ఒకే సమయంలో పుట్టిన కవలల జీవితాలు విభిన్నంగా ఎందుకుంటాయి? ఈ ప్రశ్నను చాలా చోట్ల వింటుంటాము.
ఈ ప్రశ్న జ్యోతిష్యాన్ని నమ్మేవారికీ వస్తుంది. నమ్మనివారికీ వస్తుంది. నమ్మేవారికి ఈ ప్రశ్న మరింత లోతైన రీసెర్చికి దారితీస్తుంది. సూక్ష్మ రహస్యాలను అర్ధం చేసుకోడానికి వారిని ప్రేరేపిస్తుంది. నమ్మనివారిని వితండవాదానికి పురికొల్పుతుంది. అలాటి వితండ వాదాలు చేసేవారిని చూచి విజ్ఞులు నవ్వుకొని ఊరుకుంటారు. వేదాంగమైన ఈ శాస్త్రం ఎవరికి బడితే వారికి అర్ధం కాదన్న సంగతి వారికి తెలుసు. జ్యోతిష్యశాస్త్రం వంటి విషయాలలో వాదన ద్వారా ఒకరిని నమ్మించవలసిన పని అస్సలు లేదని నా భావన.
కంప్యూటర్ సైన్స్ నిజమేనని నన్ను ఎవరైనా నమ్మించండి చూద్దాం. నేను కంప్యూటర్ వాడుతున్నప్పటికీ దానివెనుక ఒక సైన్స్ ఉన్నది అని నేను నమ్మను అని భీష్మించుకు కూచుంటే ఎవరూ నాచేత ఆ పని చేయించలేరు. దాన్ని అర్ధం చేసుకుందామన్న ప్రయత్నం లేనపుడు అది అర్ధం కాదు.
అలాగే ఉదయం లేచిన దగ్గరనుంచీ మనం వేసే ప్రతి అడుగూ గ్రహాదీనంలోనే ఉంటుంది. కాని అదెలా జరుగుతుంది అన్న రహస్యం మనకు తెలీదు. కనుక ఆ లింకులు మనకు కనిపించవు. అంత మాత్రం చేత జ్యోతిష్య విజ్ఞానమే తప్పు అనడం సరికాదు. నిజమో అబద్దమో నాకు తెలీదు, నాకు ఇంకా సరిగా అర్ధం కాలేదు అని చెప్పడం తార్కికం అవుతుంది.

కవలల జీవితాలకొస్తే -- సారూప్య కవలలు కూడా ఒకే క్షణంలో ఈ భూమ్మీదకు రారు. కనీసం ఒకటి రెండు నిముషాలు తేడా ఉంటుంది. సూక్ష్మ స్థాయిలో జాతకంలో మార్పులు రావడానికి అది చాలు. లగ్న సంధిలో గనుక జన్మ సమయం పడితే ఒక్కొక్కసారి ఒక నిముషం తేడాలో లగ్నం మారిపోతుంది. ఒకవేళ లగ్నం మారకపోయినా, నవాంశ నుంచి షష్ట్యంశ వరకూ ఉన్న వర్గ చక్రాల గతులు మారిపోతాయి. ఇక అంతకంటే పైవైన నవనవాంశ, నవద్వాదశాంశ, ద్వాదశద్వాదశాంశ, నాడీఅంశ మొదలైన అతి సూక్ష్మ చక్రాలు వేగంగా మారిపోతుంటాయి. వీటిని పరిశీలిస్తే కవలల జాతకాలు ఎందుకు భిన్నంగా ఉంటాయో తెలుస్తుంది.
సాంప్రదాయ జ్యోతిష్యం ఈ సమస్యను గూర్చి లోతుగా చర్చించింది. ఈ రకమైన సందేహాలు మనకే వస్తున్నాయనీ మనమే మహా తెలివైనవాళ్ళమనీ అనుకుంటే అంతకంటే పొరపాటు అనేది ఇంకోటి ఉండదు. ప్రాచీనులు ఈ కోణాలను ఎప్పుడో పరిశీలించారు. వాళ్లకు మనకంటే తెలివి తేటలు ఎక్కువగానే ఉండేవి. అంతే గాక మనకు లేని సూక్ష్మ పరిశీలనా, తపోబలమూ వారికి బాగానే ఉండేవి. కనుకనే ప్రకృతిలో నేటివారికి అర్ధం కాని రహస్యాలు వారికి కలతలామలకంగా మారేవి.
అటువంటి సూక్ష్మపరిశీలనలోనుంచి పుట్టినదే నాడీశాస్త్రం. రెండువేల సంవత్సరాల తర్వాత పుట్టబోయే వ్యక్తి యొక్క తల్లి దండ్రుల పేర్లనూ అతని సోదర సోదరీల పేర్లను, అతడు ఏ జన్మలో ఏం చేసాడు, దాని ఫలితంగా ఏమి అనుభవిస్తాడు అన్న విషయాన్ని కూడా ఈ రోజే వ్రాసి పెట్టిన ఖచ్చితమైన ప్రజ్ఞ దాని సొంతం.ఇదెలా సాధ్యమో నేటివారికి ఊహించడానికి కూడా శక్తి చాలదు.
నాడీశాస్త్రాన్ని ప్రస్తుతానికి పక్కన ఉంచితే, సాంప్రదాయ జ్యోతిష్యం లోకూడా కవలల జన్మకు పరిష్కారం ఉన్నది అని నేను చెప్పగలను. ఈ మధ్యనే నేను పరిశీలించిన ఒక జాతకాన్ని ఉదాహరణగా చూద్దాం. తల్లిదండ్రుల వివరాలను కావాలనే గోప్యంగా ఉంచుతున్నాను.
28 -6 -2001 న ఉదయం 11 .30 ప్రాంతంలో నరసరావుపేటలో ఒక కవలల జన్మ జరిగింది. వీరిలో ఒకమ్మాయి మూడు నెలల తర్వాత చనిపోయింది. రెండవ అమ్మాయి జీవించింది. ఎందుకిలా జరిగింది అన్నది మనకివ్వబడిన సమస్య. దీన్ని సాల్వ్ చెయ్యడానికి మనకున్న డేటా ఏమిటంటే --
1 . 21 -10 -2001 న ఈ ట్విన్స్ లోని ఒక పాప పాలు తాగుతూ ఊపిరి తిత్తుల్లోకి అవి పోవడం వల్ల చనిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది.
2 . ఇద్దరికీ మధ్యన దాదాపు రెండు లేదా మూడు నిముషాల సమయం ఉండవచ్చు. ఈ రెండు క్లూలతో మనం ఈ సమస్యను వర్క్ అవుట్ చెయ్యాలి.
౩. ఇద్దరిదీ కన్యా లగ్నమే. ఇద్దరికీ ఒకే యోగాలు ఒకే దశలు జరుగుతాయి. అటువంటప్పుడు వీరి జీవితాలు ఎందుకని భిన్నంగా ఉన్నాయి?
సాధారణంగా ఇటువంటి జాతకాల చిక్కు ముడి విప్పాలంటే, కృష్ణమూర్తి పద్ధతినో, లేక నాడీ జ్యోతిష్యాన్నో ఆశ్రయించాలి.
కాని అలా చెయ్యడం నాకిష్టం లేదు. సాంప్రదాయ జ్యోతిష్యంలో కూడా దీనికి దారి ఉందని నా భావన. కనుకనే కేపీసిస్టం జోలికో, నాడీశాస్త్రం లోతుల్లోకో పోకుండా సాంప్రదాయ జ్యోతిష్యాన్ని ఉపయోగించి దీన్ని ఎలా సాల్వ్ చేసానో వచ్చే పోస్ట్ లో చూద్దాం.