మొన్న ఐదో తేదీ శుక్రవారం నాడు పాకిస్తాన్ లో మసీదులో బాంబులు పేలి నూరు మంది పైగా హతం అయ్యారు. ఆ రోజున దీపావళి అమావాస్య. అమావాస్య ఘడియలు అప్పుడే మొదలయ్యాయ్. కొద్ది సేపటిలోనే ముస్లిం తీవ్రవాది అయిన సూయిసైడ్ బాంబర్ మీద అమావాస్య చంద్రుని ప్రభావం, బలహీన బుధుని ప్రభావం, రాహువు ప్రభావం కలసి పనిచేసి అతన్ని ప్రేరేపించి బాంబు పేలుడుకు పురికొల్పాయి. మొత్తం నూరు మందికి పైగా చనిపోయారు. పాకిస్తాన్ ముస్లిములు ఈ విధం గా దీపావళి పండుగను జరుపుకున్నారు.
ఇది జరిగి రెండురోజులు కాలేదు. ఇప్పుడు జల్ తుపాను దక్షిణ భారతాన్ని ఒణికిస్తోంది. మళ్ళీ ఇవన్నీ అమావాస్య కు ఖచ్చితంగా అటూ ఇటూగా జరుగుతున్నాయి. కనుక చంద్రుని స్థితులకు భూమి మీది విలయాలకు ఖచ్చితమైన సంబంధం ఉందని మాటి మాటికీ రుజువౌతున్నది.
ఆ రోజు గ్రహస్థితి ఇక్కడ ఇచ్చాను. బుద్ధి కారకుడైన బుధుడు సున్నా డిగ్రీలలో ఉంది అతి బలహీనుడుగా ఉన్నాడు. కనుక ఎవరు ఏమి చేస్తున్నారో తెలియని పరిస్తితి అప్పుడు ఉన్నది. గురువు కూడా బలహీనుడుగా ఉన్నాడు. నవాంశ లోబుధ రాహువులు కలిసి కుట్రలను సూచిస్తున్నారు. అందువల్లనే ఈ విలయం జరిగింది.
పాకిస్తాన్, భారత దేశాలకు జనన చక్రం దాదాపు గా ఒక్కటే. బహుశా అందువల్లనే ఈ రెండు దేశాలలో ఇప్పుడు ఈవిలయాలు జరుగుతున్నాయి. అయితే వర్గ చక్రాలలో చాలా భేదాలు ఉన్నాయి. అందుకని అక్కడ బాంబు పేలుళ్లుఇక్కడ తుఫానులు కనిపిస్తున్నాయి. నవగ్రహాలలో ఏడు గ్రహాలు ఒక ప్రక్కన చేరి ఉండటం చూడవచ్చు. ఇలాటిసమయాలలో పంచ భూతాలలో అసమతుల్యత ఏర్పడుతుంది.
సూర్య చంద్ర గ్రహాల ప్రభావం భూ వాతావరణం మీద మాత్రమె కాదు మానవ మస్తిష్కాల మీద కూడా ఉంది అని ఎన్నోసార్లు రుజువౌతున్నది. ఈ ప్రభావాలు స్థూలం గానే కనిపిస్తుంటాయి. మిగిలిన గ్రహాల ప్రభావాలు సూక్ష్మ స్థాయిలోపనిచేస్తుంటాయి. మనిషి జీవితం లో ఈ ప్రభావాలు ఎలా పనిచేస్తాయి అన్నది జాతకం ద్వారా చాలావరకూ కరక్ట్ గాఊహించవచ్చు. కాని మేదినీ జ్యోతిష్యం లో కూడా దీనిని సాధించగలిగితే ప్రక్రుతి విలయాలను ముందుగానేకనిపెట్టవచ్చు.
అయితే ఈ గ్రహ ప్రభావం ఒక సమయానికి ఒక స్థలం లోనే ఎందుకు పనిచేస్తున్నది? ఈ ఘటనల వెనుక దాగి ఉన్నసూత్రాలు నియమాలు ఏమిటి? అన్న ప్రశ్నలకు జవాబులు రీసెర్చి ద్వారా కనుక్కోగలిగితే మొత్తం చిక్కు ముడివిడిపోయినట్లే. ఆ దిశగా ఔత్సాహికుల ప్రయత్నాలు సాగవలసి ఉంది.