
ఇప్పటివరకూ పంచవటి సాధనా సమ్మేళనాలు నాలుగు జరిగాయి. మొదట పూనూరు,రెండు హైదరాబాద్,మూడు మహానంది నాలుగు హైదరాబాద్ లో జరిగాయి.ఇప్పుడు ఐదవ సాధనాసమ్మేళనం కోటప్పకొండ మీద జరిగింది.ఈసారి కొద్దిమందితో మాత్రమే ఇది నిర్వహించబడింది.
నేను,రామన్నగారు,మదన్,రాజు నలుగురమే ఈసారి ఇందులో పాల్గొన్నాము.శనివారం ఉదయం ఏడున్నరకు మొదలైన కార్యక్రమం సోమవారం ఉదయం పదిగంటలకు ముగిసింది.
కోటప్పకొండ నరసరావుపేట...