1947 కేలండరూ 2014 కేలండరూ ఒకటేనని నా బ్లాగు చదువరులలో ఒకరు నాకు గుర్తుచేశారు.
పరిశీలించాను.నిజమే.అంటే మనకు మళ్ళీ స్వాతంత్ర్యం వచ్చిందన్నమాట.
ప్రపంచంలో కాకతాళీయత అంటూ ఏదీ ఉండదు.There is nothing called an accident in the universe అంటారు స్వామి వివేకానంద.మనిషి జీవితంలో గానీ,లోకంలోగానీ జరిగే ప్రతి సంఘటన వెనుకా లోతైన అర్దాలుంటాయి.మామూలు మనుషులకు అర్ధంకాని కర్మ సమ్మేళనాలుంటాయి.ప్రపంచంలో ఏదీ కారణం లేకుండా జరగదు అనేది సనాతనధర్మపు మూలసూత్రాలలో ఒకటి.
నా ఉద్దేశంలో 16-5-2014 మన అసలైన స్వాతంత్రదినోత్సవంగా జరుపుకోవాలి.ఎందుకంటే,స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళైనా ఇప్పటిదాకా దేశం రకరకాలైన స్వార్ధపరశక్తుల చేతుల్లోనే ఉన్నది.దేశభక్తుల చేతుల్లోకి మాత్రం ఇప్పుడే నిజంగా వచ్చింది.
మనకు పేరుకు స్వాతంత్రం వచ్చిందికాని నిజానికి రాలేదు.లోపల్లోపల విదేశీశక్తులే మనదేశాన్ని ఇప్పటికీ నడిపిస్తున్నాయి.నల్లదొరల దోపిడీయే ఇప్పటిదాకా జరుగుతోంది. తెల్లదొరల దోపిడీ డైరెక్ట్ గా పోయింది.కానీ వారు తెరవెనుక ఉండి ఏదైనా కాస్తోకూస్తో మిగిలి ఉంటే దానిని మన నల్లదొరల చేత ఇన్ డైరెక్ట్ గా దోపిడీ చేయిస్తున్నారు.

మధ్యమధ్యలో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కొద్దిమంది నిజమైన నాయకులు అధికారంలోకి వచ్చినా కూడా వారికి మెజారిటీ ఇవ్వని దద్దమ్మప్రజలు ఉండటం వల్ల దేశానికి గొప్పమేలు ఏమీ వారు చెయ్యలేకపోయారు.వారికి చిత్తశుద్ధి ఉన్నాకూడా ఉపయోగం లేకపోయింది.
ఇప్పుడు ప్రతిపక్షం అనేదికూడా లేకుండా అఖండమెజారిటీతో నరేంద్రమోడీని గెలిపించడం వల్ల నిజమైన స్వాతంత్రం దేశానికి ఈరోజున వచ్చినట్లైంది.నిజమైన దేశభక్తుల ఆత్మలన్నీ ఇప్పుడు ఆనందంతో స్వర్గంలో పండుగ చేసుకుంటున్నాయి.
ఇప్పుడు కొద్దిగా న్యూమరాలజీ వైపు చూద్దాం.
15-8-1947
6-8-3
17
8
ఈ తేదీనుంచి దాదాపు 68 ఏళ్ళకే ఇప్పుడు ఈ పరిణామం జరగడం గమనార్హం.రెండవ స్టెప్ లో 6-8 ని గమనించవచ్చు.కానీ రూట్ నంబర్ 8 కావడం అంత మంచిది కాదు.8 శనీశ్వరుని అంకె కావడంతో నిరాశా నిస్పృహా ఆలస్యమూ విషాదమే ఫలితంగా వస్తుంది.ఈ అంకె భౌతిక అభివృద్ధికి మంచిది కాదు.అయితే,ఆధ్యాత్మిక అభివృద్ధికి మాత్రం బాగా సహకరిస్తుంది.
మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తేదీని గమనిద్దాం.
16-5-2014
7-5-7
10
1
రూట్ నంబర్ 1 అయింది.ఇది సూర్యునికి సూచిక.ఉజ్జ్వలమైన భవిష్యత్తును ఇది సూచిస్తున్నది.ఎనిమిదికీ ఒకటికీ చుక్కెదురు అవుతుంది.కనుక నిరాశాజనకమైన గతానికి విభిన్నంగా ఇకముందు దేశభవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండబోతున్నదని సూచింపబడుతున్నది.
15-8-1947 అర్ధరాత్రికి దశాఫలితాలు ఏమంటున్నాయో చూద్దాం.
ఆ సమయానికి శని/శని/కేతు/చంద్రదశ జరుగుతున్నది. అంటే, ఆర్ధికరంగమూ,కార్మికరంగమూ నత్తనడక నడుస్తాయనీ,సాధారణంగా దేశపరిస్థితి అంత బాగుండదనీ,ప్రజలకు మానసికచింతా కుంగుబాటూ ఆటుపోట్లూ తప్పవనీ ఈ సమయానికి దశాఫలితాలు సూచిస్తున్నాయి. అలాంటి గొప్ప సమయానికి మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నమాట!!!
అప్పటి ఘనత వహించిన నేతలు ముహూర్తం నిర్ణయించి మరీ అంతగొప్ప సమయానికి కాలసర్పయోగంలో స్వాతంత్ర్యం తెచ్చుకున్నారన్నమాట. దాని ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పటిదాకా మనం చూచాంకదా.నెహ్రూ జ్య్తోతిష్యాన్ని నమ్మేవాడు కాదని అందరూ అనుకుంటారు.కాని ఒక ప్రముఖ జ్యోతిష్కుని వద్ద ఆయన ఇందిరాగాంధీ జాతకాన్ని వేయించాడని రుజువులున్నాయి.అన్నీతెలిసి అంత గొప్ప సమయాన్ని స్వాతంత్ర ముహూర్తంగా నిర్ణయించారు మన నేతలు!!!

ఇకపోతే 16-5-2014 మధ్యాహ్నానికి ఏ దశ జరుగుతున్నదో చూద్దాం.
అప్పుడు బుధ/శుక్ర/గురు/బుధదశ జరుగుతున్నది.దీనినిబట్టి ఆర్ధిక, రవాణా,కమ్యూనికేషన్,కార్మిక,విదేశీ వ్యవహారాల రంగాలలో దేశం ఇకముందు మంచి అభివృద్ధిని సాధించబోతున్నదని సూచిస్తున్నది.ఇది కూడా పొల్లుపోకుండా ఖచ్చితంగా జరగడాన్ని ముందుముందు మనం చూడబోతున్నాం.
ఒకటి మనం అడుక్కుని తెచ్చుకున్న స్వాతంత్ర్యం.ఇంకొకటి దేవుడిచ్చిన స్వాతంత్ర్యం.
మనం తెచ్చుకున్న స్వాతంత్ర్యం కంటే భగవంతుడిచ్చిన స్వాతంత్ర్యం ఖచ్చితంగా ఎంతో ఉన్నతంగా ఉంటుంది.

ఇకముందునుంచీ పాత స్వాతంత్ర్యదినోత్సవంతో బాటు ఈ నూతన స్వాతంత్ర్యదినోత్సవాన్ని కూడా జరుపుకుందాం.
జై భారత్.జైహింద్.