నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, నవంబర్ 2012, బుధవారం

కాలజ్ఞానం -17

మొదలు నందనమ్ము మార్గశీర్షమ్ములో    తుదిని  జయము యాషాఢసీమ వరకు     బాధలెన్నో రేగి తలకిందు చేసేను  వేషాలు జనులలో హెచ్చు మీరేను  ఎవరి గోతిని వారు తవ్వుకొబోతారు   విప్లవం రేగేను రాజ్యాలు కూలేను  యుద్ధాలు ముప్పులు ప్రకృతి భీభత్సాలు  సాధారణమ్ముగా జరిగేను ఏలికలు పయనమ్ము కట్టేరు మార్గశిర ద్వాదశి మార్పులను తెచ్చేను  కళ్ళు మూసినా గట్టి రుజువులగుపించేను   పెంచుకున్నపాపమ్ము...
read more " కాలజ్ఞానం -17 "

23, నవంబర్ 2012, శుక్రవారం

కాలజ్ఞానం - 16

వాహనాలు రిపెర్లతో చికాకు పుట్టిస్తాయి నటులకు కళాకారులకు సాహితీవేత్తలకు  చెడుకాలంతో చుక్కెదురౌతుంది ఒక ఆధ్యాత్మిక నేతకు గండం పొంచి ఉంది  మేధావుల గోడు ఎవరికీ పట్టదు అంతా తానే అని భావించే మనిషి  తానొక అణువుననే సత్యం గ్రహించాలి విశాల విశ్వపు కధలో తనదొక  చిన్నపాత్ర మాత్రమేనని గుర్తించాలి...
read more " కాలజ్ఞానం - 16 "

17, నవంబర్ 2012, శనివారం

మానవజీవిత గమ్యం -- వేమన పద్యం

తెలుగునాట పుట్టిన మహనీయుల్లో వేమన యోగి ఉత్తమ శ్రేణికి చెందినవాడు.ఆయనను చాలామంది ఒక సంఘసంస్కర్తగా భావిస్తున్నారు. ఇది పొరపాటు.ఆయనను ఒక కులానికి పరిమితం చెయ్యడమూ తప్పే.సాధారణ మానవ పరిమితులను దాటినవారే మహానీయులనబడతారు. వారు కులానికి మతానికి జాతికి అతీతులౌతారు. మానవత్వమూ దైవత్వమే వారి విధానాలు అవుతాయి.వేమన అటువంటి సద్గురువులలో ఒకడు.మానవాతీతులైనవారిని ఒకకులానికి మతానికి ప్రాంతానికి పరిమితం చెయ్యకూడదు. ఆయన పద్యాలలో ఉత్తమమైన యోగసాధన...
read more " మానవజీవిత గమ్యం -- వేమన పద్యం "

7, నవంబర్ 2012, బుధవారం

ఈ ఏడాది కూడా తుఫాన్ రావాలి

ఆంద్రప్రదేశ్ లో ప్రతి నవంబర్ లోనూ తుఫాన్ రావడం మామూలైపోయింది. వాతావరణశాఖవారు దీనిని కనిపెట్టలేకపోయినా సామాన్యుడు చెప్పగలుగుతున్నాడు.అయితే, ప్రతి ఏడాదీ తుఫాను రావడమూ ఊళ్లు జలదిగ్బంధనం అవడమూ, లోతట్టు ప్రాంతాలు మునిగి పోవడమూ, ఊరిలోనే మనుషులు పడవలు వేసుకొని తిరగడమూ సర్వ సాధారణం అయిపోయింది. కానీ దీనికి తగిన శాశ్వతచర్యలు ప్రభుత్వం ఏమి తీసుకుంటున్నదో తెలియదు. పోనీ తనకు చేతనైనంతలో ప్రభుత్వం ఏవో కొన్ని చర్యలు చేపడుతున్నదీ అనుకుందాం.రాజకీయ...
read more " ఈ ఏడాది కూడా తుఫాన్ రావాలి "

1, నవంబర్ 2012, గురువారం

వింతదేశంలో ఎన్నో వింతలు

మన దేశాన్ని ఇప్పటివరకూ నాశనం చేసిన,ఇంకా చేస్తున్న,రెండు ప్రధానశక్తులు ఏవంటే- ఒకటి రాజకీయాలు, రెండు సినిమాలు అని చెప్పచ్చు. ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమె కాదు.నిష్పక్షపాతంగా ఆలోచించగలిగిన ఎవరైనా ఇదే అంటారు. ప్రస్తుతం అందరు మేధావులూ ఇదే అంటున్నారు. నీతిలేని రాజకీయరంగం వల్ల మనదేశం ఎదగవలసినంత ఎదగలేక పోయింది అన్నది సత్యం. ఒకప్పుడు మనలాంటి దేశమైన చైనావైపు ప్రస్తుతం మనం కనీసం కన్నెత్తి చూడలేని స్తితిలో ఉన్నామంటే మొదటి కారణం మన...
read more " వింతదేశంలో ఎన్నో వింతలు "