించు నీ గతం
చూచుకో నీ చేతులను
ఖాళీగా మిగిలాయి చివరికి
దర్శించు నీ హృదయాన్తరంగం
శూన్య నివాసం కాదా ఎప్పటికీ
నీ మహా సౌధంలో
నీవుంచిన ప్రతి ప్రతిమా
మరుక్షణం భగ్నమైంది
లేదంటావా ?
మధుర శిల్పి చేతి ఉలి
నేలరాలి మట్టిలో కలిసింది
మనసు లేని శూన్య మందిరం
నవ్వుతూ నిను వెక్కిరించింది
ఎవరికి కావాలి?
ఉచితంగా నీవిచ్చే
అనర్ఘ ప్రేమ రత్నం
నమ్ముతారా నిన్ను?
నీ ప్రేమను పొందే అర్హత
ఇక్కడ లేదేవ్వరికీ
తెలుసుకో ఈ నిజం
ఓ నిరంతర అన్వేషకా
దొరకదు నీ గమ్యం
ఎన్నటికీ...నమ్మవా?
శోధించు నీ గతం
చూచుకో నీ చేతులను
ఖాళీగా మిగిలాయి చివరికి
దర్శించు నీ హృదయాన్తరంగం
శూన్య నివాసం కాదా ఎప్పటికీ
నీ మహా సౌధంలో
నీవుంచిన ప్రతి ప్రతిమా
మరుక్షణం భగ్నమైంది
లేదంటావా ?
మధుర శిల్పి చేతి ఉలి
నేలరాలి మట్టిలో కలిసింది
మనసు లేని శూన్య మందిరం
నవ్వుతూ నిను వెక్కిరించింది
ఎవరికి కావాలి?
ఉచితంగా నీవిచ్చే
అనర్ఘ ప్రేమ రత్నం
నమ్ముతారా నిన్ను?
కోరినది వారికి దొరికిన క్షణం
ఈలోకపు సంతలో నీవు
కనుమరుగైన మరుక్షణం
తలుస్తారా నిన్ను?
నీ ప్రేమమయ రత్నపు
విలువ తెలుస్తుందా?
గులకరాళ్ళ మోజులో
కళ్ళు చెదిరిన వాళ్లకు
నువ్వొక పిచ్చివాడివి
పిచ్చివాళ్ళది కాదీ లోకం
అచ్చమైన దళారులది
ఇక్కడ నీకేం పని?
సాగిపో నీ నిశీధ దారులలో
చీకటి మహాసౌందర్యవతి
నడచిపో నీ అగమ్య సీమలలో
నిరంతర పయనమే నీ గతి
నాకూ చెప్పవా ఆ రహస్యం
నీ గమ్యం చేరిన నాడు
నాకూ చూపవా ఆ దారి
నీ దాహం తీరిన నాడు
అప్పటిదాకా
సాగిస్తా నా పయనం
నీ లాగే....
అప్పటిదాకా
సాగిస్తా నా పయనం
నీ లాగే....