జరగబోయే విషయాలను ముందేచెప్పటం మంచిది కాదు. అది జ్యోతిష్కునికైనా సరే, మహాత్ములకైనా సరే. ఎందుకంటే అది సృష్టినియమానికి విరుద్ధం. కాని మరి జ్యోతిశ్శాస్త్రం ఉపయోగం ఏమిటి? అని సందేహం వస్తుంది. జ్యోతిర్వేత్తలకు భవిష్యత్తు తెలుస్తుంది. కాలజ్ఞానం వారికి కలుగుతుంది. కానీ తెలిసిందికదా అని దానిని అడ్డూఅదుపూ లేకుండా అందరికీ చెప్పటం నిషేధం. ఇదొక విచిత్రపరిస్తితి.
వ్యక్తుల విషయంలో కూడా అడిగిన అందరికీ చెప్పడం మంచిది కాదు. అడిగినవారికి తెలుసుకునే యోగం ఉందా లేదా, వారి కర్మబలం ఎలా ఉంది అన్నవిషయం పరిశీలించిన మీదటే విషయం చెప్పాలి. చెప్పకూడదని సూచన వస్తే అటువంటి వారికి చెప్పరాదు. వారి కర్మ తీరే సమయం ఇంకా రాలేదని అర్ధం చేసుకొని మౌనం వహించాలి. కానీ దేశ గోచారం విషయం వేరు. అది స్థూలంగా ఏ ఒక్కరికీ చెందనిదీ అందరికీ చెందేదీ అయిన విషయం. కనుక ఆ విషయాన్ని ఒకరి ప్రమేయం లేకుండా చెప్పవచ్చు. కానీ అక్కడకూడా గోప్యత అవసరం.

అందుకే ఈ జటిలసమస్యను అధిగమిస్తూ, విషయం తెలిసినవారందరూ, జరగబోయేదాన్ని చెప్పీచెప్పకుండా నిగూఢసాంకేతికభాషలో చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం అయినా, నోస్త్రాదేమస్ క్వార్త్రైన్స్ అయినా, వేమనపద్యాలైనా ఇవన్నీకూడా అందుకే నిగూఢ సాంకేతికభాషలో చెప్పబడినవే. అర్ధంచేసుకునే వారికి అవి అర్ధం అవుతాయి. ఆ స్తాయి లేనివారికి అర్ధంకావు. మార్మిక విషయాలలో ఈమాత్రం సాంకేతికత్వం, నిగూడత్వం తప్పనిసరి.
భగవంతుని సృష్టి కూడా అలాంటిదే. దాని రహస్యాలు కూడా అంతే. అవి ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ అందరికీ అర్ధం కావు. అర్ధం చేసుకోగలవారికి అవి అర్ధం అవుతాయి. మిగిలినవారికి అర్ధం కావు. కనుక ఇలా నిగూఢసాంకేతిక భాషలో చెప్పడం ద్వారా కాలజ్ఞానులు సృష్టితో సామరస్య స్తితిలోనే ఉంటారు. అలా చెప్పడం వల్ల సృష్టినియమాన్ని ఉల్లంఘించినట్లు అవదు.ఆ దోషం వారికి అంటదు.

అందుకే ఇన్నాళ్ళబట్టీ నేను డైరెక్ట్ గా చాలావిషయాలను చెబుతూ చేసిన పొరపాటును సవరించుకుంటున్నాను. ఇకనుంచీ జరుగబోయే విషయాలు ఇక్కడకూడా నిగూఢ సాంకేతికభాషలోనే చెప్పబడతాయి. ఏ గ్రహస్తితులను బట్టి నేను వీటిని చెబుతున్నానో, నా విశ్లేషణ ఏమిటో అనే విషయాలు మాత్రం చెప్పను. దీనికి కాలజ్ఞానం అని పేరు పెడుతున్నాను. ఈ కాలజ్ఞానం అందరికీ అర్ధంకాదు. మార్మికభాషను అర్ధం చేసుకోగలవారికీ, జ్యోతిష్యపరిజ్ఞానం ఉన్నవారికీ, ప్రపంచవిషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నవారికే ఇవి అర్ధం అవుతాయి. సంఘటనలు జరుగబోయే కొద్దిరోజులు ముందుగా వీటిని ఇవ్వడం జరుగుతుంది. కాలజ్ఞానాన్ని ఈ పోస్ట్ తోనే మొదలు పెడుతున్నాను.
కాలజ్ఞానం -- 1
ఒక ఆవిష్కరణ వెలుగు చూస్తుంది.
ఒక విప్లవం గెలుస్తుంది.
ప్రాణాన్ని కాపాడేదే ప్రాణం తీస్తుంది.
హటాత్తుగా పరిస్తితులు మారిపోతాయి.
చీకటి శక్తులు విజ్రుమ్భిస్తాయి.
హింస నాట్యం చేస్తుంది.
అమాయకుల ప్రాణాలు గాలిలో దీపాలు
అధర్మానిదే రాజ్యం