ఈసారి కార్తీక అమావాస్య ప్రభావం పండిత రవిశంకర్ ను తీసుకు పోయింది.రాహుకేతువుల నీచ స్తితివల్ల గత ఏడాదిన్నరగా ఎందరు ప్రసిద్ధ వ్యక్తులు పరలోకం దారి పట్టారో లెక్కిస్తే ఆ లిస్టు చాలా పెద్దది అవుతుంది.రాహువుకు వృశ్చికం నీచస్థానం కావడమూ అది సహజ జ్యోతిశ్చక్రంలో అష్టమస్థానం కావడమే దీనికి కారణం.ఇంకో రెండువారాల్లో రాహుకేతువులు రాశి మారబోతున్నారు. పోతూపోతూ ఒక ప్రసిద్ధ సంగీత విద్వాంసుణ్ణి తీసుకుపోయారు.అంతేకాదు ఈ రెండువారాల్లో ఇంకా కొందరిని కూడా తీసుకుపోతారు.ఎందుకంటే ఒకసారి రాశి మారితే ఈ చాన్స్ మళ్ళీ 18 ఏళ్ళకు గాని వారికి రాదు.అదలా ఉంచితే,ఈ సందర్భంగా ఒకసారి పండిత రవిశంకర్ జన్మ కుండలి పరిశీలిద్దాం.
పండిత రవిశంకర్ చౌధురీ 7-4-1920 న వారణాసి లో పుట్టాడు.ఖచ్చితమైన జనన సమయం తెలియదు.కనుక మనకు తెలిసిన ఇతర పద్దతులతో చూద్దాం.నక్షత్రం విశాఖ గాని అనూరాధ గాని అవుతున్నది.కాని విశాఖ కంటే కూడా అనూరాధ నక్షత్రమే సంగీతం వంటి లలిత కళలలో ప్రఖ్యాతిని ఇస్తుంది. కనుక ఈయన నక్షత్రం అనూరాధ అయి ఉండవచ్చు. ఆ రోజు ఉదయం తెల్లవారుజాము 3 నుంచి అనూరాధ నక్షత్రం ఉన్నది. కనుక ఆయన ఆ తర్వాత పుట్టి ఉండవచ్చు. ఉదయం 9.30 సమయంలో అయితే లగ్నం వృషభం అవుతుంది. శుక్రుడు ఉచ్ఛ స్త్తితిలో సూర్యునితో కలిసి లాభస్తానంలో ఉండటం చూడవచ్చు.దీనివల్ల లలితకళలలో మంచి పెరు ప్రఖ్యాతులు వస్తాయి. చంద్రుడు కూడా ఆ సమయంలో వృశ్చికం 6 డిగ్రీలలో ఉన్నాడు. ఈ డిగ్రీలు అనూరాధ ఒకటో పాదాన్ని సూచిస్తాయి.అప్పుడు నవాంశ లో చంద్రుడు సింహరాశిలోకి వస్తాడు. సింహ నవాంశ వారికి జుట్టు పలచగా ఉంటుంది. చివరి దశలో ఆయన ముఖం చూస్తే కూడా సింహాన్ని గుర్తుకు తెస్తుంది.ఈ కారణాల వల్ల ఆయన ఉదయం 9.30 ప్రాంతంలో పుట్టి ఉండవచ్చు అనుకుందాం.
ఈయన జాతకంలో కుజుడు శనీ వక్రించి ఉన్నారు. కుజుడు రాహునక్షత్రంలో ఉన్నాడు. పైగా రాహువుతో కలసి ఉన్నాడు. వీరికి ఆత్మశక్తి,మొండితనమూ చాలా ఎక్కువగా ఉంటాయి. బహుముఖమైన ప్రజ్ఞ కూడా వీరికి ఉంటుంది.వీరిద్దరూ శుక్ర రాశిలో ఉండటంతో వీరికి స్త్రీలంటే ఆకర్షణా బలహీనతా ఉంటాయి.కళారంగంలో ఇలాంటి బలహీనతలు చాలావరకూ మామూలే.దీనిని బలహీనతగా తీసుకోకూడదు.రసాస్వాదనాపరులకు మన్మధ మిత్రత్వం సహజంగా ఉంటుంది. దానినే దైవం వైపు తిప్పగలిగితే వాళ్ళు త్యాగరాజస్వామి వంటి మహనీయులు అవుతారు.అయితే ఆ అదృష్టం కోటిమందిలో ఒక్కరికే ఉంటుంది.మిగిలినవారు పుష్పబాణుని సేవలో పునీతులు కావలసిందే.ఈ కోణాన్ని అలా ఉంచితే,శని కేతునక్షత్రంలో వక్రించి ఉన్నాడు.కనుక లోకంతో చాలా ఋణానుబంధమూ తద్వారా ఎన్నో బాధలూ మానసిక చికాకులూ కూడా వీరికి తప్పవు. ఇవన్నీ ఆయన జీవితంలో జరిగాయని ఆయన గురించి తెలిసినవాళ్ళకు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.మనిషి జీవితం 100% జాతకచక్రం ప్రకారమే జరుగుతుంది. ఇందులో ఏమీ అనుమానం లేదు.
ఈయన జాతకంలో శుక్రుడూ గురువూ ఉచ్ఛ స్తితిలో ఉన్నారు.కనుక శుక్రుడు సంగీతంలో మంచి ప్రజ్ఞనూ,గురువు ప్రయత్నాలలో విజయాన్నీ ఇచ్చారు.అయితే శుక్రుడు బాల్యావస్థలో బలహీనంగా ఉన్నాడు.కనుక భార్యల వైపునుంచి సమస్యలు తప్పలేదు. గురువు సరిగ్గా భావమధ్యంలో బలంగా ఉన్నాడు. కనుక నడివయస్సు నుంచే ఈయనకు బ్రహ్మాండమైన ఖ్యాతి లభించింది. ఉచ్ఛశుక్ర సూర్యులపైన ఉన్న ఉచ్ఛగురు దృష్టి ఈయన జీవితంలో ఒక బ్రహ్మాండమైన యోగాన్ని ఇచ్చింది. ఈయన జాతకంలో ఇదే అతి ముఖ్యమైన యోగం.
ఇకపోతే ఈయన నక్షత్రనాధుడైన శని విద్యాస్తానంలో ఉన్నాడు.కనుక వాయిద్యవిద్యలో ఆరితెర్చాడు.వక్రస్తితివల్ల గురువుతో కలిసి ఇంకా అదృష్టాన్ని ఇచ్చాడు. తృతీయం తీగ వాయిద్యాలకు సూచన. కనుక సితార్ పట్టుబడింది. అయితే శనిగురువుల కలయిక మంచిది కాదు కనుక దానివల్ల కష్టాలనూ చవిచూచాడు.
ఆయు:కారకుడైన శని నాడీవిధానం ప్రకారం ఉచ్ఛ గురువుతో కూడి ఉండటంతో పూర్ణాయుర్దాయం కలిగింది.ఒకవేళ మన లెక్క ప్రకారం లగ్నం వృషభమే అయితే,అష్టమాదిపతి తృతీయంలో ఉచ్చస్తితి వల్ల కూడా పూర్ణాయుజాతకం అవుతుంది. అందుకే 92 ఏళ్ల పూర్ణమైన జీవితాన్ని జీవించాడు.
ఆయు:కారకుడైన శని నాడీవిధానం ప్రకారం ఉచ్ఛ గురువుతో కూడి ఉండటంతో పూర్ణాయుర్దాయం కలిగింది.ఒకవేళ మన లెక్క ప్రకారం లగ్నం వృషభమే అయితే,అష్టమాదిపతి తృతీయంలో ఉచ్చస్తితి వల్ల కూడా పూర్ణాయుజాతకం అవుతుంది. అందుకే 92 ఏళ్ల పూర్ణమైన జీవితాన్ని జీవించాడు.
రాహువు గురునక్షత్రంలో ఉండటం వల్ల, విదేశీ సంబంధాలూ, భారతదేశ సంగీతాన్ని విదేశీసంగీతంతో మేళవించి 'సింఫనీలు' సృష్టించడమూ, బీటిల్స్ మొదలైన విదేశీ కళాకారులను అమితంగా ప్రభావితం చెయ్యడమూ జరిగింది.ఎందఱో విదేశీయులకు 'సితార్' నేర్పించి వారికి గురువయ్యాడు.
ఆత్మకారకుడైన బుదునివల్ల సంగీతరంగంలో తెలివైన ప్రయోగాలు చేసి లక్షలాది జనాలను మంత్రముగ్ధులను చెయ్యగలిగాడు.కారకాంశ వాయుతత్వ రాశి అయిన మిథునం కావడం కూడా తీగవాయిద్యం మీద ప్రావీణ్యం రావడానికి ఒక కారణం.
అమాత్యకారకుడైన శుక్రుడు దారాకారకుడైన సూర్యునితో కలిసి ఉచ్ఛ స్తితిలో ఉండటం వల్ల సంగీతరంగంతో అనుబంధం ఉన్న సూ జోన్స్ తో వివాహం కలిగింది.అంతేగాక ఆయన భార్యలందరూ ఏదో రకంగా సంగీతంతో సంబంధం ఉన్నవారే అయ్యారు.
ఇకపోతే 11-12-2012 న మరణకాలచంద్రుడు,దాదాపుగా జననకాల చంద్రుని పైన సంచరించడం చూడవచ్చు.ఈయన మానసికంగా బాగా అలసిపోయాడు అనడానికి ఇదొక సూచన.అంతేగాక రవి,బుధ,శుక్రులూ,రాహువూ కూడా జననకాల చంద్రునిపైన సంచరించారు. దానికి తోడు,అమావాస్య ముందురోజు కావడం అగ్నికి ఆజ్యం పోసింది. ఈ విధంగా కాలం మూడినప్పుడు,కర్మ ముంచుకొచ్చినపుడు, గ్రహాలన్నీ ఎదురు తిరుగుతాయి.
ఈయన జాతకంలో ఇంకొక వింత ఏమంటే,జననకాల గురువూ శనీ, మరణకాల గురువూ శనులకు ఖచ్చితమైన అర్ధకోణ దృష్టిలో ఉన్నారు. అంటే గురువు గురువుతోనూ,శని శనితోనూ sextile aspect కలిగి ఉండటం చూడవచ్చు. ఈజన్మకు అనుభవించవలసిన కర్మ తీరిందని చెప్పడానికి ఇదొక సూచన. 6-12-2012 న ఇతని ఆత్మకారకుడైన బుధుడు రాశిమారి వ్రుశ్చికంలోకి వచ్చి నీచరాహువు పరిధిలో ప్రవేశించాడు. ఆరోజే ఈయన శ్వాస ఇబ్బందితో ఆస్పత్రి లో చేరాడు. అప్పుడు సింహంలో ఉన్న చంద్రుడు ఐదురోజుల్లో దగ్గరగా వచ్చి 11-12-12 న సరిగ్గా జనన కాల చంద్రునితో కూడటమే గాక రాహువు నోటిలో పడ్డాడు.అంతేగాక ఈయన జాతకంలో యోగకారకుడైన శుక్రుడు కూడా రాశి మారి రాహువు నోటిలోకి వచ్చి పడ్డాడు.అలా అంత్యకాలం సమీపించింది.
ఒకసారి నన్నొకరు అడిగారు."అదృష్టవంతుల,ప్రముఖుల జాతకాల్లో చూడగానే కొట్టొచ్చినట్లు ఏవైనా కనిపిస్తాయా?" అని. "అవును అదృష్ట యోగాలు కనిపిస్తాయి." అని చెప్పాను. "మరి దురదృష్టవంతుల జాతకాలోనో?" అని ప్రశ్నించారు. "వారి జాతకాల్లో దరిద్రయోగాలు కనిపిస్తాయి." అన్నాను.
ఒకసారి నన్నొకరు అడిగారు."అదృష్టవంతుల,ప్రముఖుల జాతకాల్లో చూడగానే కొట్టొచ్చినట్లు ఏవైనా కనిపిస్తాయా?" అని. "అవును అదృష్ట యోగాలు కనిపిస్తాయి." అని చెప్పాను. "మరి దురదృష్టవంతుల జాతకాలోనో?" అని ప్రశ్నించారు. "వారి జాతకాల్లో దరిద్రయోగాలు కనిపిస్తాయి." అన్నాను.
పై విశ్లేషణను బట్టి పండిత రవిశంకర్ ఒక గొప్ప అదృష్ట జాతకుడని వెంటనే కనిపిస్తుంది. అలా సరస్వతీ లక్షీ కటాక్షాలు ఉన్న జాతకాలు చాలా కొన్నే ఉంటాయి.అందులోనూ శుద్ధమైన చక్కనిసంగీతంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేవారు కొందరే ఉంటారు.పైగా గాత్రం కంటే ఒక వాయిద్యాన్ని వాయించడం చాలాకష్టం. పండిత రవిశంకర్ అటువంటి ప్రజ్ఞ కలిగిన మంచి విద్వాంసుడు.ఆయనకు సరస్వతీ లక్ష్మీ కటాక్షాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయనకు నివాళి అర్పిద్దాం.