ఏప్రిల్ 17 న పౌర్ణమి ఘడియలు ప్రవేశిస్తున్నాయి. పౌర్ణమీ అమావాస్యలు ప్రతి నెలా వస్తూనే ఉంటాయి.అందులో వింతేముంది. ప్రతిసారీ విశేషాలు జరగవు కదా అనుకోవచ్చు. అది నిజమే. కాని ఈ సారి కొన్ని దుర్ఘటనలు జరుగవచ్చు అనడానికి కొన్ని సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.
>>>ఏప్రిల్ పదిహేనో తేదీన రవి మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
>>>పదిహేడో తేదీన ధనూరాహువు మేషసూర్యునితో ఖచ్చితమైన పంచమ కోణదృష్టి కలిగి ఉన్నాడు.
>>> పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో, నవాంశ చక్రంలో రవి రాహువులు, చంద్ర కేతువులు కలిసి ఉన్నారు.
>>> పదిహేడో తేదీన వక్ర శనికి చంద్రుడు రెండు డిగ్రీల దూరంలో కన్యా రాశిలో ఉన్నాడు.
>>> అదే రోజున కుజుడు మీనరాశినుంచి, కన్యా రాశిలోనున్న శనికి ఖచ్చితమైన సమసప్తకం లో ఉన్నాడు.
కనుక ఈ సమయంలో దుర్ఘటనలు జరగడానికి అవకాశం బలంగా ఉంది. అవి ఏ రకంగా ఉండవచ్చు? అనే విషయం కొంత ఊహిద్దాం. కుజుడు అగ్నితత్వ గ్రహం, కనుక జల తత్వ రాశి అయిన మీనంలో అతనికి సుఖంగా ఉండదు. కనుక సముద్రంలో అలజడి కలుగవచ్చు. భూతత్వ రాశి అయిన కన్యలో, వాయు తత్వ గ్రహమైన శనీ, జల తత్వగ్రహమైన చంద్రుడూ అతి దగ్గరగా ఉండటం వల్ల, సముద్రంలో తుఫాను సూచితం అవుతున్నది. లేదా భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, జల వాయుయాన ప్రమాదాలు కూడా సూచితములే. శని సామాన్యజనానికి, చంద్రుడు సెంటిమెంట్ కూ, కుజుడు గొడవలకూ కారకులు గనుక ప్రజా ప్రతిఘటనలూ, తిరుగుబాట్లూ కూడా జరుగవచ్చు.
మీనరాశి ఈ దేశాలను సూచిస్తుంది:--Egypt, Normandy, North Africa, Portugal, Samoa, Scandinavia
కన్యారాశి ఈ దేశాలను సూచిస్తుంది:--Brazil, Greece, Switzerland, Turkey, Crete, Uruguay, West Indies.
కనుక, శని కుజుల సమసప్తక స్థితి వల్ల, ఈ దేశాలలో గొడవలు, ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. వీటిలో కూడా ఈజిప్ట్, పోర్చుగల్, బ్రెజిల్, గ్రీస్, టర్కీ, వెస్ట్ ఇండీస్ లలో ఈ సంఘటనలు జరుగవచ్చు.
ఇక పొతే, భారతదేశపు రాశి అయిన మకరం నుంచి ధర్మాచార్యులను సూచిస్తున్న నవమం అయిన కన్యలో శని చంద్రుల ఈ స్థితి కలుగుతున్నందున, అదీ మనకు స్వాతంత్రం వచ్చిన వృషభ రాశికి పంచమం లో ఉన్నందున, మన దేశంలో మతాచార్యులకు సంబంధించి ప్రజలకు మనో వేదన కలిగించే ఒక దుర్ఘటన జరుగవచ్చు. ఈ సంఘటనలు ఏప్రియల్ 15 నుంచి 18 లోపు జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.