ప్రతి మనిషి జీవితంలోనూ సమస్యలుంటాయి. "కష్టాలు" అన్న పెద్ద పదం వాడకపోయినా, ఏదో ఒక మామూలు సమస్య అయినా లేని మానవుడంటూ ఎవడూ ఉండడు. అలాంటి సమస్యల పరిష్కారానికి, అవి చిన్నవైనా లేదా పెద్దవైనా,ఒక కొత్తఫీచర్ త్వరలో మొదలుపెట్టబోతున్నాను.
నా బ్లాగ్లో సభ్యులైనవారు వారిజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు జ్యోతిర్విద్య ద్వారా పరిష్కారాలు నన్ను ఈ మెయిల్ ద్వారా అడుగవచ్చు. వారి వివరాలు రహస్యంగా ఉంచబడతాయి. పరిష్కారాలు ఈ మెయిల్ ద్వారా అడిగిన వారికే డైరెక్ట్ గా తెలియచేయ్యబడతాయి. ఆయా వివరాలు ఎక్కడా బహిర్గతం చెయ్యబడవు.

అడుగుతున్నవారు తమ కరెక్ట్ జననవివరాలు ఇవ్వవలసి ఉంటుంది. ఎవరి జాతకంలోనూ సరియైన సమయం ఉండదు. దానికి కొంతసవరణ అవసరమైతుంది. అలా జాతకాన్ని సవరించడానికి కొంత interaction అవసరమైతుంది. మరీ అవసరమైతే వచ్చి నన్ను పర్సనల్ గా కలవవలసి ఉంటుంది. దీనికి తగిన సమయాన్ని వెచ్చించడానికి సిద్ధమైనవారే ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవాలి.
ఎగతాళిగా అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం జరుగదు. అడిగిన ప్రశ్న నిజమైనదా లేక ఎగతాళిగా అడిగిందా అని నాకు తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? అన్న సందేహం వద్దు. అంత మాత్రం తెలుసుకోలేకపోతే ఇక సమస్యా పరిష్కారం ఎలా సూచించగలను? ఎగతాళిగా అడిగే ప్రశ్నలకు జవాబులు ఉండకపోగా, అలా చేసినందువల్ల, అడిగేవారు చెడుకర్మను సృష్టిన్చుకున్నవారౌతారు. దాని ఫలితాన్ని వారు తప్పక మొయ్యవలసి వస్తుంది.

రెమెడీస్ పొందినవారు , సూచించిన సమయం మేరకు, వాటిని శ్రద్దగా చెయ్యవలసి ఉంటుంది. చేసిన తర్వాత ఏం జరిగింది? రేమేడీల వల్ల వారి వారి జీవితాలలో ఏ ఏ మార్పులు వచ్చాయి? అన్న విషయాన్ని మళ్ళీ నాకు తెలియచెయ్యవలసి ఉంటుంది. వ్యక్తిగత అవసరాన్ని బట్టి రెమెడీస్ ను finetune చెయ్యడం జరుగుతుంది. అయితే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. అన్ని విద్యలకున్నట్లే జ్యోతిర్విద్యకూ కొన్ని పరిమితులూ రూల్సూ ఉన్నాయి. వాటిని తప్పక పాటించాలి. అడిగేవారు తమ సమస్యల గురించే తాము అడగాలి. లేదా తమదగ్గరి కుటుంబసభ్యుల గురించి అడుగవచ్చు. స్నేహితుల గురించీ, మూడో వ్యక్తుల గురించీ అడిగే విషయాలు చెప్పబడవు.
కుతూహలంతోనూ, సరదాగానూ అడిగే ప్రశ్నలకు జవాబులు ఉండవు. కొన్ని మార్మికకారణాలవల్ల, అడిగిన ప్రతివారికీ జవాబు ఇవ్వడం జరుగకపోవచ్చు. జవాబు చెప్పడంలో నాకు స్వాతంత్రం ఉంటుంది. నిజంగా బాధల్లో ఉన్నవారికీ, సిన్సియర్ గా అడిగేవారికి నా నుంచి జవాబు వస్తుంది. ఇతరులకు రాదు.
ఈ ఫీచర్ ఎప్పుడు మొదలౌతుందో త్వరలో తెలియచేయబడుతుంది.