హోమియోపతి చాలా గొప్ప సైన్స్. కాని నేటికీ దీనిని క్వాకరీ అనుకునే అజ్ఞాన దేశాలు అనేకం ఉన్నాయి. అలాగే ఇదసలు వైద్యమే కాదు అనుకునే బుర్రతక్కువమనుషులూ బోలెడంతమంది ఉన్నారు. అణురహస్యాలతో ఆటలాడుకునే శాస్త్రవేత్త,పొలందున్నుకునే పల్లెటూరిబైతుకు పిచ్చివాడిలాగే కనిపిస్తాడు. అలాగే, అర్ధం చేసుకోలేనివారికి హోమియోపతి అసలు వైద్యంలా కనిపించదు. అలాటివారు దానియొక్క ఆశ్చర్యం గొలిపే క్యూర్స్ చూచినపుడే దానిని నమ్మగలుగుతారు.
మామూలు ఇంగ్లీష్ వైద్యం చెయ్యడానికి ఎంత నేర్పు కావాలో హోమియో వైద్యంలో అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువ నేర్పు కావలసి ఉంటుంది. ఇంగ్లీష్ వైద్యం ఎవరైనా చెయ్యగలరు. పల్లెటూరి RMP కూడా సిటీలో ఉన్న మల్టీ స్పెశాలిటీ ఆస్పత్రిలో వాడే మందులే ఇవ్వగలడు. కొన్ని సార్లు వారికంటే నిజాయితీగా వైద్యం చెయ్యగలడు కూడా. కానీ హోమియో వైద్యం అందరూ చెయ్యలేరు. దానికి ఎంతో పరిశీలన కావాలి. మానవ మనస్తత్వం తెలియాలి. హోమియోవిధానానికి ప్రత్యేకం అయిన "క్రానిక్ డిసీజస్" గురించి లోతైన అవగాహన ఉండాలి.రోగిలక్షణాలూ, రోగలక్షణాలూ,మందులక్షణాలూ క్షుణ్ణంగా తెలియాలి. ఇలాటి ప్రజ్ఞ సాధించాలంటే ఒక తపస్సులా హోమియోపతీని అధ్యయనం చెయ్యాలి. ఈ విధంగా ఎవ్వరూ నేర్చుకోరు. హోమియో వైద్యులమని బోర్డ్ పెట్టుకున్న ప్రతివారూ సక్సెస్ కాలేకపోవడానికి కారణం అదే. ముందుగా హోమియో సిద్ధాంతాలలో గట్టిపట్టు సాధించాలి.తర్వాత తెలివిగా వాటిని ప్రాక్టీస్ లో అన్వయించుకోవాలి. డబ్బుకు ఆశపడి షార్ట్ కట్ మెతడ్స్ ఉపయోగించకూడదు.అప్పుడే ఆ వైద్యుడు స్థిరమైన సక్సెస్ రేటును సాధించగలడు.
మొన్న మా అమ్మాయి హోమియో మెడికల్ కాలేజీలో చేరుతోందని తెలిసి వాళ్ళ ఫ్రెండ్ నాన్న ఎగతాళి చేశాడు. ఇంకేమీ దొరకలేదా చదవడానికి? దానికంటే డెంటల్ తీసుకోక పోయావా? అని. చిన్నప్పటి నుంచీ నా దగ్గర హోమియో సిద్ధాంతాలు విని అర్ధం చేసుకున్న మా అమ్మాయి నవ్వేసి -- "మీలాటి వాళ్లకి అర్ధం కాదులే అంకుల్" అని చెప్పింది. మనుషులు ఎంత అజ్ఞానంలో బతుకుతుంటారో చూస్తె ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయంలో అన్నీ తమకు తెలుసనుకుంటూ ఉంటారు. అదే విచిత్రం.
ఇదిలా ఉంచితే, హోమియో కాలేజీలలో కూడా పరిస్తితి అద్వాన్నంగానే ఉంది. చాలా చోట్ల థియరీ నేర్పిస్తున్నారు గాని, క్లినికల్ అనుభవం ఉండటం లేదు. వాళ్ళ అవుట్ పేషంట్ క్లినిక్కులు అన్నీ వెలవెలా బోతూ ఉంటాయి. అందుకే హోమియో వైద్య విద్యార్ధులకు క్లినికల్ అనుభవం ఉండదు. చాలామంది BHMS లు మామూలు జ్వరాన్ని ట్రీట్ చెయ్యడం చేతకాక యాంటీ బయాటిక్స్ ఇవ్వడం నాకు తెలుసు. హోమియో విధానాన్ని కనిపెట్టడానికి హన్నేమాన్ పడిన కష్టాన్ని అలాటివాళ్ళు మర్చిపోతున్నారు.
మా అమ్మాయి రూమ్మేట్ ఒకమ్మాయిని కూడా హోమియో తీసుకోవద్దని ఒక హోమియో వైద్యుడే వారించాడుట. ఇది మరీ విచిత్రంగా ఉంది. హోమియో చదివి నా జీవితం నాశనం చేసుకున్నాను. ఎందుకు దీన్లో చేరుతున్నావు? ఇంతకంటే డెంటల్ తీసుకోకపోయావా? అని అదే మాట అతను కూడా అన్నాడట. ఇలాటి వారికి ఒక విషయం చెప్తాను. హైదరాబాద్లో ఒక హోమియో వైద్యుని అప్పాయింట్ మెంట్ తీసుకోవాలంటే మూడునెలల తర్వాతే దొరుకుతుంది. ఆయన పేరు ప్రస్తావించను. చాలామందికి ఆయనెవరో తెలిసే ఉంటుంది. హోమియోపతీలో సరైన పట్టు చిక్కితే అంత డిమాండ్ ఈరోజున దానికి ఉంది. కాని అంత పట్టు చిక్కాలంటే చాలా కష్టపడి శ్రద్దగా చదవాలి. దానిలో తలపండిన వారివద్ద నేర్చుకోవాలి. బాగా ఎక్కువ కేసులు స్టడీ చేసి క్లినికల్ అనుభవం సంపాదించాలి. అప్పుడు హోమియోలో అద్భుతాలు చెయ్యవచ్చు. ఇతర విధానాలలో ఇక తగ్గవు హోప్ లెస్ అని వదిలేసిన కేసులు కూడా తగ్గించవచ్చు. అంత కష్టపడకుండా ఏదో ఆషామాషీగా చదివేసి బయటకొస్తే అంతా అయోమయమే. MD లూ DM లూ అనవసరమైన టెస్ట్ లు చేయించి ఆ టెస్టులలోనే సాయంత్రానికి వేలూ లక్షలూ సంపాదిస్తుంటే చూచి ఇలాటివాళ్ళు తాము చదివిన చదువు శుద్ధదండగ అనుకుంటారు.కాని అదినిజం కాదు. జీవితానికి డబ్బొక్కటే పరమావధి కాదు. విలాసాలు పరమగమ్యాలూ కావు. వాటికి అంతూ పొంతూ లేదు. నిజానికి ఒకస్థాయికి వచ్చిన తర్వాత డబ్బుతో ఏమి చెయ్యాలో అర్ధం కాదు.శాశ్వతంగా ఆనందాన్నిచ్చే ఉన్నతమైన విషయాలను గురించి మనిషి కనీసం అప్పుడైనా ఆలోచించాలి.
డబ్బొక్కటే పరమావధి అనుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే సరిపోతుంది. దానికి మెడిసిన్ చదవక్కరలేదు.సేవాభావం ఉన్నవారు మాత్రమే వైద్యవృత్తిలోకి రావాలి, మోసం లేకుండా శుద్ధంగా వైద్యం చేసే వైద్యులు సమాజంలో ఎక్కువమంది రావాలి అనేది నా నిశ్చితాభిప్రాయం.
ఇక హోమియో కాలేజీలలో చదువుతున్న నేటితరాన్ని గురించి చూద్దాం. వీరిలో చాలామంది MBBS సీటు రాక ఏదో ఒకటి చదువుదాంలే అని అక్కడ చేరినవారే గాని హోమియోవైద్య విధానం మీద ప్రేమతో చేరినవారు ఎవరూ లేరు. అదే వీరిలో పెద్ద లోపం. ఇక అక్కడ చదువుతున్న అమ్మాయిలను చూస్తే, పరీక్షలు ఇంకో రెండునెలల్లో వచ్చినా కూడా లెక్కచెయ్యకుండా లాప్ టాప్ లలో సినిమాలు చూడటం, టాబ్లెట్ పీసీల్లో చాటింగులు చెయ్యటం చేస్తున్నారు. కొందరిని కదిలించి చూస్తే, వాళ్ళల్లో సబ్జెక్టు పెద్దగా ఏమీ వచ్చినట్లు కనపడలేదు. నాలుగోసంవత్సరం చదివేవారికి కూడా పెద్దగా సబ్జెక్ట్ లేదు. జూనియర్స్ ని రాగింగ్ చెయ్యడం, ప్రేమకబుర్లూ, అతివేషాలూ, రాత్రుళ్ళు పాటలు పెట్టుకుని డాన్సులూ మాత్రం బాగా కనిపించాయి. ఇంత అధ్వాన్నంగా చదివేవాళ్ళు రేపు బయటకొచ్చిన తర్వాత ఎలా ప్రాక్టీస్ చేస్తారో అర్ధంకాలేదు.వీళ్ళలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుని మామూలు గృహిణులుగా స్థిరపడేవారే కన్పించారు. మా అమ్మాయిని కూడా మొదట్లో రాగింగ్ చేయ్యబోయారు. తనకి మార్షల్ ఆర్ట్స్ లో ట్రెయినింగ్ ఉందన్న సంగతి వారికి తెలీదుగా మరి. ప్రమాదకరమైన జాయింట్ బ్రేకింగ్ టెక్నిక్స్ తనకు టెన్త్ నుంచే నేర్పించాను.తొందరపడి నీవిద్యను వారిపైన ప్రయోగించవద్దు. మళ్ళీ ఏదన్నా జరిగితే ప్రమాదం. లో ప్రొఫైల్ లో ఏమీ తెలియనట్లు ఉండు. మరీమితిమీరితే అప్పుడుచూద్దాం అని నేనే చెప్పాను. అదృష్టవశాత్తూ దానిని ఉపయోగించవలసిన పరిస్తితి ఇంకా తలెత్తలేదు.
అద్భుతమైన హోమియోవైద్యాన్ని నేర్చుకునే అవకాశం వచ్చికూడా దానినిసక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్న ఆ విద్యార్ధులను చూచి నాకు చాలా జాలేసింది. ఏం చేస్తాం? ప్రపంచం భలే విచిత్రమైనది. ఇక్కడ ఒక దానికోసం వెతికేవారికి అది దొరకదు. తేరగా దొరికినవారికి దాని విలువ తెలీదు. ఉపయోగించుకోవడమూ తెలీదు. ఒక విషయాన్ని ఔపోశన పట్టాలన్న తపనతో దానివెంటపడి శ్రమించి దానిని సాధించిన వారికే దాని విలువ తెలుస్తుంది. వారికి కలిగే ఆత్మతృప్తి కూడా అమోఘంగా ఉంటుంది. ఆ తృప్తిని ఏ డబ్బూ కొనివ్వలేదు.
ప్రపంచం విలువిచ్చే విషయాలు నిజమైన విలువ ఉన్నవి కావు.నిజమైన విలువఉన్న విషయాలు ప్రపంచంలో అందరికీ అందవు.చాలాసార్లు తమ చేతిలో ఉన్నదాని విలువ తమకే తెలియదు.దృష్టి మాత్రం ఎక్కడో దూరంగా ఉన్నదానిమీద ఉంటుంది.అది నిజంగా విలువైనదో కాదో తెలీకపోయినా సరే. ఇదే ఈలోకంలోని విచిత్రం.