జ్యోతిర్విజ్ఞానంలో శనిగ్రహ పాత్ర చాలా గొప్పది. అందరూ శనిని తిట్టుకుంటారు. కాని శనిగ్రహం భగవంతుని ధర్మ స్వరూపం అన్న విషయం తెలుసుకోలేరు. ధర్మానికి తనా మనా అన్న భేదం లేదు. ఎవరైనా సరే ధర్మం తప్పితే దానికి తగ్గ శిక్ష విధించడమే ఈ సృష్టిలో శనిగ్రహం యొక్క పాత్ర.
మనుషులు శనిగ్రహాన్ని తిట్టుకోవడం మానాలి. గ్రహాలు దేవతా స్వరూపాలు. వాళ్ళను వాడు వీడు అని సంబోధించడం, " శనిగాడు" లాంటి మాటలు వాడటం వల్లకూడా చెడుకర్మ మెడకు పాములా చుట్టుకుంటుందని...
28, ఆగస్టు 2011, ఆదివారం
ప్రజా ఉద్యమాలు -- శనిగ్రహ ప్రభావం
read more "
ప్రజా ఉద్యమాలు -- శనిగ్రహ ప్రభావం
"
లేబుళ్లు:
జ్యోతిషం
22, ఆగస్టు 2011, సోమవారం
కృష్ణస్తు భగవాన్ స్వయం
భగవంతుని అవతారాలలో కెల్లా నీకిష్టమైన అవతారం ఏది? అని నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే తడుముకోకుండా వెంటనే నేను సమాధానం చెప్పగలను-- కృష్ణావతారం -- అని. నా జవాబు వెనుక కొన్ని కారణాలున్నాయి.
పుణ్యభూమి అయిన మన దేశంలో అనేక మంది మహనీయులూ సిద్దులూ యోగులూ ప్రతి తరంలోనూ జన్మించారు. జన్మిస్తూనే ఉంటారు. అంతే గాక భగవంతుని అవతారాలు కూడా అనేకం మన దేశంలో వచ్చాయి. ఎన్ని భగవద్విభూతులు అవతారాలుగా వచ్చినప్పటికీ కృష్ణావతారం వంటి అవతారం...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
20, ఆగస్టు 2011, శనివారం
బ్రూస్ లీ జాతకం - 2

బ్రూస్ లీ జాతకం మొదటిభాగం ఇక్కడ చూడవచ్చు. ఇతను ఒక రకమైన కారణ జన్ముడే అని చెప్పాలి. ఎందుకంటే చైనీస్ కుంగ్ ఫూ విద్యను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసి తద్వారా ప్రపంచం మొత్తం మీదా మార్షల్ ఆర్ట్స్ రివైవల్ తీసుకు రావడం అనే సంఘటన ఇతని ద్వారా జరిగింది. ఆ పని చెయ్యడానికి విధి ద్వారా ఎన్నుకోబడ్డాడు కనుక ఇతను కారణజన్ముడే.
కానీ, విచిత్రం ఏంటంటే ఇతనికి చైనీస్ కుంగ్ ఫూ పూర్తిగా రాదు. కుంగ్ ఫూ లోని అనేక స్టైల్స్...
లేబుళ్లు:
ప్రముఖుల జాతకాలు
9, ఆగస్టు 2011, మంగళవారం
అభినవగుప్తుని అద్భుతజీవితం
అభినవగుప్తుడు పదవ శతాబ్దంలో కాశ్మీరదేశంలో నివశించినట్లు ఆధారాలున్నాయి.జీవించి ఉన్న కాలంలో ఆయనను పరమేశ్వరుని అవతారంగా భావించి అనేకమంది శిష్యులు పూజించారు.వేదాంత,తంత్ర శాస్త్రములలో మహాపాండిత్యమూ,అద్భుతమైన యోగ శక్తులకుతోడు అమేయమైన శివాద్వైత అనుభవజ్ఞానం ఆయన సొంతం.
ఇవిగాక నాట్య సంగీత వ్యాకరణాది విద్యలలో ఆయన జ్ఞానసంపన్నుడు. "కాశ్మీర శంకరాచార్య" అని ఆయన్ను అనేకమంది నవీన పండితులు పిలిచారు. కాశ్మీర శైవాద్వైతాన్ని ఆయన పరిపుష్టం చేసినట్లు...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
5, ఆగస్టు 2011, శుక్రవారం
జెన్ కథలు - ఖాళీ టీ కప్పు
"A cup of Tea" జెన్ కథను చదివి బాగా ప్రభావితుడైన ఒక వ్యక్తి దాన్ని తనకు తెలిసిన స్నేహితునిమీద ప్రయోగిద్దామని అనుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్యనా అప్పుడప్పుడూ వేదాంత చర్చలు జరిగేవి.
ఒకరోజు సాయంత్రం తన స్నేహితుని " టీ తీసుకుందాం రమ్మని" పిలిచాడు మనవాడు. పిలిచిన సమయానికి స్నేహితుడు వచ్చి కూర్చున్నాడు. ఆమాటా ఈమాటా అయిన తర్వాత ముందే అనుకున్నట్లుగా టీ కప్పును సాసర్లో ఉంచి కేటిల్ లోనుంచి దాంట్లోకి టీ పొయ్యడం ప్రారంబించాడు మన...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
3, ఆగస్టు 2011, బుధవారం
అభినవగుప్తుని కాశ్మీరశైవం - పరాద్వైతం
మన హిందువుల్లో చాలామందికి హిందూమతం గురించి ఏమీ తెలియదు అంటే వినడానికి విచిత్రంగా ఉండొచ్చు. కాని ఇది చేదువాస్తవం. పాపులర్ హిందూయిజం అంటే ఏదో ఒక గుడికెళ్ళి రావడం, మొక్కులు మొక్కుకోవడం ఏదో ఒక బాబాకో స్వామికో అనుయాయులుగా ఉండటం అని చాలా మంది అనుకుంటారు అలాగే అనుసరిస్తారు కూడా.
కాని అసలైన హిందూమతం ఇది కాదు. హిందూమతాన్ని పూర్తిగా అర్ధం చేసుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలూ అతితేలికగా అర్ధమౌతాయి. అంతేకాదు ప్రపంచ తాత్వికచింతన అంతా కూలంకషంగా...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)