Once you stop learning, you start dying

27, నవంబర్ 2010, శనివారం

మనం మానవులమేనా?

నదులు, చెట్లు, కొండలు మన భూమికి సంపదలు. నదులు జీవజలంతో మనల్ని పోషిస్తున్నాయి. పంటలు పండిస్తున్నాయి. మనల్ని బ్రతికిస్తున్నాయి. చెట్లు మనకు ఆక్సిజన్ ఇచ్చి కాపాడుతున్నాయి. కళ్లకు ఇంపుగా చక్కటి వాతావరణాన్నిస్తున్నాయి. నీడనిస్తున్నాయి. పూలను కాయలను ఇస్తున్నాయి. వర్షాన్ని ఆకర్షిస్తున్నాయి. కొండలు పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి. మేఘాల్ని అడ్డుకుని వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి మానవుని జీవనానికి సహాయపడుతున్నాయి.మరి మనమేం చేస్తున్నాం?...
read more " మనం మానవులమేనా? "

22, నవంబర్ 2010, సోమవారం

కార్తీక సోమవారం శ్రీశైల యాత్ర

మనం అనుకోని ఏదైనా చేస్తే అది మన సంకల్ప ఫలితం. అనుకోకుండా ఒక పని చెయ్యవలసి వస్తే అది భగవత్సంకల్పం. అనుకోని వ్యక్తులు తటస్థ పడటం అద్భుతం. గమనించే ప్రజ్ఞ ఉంటే అద్భుతాలు ప్రతిరోజూ కనిపిస్తాయి. అలాటి సంఘటన ఈ మధ్యన జరిగింది. మొన్న పదిహేనో తేదీన ఒక వీవీఐపీ గారితో కలిసి శ్రీశైలం సందర్శించే అవకాశం పరమేశ్వరుడే కల్పించాడు. ఆదివారమే అడ్వాన్స్ పార్టీగా అక్కడకు చేరి అన్ని ఏర్పాట్లూ సరిగ్గా ఉన్నాయా...
read more " కార్తీక సోమవారం శ్రీశైల యాత్ర "

18, నవంబర్ 2010, గురువారం

హస్త సాముద్రికం

జ్యోతిష్యం లో సాముద్రిక శాస్త్రం కూడా ఒక భాగం. దీనిలొ మనిషి యొక్క అవయవాలపొందికను, తీరును బట్టి అతని జీవితాన్ని చదవవచ్చు. దీనిలో హస్త సాముద్రికం ఒక విశిష్ట విద్య. వేళ్ళ అమరిక మనిషి మనస్తత్వాన్నితెలియచేస్తుంది. హస్త రేఖలు ఇంకా అనేక జీవిత వివరాలను తెలియ చేస్తాయి. జ్యోతిష్యం కంటే ఇది నేర్చుకోవటంతేలిక. కారణం ఏమంటే,దీనిలో విశ్లేషణలు ఉండవు. క్లిష్టమైన గ్రహ కారకత్వాలు ఉండవు....
read more " హస్త సాముద్రికం "

11, నవంబర్ 2010, గురువారం

నేనెదురు చూస్తున్న సినిమా

సామాన్యంగా నేను సినిమాలు చూడటం చాలా తక్కువ. కొత్త తెలుగు సినిమాలంటే నాకు చచ్చే భయం. వాటి జోలికైతే అస్సలు పోను. హీరో హీరోయిన్ల వెకిలి నటనలు, వెకిలి డైలాగులు, డోకొచ్చే హాస్యాలు, ఎందుకు చేస్తున్నారో తెలియని చెత్త డాన్సులు, అనవసర హింసా, చెత్త ఫైట్లూ ఇవన్నీ చూచే ధైర్యం నేను చెయ్యలేను. నేను లేటెస్ట్ గా చూసిన తెలుగు సినిమాలు --"అరుంధతి"-- దాని తర్వాత "రోబో". కాని ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని నేను ఎదురు...
read more " నేనెదురు చూస్తున్న సినిమా "

7, నవంబర్ 2010, ఆదివారం

అమావాస్య ప్రభావం మళ్ళీ మళ్ళీ ?

మొన్న ఐదో తేదీ శుక్రవారం నాడు పాకిస్తాన్ లో మసీదులో బాంబులు పేలి నూరు మంది పైగా హతం అయ్యారు. ఆ రోజున దీపావళి అమావాస్య. అమావాస్య ఘడియలు అప్పుడే మొదలయ్యాయ్. కొద్ది సేపటిలోనే ముస్లిం తీవ్రవాది అయిన సూయిసైడ్ బాంబర్ మీద అమావాస్య చంద్రుని ప్రభావం, బలహీన బుధుని ప్రభావం, రాహువు ప్రభావం కలసి పనిచేసి అతన్ని ప్రేరేపించి బాంబు పేలుడుకు పురికొల్పాయి. మొత్తం నూరు మందికి పైగా చనిపోయారు. పాకిస్తాన్ ముస్లిములు...
read more " అమావాస్య ప్రభావం మళ్ళీ మళ్ళీ ? "

5, నవంబర్ 2010, శుక్రవారం

సర్దార్ పటేల్ జాతకం-- జనన కాల సంస్కరణ

రాజకీయాలను నేను ఏ మాత్రం ఇష్టపడను. దానికి కారణం విలువలు లేని రాజకీయ నాయకులతో ప్రస్తుతం ఆ రంగం నిండిపోవటమే. నా అభిమాన రాజకీయ నాయకులు ఎవరు అని అడిగితె ఇద్దరు ముగ్గురి పేర్లు మాత్రమెచెప్పగలను. వారూ ఇప్పటివారు కారు. ఇప్పుడు లేరు. వారిలో ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ను నేను అమితంగా అభిమానిస్తాను. గౌరవిస్తాను. ఆయనలాటి ధృఢచిత్తం, దూరదృష్టీ ఉన్న నాయకులు ఇప్పుడు మన దేశానికి చాలా అవసరం.నేను గుజరాత్ లోని సోమనాధ...
read more " సర్దార్ పటేల్ జాతకం-- జనన కాల సంస్కరణ "

4, నవంబర్ 2010, గురువారం

దీపావళి శుభాకాంక్షలు

ఈ దీపావళి పండుగ పర్వదినాన "ఆలోచనా తరంగాలు" బ్లాగు సభ్యులకు, చదువరులకు, తోటి తెలుగుబ్లాగర్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరి హృదయాలలో దివ్య దీపాలు వెలగాలి. అజ్ఞాన తిమిరాలు పోవాలి. ఆనందపు జ్యోతులు విరజిమ్మాలి అని ఆకాంక్షిస్తున్నాన...
read more " దీపావళి శుభాకాంక్షలు "