జాతకాన్నీ,గోచారాన్నీ,ప్రశ్ననూ,ముహూర్తాన్నీ అన్నింటినీ ఒకేచోటికి చేర్చి ఒక సంపూర్ణభవిష్య దర్శినిని తయారు చేద్దామన్న ప్రయత్నంలా సర్వతోభద్ర చక్రం కనిపిస్తుంది.ఇందులో అచ్చులూ, హల్లులూ, తిధులూ, వారాలూ,నక్షత్రాలూ,రాశులూ,గ్రహాలూ అన్నీ ఇమిడి ఉన్నాయి.
అందుకే సర్వతోభద్ర చక్రాన్ని వాడి జన్మ జాతకాన్నీ విశ్లేషణ చెయ్యవచ్చు. అలాగే ప్రశ్నకూ,ముహూర్తానికీ,గోచారానికీ దీనిని సులభంగా వాడు కోవచ్చు.2008 సంవత్సరంలో నేను దీనిని ఉపయోగించి నాలుగు రోజుల్లో నాకు రాబోతున్న ప్రమోషన్నూ, ట్రాన్స్ఫర్ నూ మాత్రమెగాక అది ఏ ఊరికి రాబోతున్నదో కూడా ఖచ్చితంగా ఎలా తెలుసుకోగలిగానో ఇక్కడ ఉదాహరణతో చూపిస్తాను.పాత పేపర్లు వెతుకుతుంటే, ఆరోజు నేను వేసిన సర్వతోభద్ర చక్రం ఈరోజున దొరికింది.దాని ఫోటో ని పైన చూడవచ్చు.
విశ్లేషణ అంతా కాగితం మీదే క్లుప్తభాషలో ఉన్నది.ఇక్కడ కూడా క్లుప్తంగా మాత్రమె వివరిస్తాను.యోగకారకులు అభిషేకతారలో ఉన్నపుడు ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది.ఔన్నత్యం వరిస్తుంది.31వ తేదీన చంద్రుడు నాకు క్షేమతారలోకి వస్తూ అభిషేకతారలో స్తితులై ఉన్న నా యోగకారకులైన బుధశుక్రులను వీక్షించబోతున్నాడు.ఆ వీక్షణ 'గ' అన్న అక్షరం మీదుగా పోతున్నది.ఈ అక్షరంతో గుంటూరు,గుంతకల్ రెండు ఊర్లున్నాయి.కాని అప్పుడు గుంటూర్లోనే ఉన్నాను.కనుక గుంటూరు కాదు.మిగిలిన సికింద్రాబాద్,హైదరాబాద్,విజయవాడ,నాందేడ్,గుంతకల్ లలో ఆ అక్షరంతో మొదలయ్యేది ఒక్క గుంతకల్ మాత్రమే.
కనుక 27-3-2008 తేదీన నేను వేసిన లెక్క ప్రకారం 31-3-2008 న నాకు గుంతకల్ కు ట్రాన్స్ఫర్ అవుతూ ఆర్డర్స్ రావాలి.
కనుక 27-3-2008 తేదీన నేను వేసిన లెక్క ప్రకారం 31-3-2008 న నాకు గుంతకల్ కు ట్రాన్స్ఫర్ అవుతూ ఆర్డర్స్ రావాలి.
సరిగ్గా 31-3-2008 న సాయంత్రానికి అనుకున్నది కరెక్ట్ గా జరిగి గుంతకల్ కు ప్రమోషన్ తో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అందుకోవడం జరిగింది.
సర్వతోభద్ర చక్రాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలియజెప్పడానికి నా పాత రికార్డ్స్ నుంచి ఇది ఒక మంచి ఉదాహరణ.