శుక్రుడు ఈ రోజు కన్యారాశిని వదలి తులా రాశిలో ప్రవేశించాడు.
దీనివల్ల కొన్ని సంఘటనలు జరుగుతాయి.
కుజుడు అగ్నితత్వ గ్రహం. శని వాయు తత్వ గ్రహం. వీరి కలయిక వల్ల అగ్నికి వాయువు తోడైనట్లుగా ఉంటుంది. కనుక కుజ శనుల కలయిక అగ్ని ప్రమాదాలకు పేలుళ్ళకు దారితీస్తుంది.శుక్రుడు జలగ్రహం. కనుక శుక్రుని జలప్రభావం వల్ల ఆ ప్రమాదాలు జరుగవు. లేదా ఒకవేళ జరిగినా తక్కువ స్థాయిలో జరుగుతాయి. నిప్పును నీరు ఆర్పినట్లు శుక్రుని ప్రభావం పనిచేస్తుంది.
కాని నేడు శుక్రుడు, కన్యారాశిలో ఉన్న కుజశనులను వదలి తనదైన తులా రాశిలో ప్రవేశించాడు.
కనుక శుక్రుని జలప్రభావం వారిమీదనుంచి తొలగి పోతుంది. నీరు దూరమైతే అగ్ని మళ్లీ మండటం మొదలు పెడుతుంది. అప్పుడు మళ్లీ అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, భవన ప్రమాదాలు, బాంబు పేలుళ్ళు విజృంభిస్తాయి.
చూద్దాం ఏం జరుగుతుందో?