'చెప్పండన్నగారు' మళ్ళీ విషయంలోకి వచ్చాడు చరణ్.
చరణ్ ఆలోచనలో పడ్డాడు.
'కావచ్చు' అన్నాడు చివరకు.
'ఇప్పుడు ఇంకొక మెట్టు క్రిందకు వెళతాను.అసలు మంచినీళ్ళు త్రాగాలని మాత్రం ఎందుకనుకోవాలి?అదికూడా లేకుండా ఉండవచ్చుగా?' అన్నాను.
'ఎలా ఉండగలం?మనం ఉన్నా మన శరీరం ఒప్పుకోదుగా అన్నగారు?దాని అవసరం తీరాలిగా?'అన్నాడు.
నవ్వాను.
'ఇప్పుడు అర్ధమైందా మరి?కంక్లూజన్ నీవే చెబుతావా నేను చెప్పనా?' అడిగాను.
'నాకు అర్ధమయ్యీ కానట్టుగా ఉందన్నగారు.మీరే చెప్పండి.' అన్నాడు.
'శరీరం కోరితే దాన్ని అవసరం అంటున్నాం. మనస్సు కోరితే దాన్ని కోరిక అంటున్నాం. రెంటిలోనూ 'కోరిక' అనేది కామన్.అంతేనా?' అన్నాను.
చరణ్ దేనినీ అంత తేలికగా ఒప్పుకోడు.
'అదెలా ఔతుందన్నగారు?' అన్నాడు.
'అంతేగా మరి?ఆకలి అనేది శరీరపు అవసరం. అది కోరిక కాదు. ఏదో ఒకటి తిని ఆ ఆకలి తీరిస్తే అది అప్పటికి శాంతిస్తుంది. కానీ ఏదో ఒకటి కాకుండా 'ఫలానాదే' తినాలి అనుకోవడం కోరిక. అలా అనుకునేది శరీరం కాదు. మనస్సు. శరీరానికి అంత పెద్దపెద్ద కోరికలు ఆలోచనలు ఉండవు.అప్పటికి దాని అవసరం తీరితే దానికి చాలు. శరీరం పిచ్చిది. అమాయకపుది. మనస్సు అలాకాదు. అది మహా కన్నింగ్ ది. సింపుల్ గా అవసరం తీరడం దానికి ఇష్టం ఉండదు. దానికి చాలా మసాలా కావాలి.
నీవు చెప్పిన ఉదాహరణలో కూడా, కాళ్ళకు చెప్పులుండి ఎండవేడి కాళ్ళకు తగలకుండా ఉంటే చాలని శరీరం అనుకుంటుంది. దాని దృష్టి అంతకంటే ఎక్కువ దూరంపోదు. ప్రస్తుతం ఉన్నబాధ పోతే చాలని మాత్రమే అది అనుకుంటుంది. శరీరం చిన్నపిల్లలాంటిది. దానికెక్కువ కోరికలుండవు. చాక్లెట్ ఇస్తే అది సంతోషపడుతుంది. కాని మనస్సలా కాదు. దానికి తృప్తి అనేది ఉండదు. బాసుమతి రైస్ బిరియానీ పెట్టినా అది శాంతించదు. చెప్పులొక్కటే చాలవు ఏసీకారు కూడా ఉండాలి అనుకోవడం మనస్సు లక్షణం.
ఇంకా ఎక్కువసేపు సాగదియ్యకుండా విషయం చెబుదామనుకున్నా.
'నువ్వే చెప్పాలి.' అన్నా.
ఇంతలో ఎవరో రైతు పొలంలో కోసిన బీరకాయలు రోడ్డుపక్కన గుట్టగా పోసి అమ్ముతూ కనిపించాడు.
'బీరకాయలు బాగున్నై అన్నగారు.ఆపి కొనుక్కుందామా?' అన్నాడు.
'బీరకాయలు బాగున్నై అన్నగారు.ఆపి కొనుక్కుందామా?' అన్నాడు.
నేనేమీ మాట్లాడలేదు.
అన్నాడేగాని తనూ కారాపలేదు.బీరకాయలు దాటి వెళ్లిపోయాయి.
'పిండి చక్కనిపాళ్ళలో కలిపి లేతబీరకాయని చక్కగా స్లైసులు తరిగి పిండిలో ముంచి బజ్జీలు వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందన్నగారు.' అన్నాడు చరణ్,బజ్జీలు తింటున్న ఫీల్ ఇస్తూ.
నేను నవ్వుతూ రోడ్డువైపు చూస్తున్నాను.
'అంతేకాదన్నగారు?' ఏదో రహస్యం చెబుతున్నట్లు గొంతు కాస్త తగ్గించి అన్నాడు చరణ్ -'బీరకాయ అట్లూ బీరకాయ పప్పూ బీరకాయ పచ్చడీ కూడా భలే ఉంటాయి సరిగ్గా చేస్తే'.
అతనివైపు చూచాను.
'ఈ బీరకాయ పురాణం అవసరమా లేక కోరికా?' అడిగాను నవ్వుతూ.
'రెండూ.'నవ్వుతూ తనూ బదులిచ్చాడు.
'సరే చరణ్.మన చర్చ మళ్ళీ కొనసాగిద్దాం.మీరు చెప్పిన ఉదాహరణలే తీసుకుందాం.ఇడ్లీ పెసరట్టు ఉపమానం మీ వదిన చెప్పింది.అందులో కూడా అసలు మొదలుపెట్టడం ఇడ్లీతోనే ఎందుకు మొదలు పెట్టాలి?ఉదాహరణకు నేనిలా అంటాననుకో-"మంచినీళ్ళు తాగితే చాల్లే అనుకోవడం అవసరం.ఇడ్లీ తినాలని అనుకోవడం కోరిక".ఇది తప్పౌతుందా?ఎందుకంటే మంచినీళ్ళు తాగితే కూడా ఆకలి తాత్కాలికంగా శాంతిస్తుంది కదా?' అడిగాను.
అతనివైపు చూచాను.
'ఈ బీరకాయ పురాణం అవసరమా లేక కోరికా?' అడిగాను నవ్వుతూ.
'రెండూ.'నవ్వుతూ తనూ బదులిచ్చాడు.
'సరే చరణ్.మన చర్చ మళ్ళీ కొనసాగిద్దాం.మీరు చెప్పిన ఉదాహరణలే తీసుకుందాం.ఇడ్లీ పెసరట్టు ఉపమానం మీ వదిన చెప్పింది.అందులో కూడా అసలు మొదలుపెట్టడం ఇడ్లీతోనే ఎందుకు మొదలు పెట్టాలి?ఉదాహరణకు నేనిలా అంటాననుకో-"మంచినీళ్ళు తాగితే చాల్లే అనుకోవడం అవసరం.ఇడ్లీ తినాలని అనుకోవడం కోరిక".ఇది తప్పౌతుందా?ఎందుకంటే మంచినీళ్ళు తాగితే కూడా ఆకలి తాత్కాలికంగా శాంతిస్తుంది కదా?' అడిగాను.
చరణ్ ఆలోచనలో పడ్డాడు.
'కావచ్చు' అన్నాడు చివరకు.
'ఇప్పుడు ఇంకొక మెట్టు క్రిందకు వెళతాను.అసలు మంచినీళ్ళు త్రాగాలని మాత్రం ఎందుకనుకోవాలి?అదికూడా లేకుండా ఉండవచ్చుగా?' అన్నాను.
'ఎలా ఉండగలం?మనం ఉన్నా మన శరీరం ఒప్పుకోదుగా అన్నగారు?దాని అవసరం తీరాలిగా?'అన్నాడు.
నవ్వాను.
'ఇప్పుడు అర్ధమైందా మరి?కంక్లూజన్ నీవే చెబుతావా నేను చెప్పనా?' అడిగాను.
'నాకు అర్ధమయ్యీ కానట్టుగా ఉందన్నగారు.మీరే చెప్పండి.' అన్నాడు.
'శరీరం కోరితే దాన్ని అవసరం అంటున్నాం. మనస్సు కోరితే దాన్ని కోరిక అంటున్నాం. రెంటిలోనూ 'కోరిక' అనేది కామన్.అంతేనా?' అన్నాను.
చరణ్ దేనినీ అంత తేలికగా ఒప్పుకోడు.
'అదెలా ఔతుందన్నగారు?' అన్నాడు.
'అంతేగా మరి?ఆకలి అనేది శరీరపు అవసరం. అది కోరిక కాదు. ఏదో ఒకటి తిని ఆ ఆకలి తీరిస్తే అది అప్పటికి శాంతిస్తుంది. కానీ ఏదో ఒకటి కాకుండా 'ఫలానాదే' తినాలి అనుకోవడం కోరిక. అలా అనుకునేది శరీరం కాదు. మనస్సు. శరీరానికి అంత పెద్దపెద్ద కోరికలు ఆలోచనలు ఉండవు.అప్పటికి దాని అవసరం తీరితే దానికి చాలు. శరీరం పిచ్చిది. అమాయకపుది. మనస్సు అలాకాదు. అది మహా కన్నింగ్ ది. సింపుల్ గా అవసరం తీరడం దానికి ఇష్టం ఉండదు. దానికి చాలా మసాలా కావాలి.
నీవు చెప్పిన ఉదాహరణలో కూడా, కాళ్ళకు చెప్పులుండి ఎండవేడి కాళ్ళకు తగలకుండా ఉంటే చాలని శరీరం అనుకుంటుంది. దాని దృష్టి అంతకంటే ఎక్కువ దూరంపోదు. ప్రస్తుతం ఉన్నబాధ పోతే చాలని మాత్రమే అది అనుకుంటుంది. శరీరం చిన్నపిల్లలాంటిది. దానికెక్కువ కోరికలుండవు. చాక్లెట్ ఇస్తే అది సంతోషపడుతుంది. కాని మనస్సలా కాదు. దానికి తృప్తి అనేది ఉండదు. బాసుమతి రైస్ బిరియానీ పెట్టినా అది శాంతించదు. చెప్పులొక్కటే చాలవు ఏసీకారు కూడా ఉండాలి అనుకోవడం మనస్సు లక్షణం.
మీకు నచ్చినా నచ్చకపోయినా ఇంకొక ఉదాహరణ చెప్తాను.శరీరం మంచి ప్రియురాలు వంటిది. దానికి నీ స్వచ్చమైన ప్రేమ ఒక్కటే చాలు. దానికి తోడుగా నీవిచ్చే చిన్నచిన్న గిఫ్ట్ లు చాలు. అంతకుమించి ఇంకేమీ కోరదు. కాని మనస్సు చెడ్డప్రియురాలు వంటిది. దాని ఆశకు అంతుండదు. ఎంత ఇచ్చినా దానికి చాలదు. నీ ఆస్తంతా ఇచ్చినా దానికి సరిపోదు. నిజానికి దానికి కావలసింది నీప్రేమ కాదు. నీవు తనకు ముఖ్యం కాదు. నీ ద్వారా లభించే వస్తువులే దానికి ముఖ్యం.
శరీరపు స్వార్ధం చిన్నది. కానీ మనస్సు స్వార్ధం అంతులేనిది. కడుపునిండా తింటే ఆకలి తీరుతుంది.కానీ ఎంత ఇచ్చినా మనస్సు ఆశ తీరదు.ఇప్పుడు చెప్పు.శరీరపు కోరికను అవసరం అంటాము.మనస్సు కోరికను కోరిక అంటాం.ఒప్పుకుంటావా?' అడిగాను.

'మీరు ఇంత లాజిక్ చెప్పాక తప్పుతుందా?సరే ఒప్పుకుంటాను' అన్నాడు.
అలా అన్నాడేగాని తన మాటల్లో ఇంకా ఏదో సందిగ్ధత ధ్వనిస్తూనే ఉంది.బహుశా చర్చ తను అనుకున్నవైపు కాకుండా ఇంకెటో పోతున్నదని తనకు అసంతృప్తిగా ఉన్నది.తను చెప్పాలనుకున్న కంక్లూజన్ కాకుండా వేరేవైపు చర్చ దారితీస్తున్నది.అదే తన గొంతులోని అసంతృప్తికి కారణం.అది నాకర్ధమైంది.
'సరే ఇంతవరకూ ఒప్పుకున్నావు గనుక ఇప్పుడు నేనొక ప్రశ్న అడుగుతాను.సరేనా?' అన్నాను.
'అడగండి.'
'నీవు ఇందాక చెప్పిన ఉదాహరణలో రోడ్డుమీద పోతున్న మనిషి ఒక పిచ్చివాడనుకో అప్పుడు వాడికేమనిపిస్తుంది?' అడిగాను.
'పిచ్చోడికేమనిపిస్తుందో నాకెలా తెలుస్తుంది?'-నేను చెప్పినమాట నాకే ఒప్పజెప్పాడు.
'మంచోడికేమనిపిస్తుందో అర్ధమైనప్పుడు పిచ్చోడికేమనిపిస్తుందో ఎందుకర్ధం కాదు? అదీ బాగానే అర్ధమౌతుంది.చెప్పు.'- నేనూ తగ్గలేదు.
కాసేపు ఆలోచించాడు.
'బహుశా వాడికేమీ అనిపించదనుకుంటా' అన్నాడు.
'ఎందుకని?' అడిగాను.
'వాడి మనసు కండిషన్ సరిగా లేదు గనుక' చెప్పాడు.
'ఇంకో ఉదాహరణ విను.ఒక మనిషి కోమాలో ఉన్నాడనుకో.వాడికీ ఆకలేస్తుంది.మరి వాడికేమనిపిస్తుంది?' అడిగాను.
ఇక నాతో వాదన అనవసరం అనుకున్నాడో ఏమో,'కోమాలో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది?' అన్నాడు.
'అంటే అర్ధమేమిటి?వాడికి అవసరం అనిపించాలన్నా కోరిక కలగాలన్నా శరీరానికి ప్రకృతికీ మధ్యన మనసనేది ఒకటి ఉండాలి అవునా కాదా?' అడిగాను.
'అవును' అని అయిష్టంగానే అన్నాడు.
ఇంతలో పెదనందిపాడు వచ్చింది.కారూ చర్చా రెండూ ఆపి,అక్కడ ఒక చిన్న హోటల్లో టిఫిన్ అయిందనిపించాము.రోడ్డుపక్కన మంచి నవనవలాడే కూరగాయలు పోసి అమ్ముతున్నారు.ఎవరికి కావలసినవి వారు కొనుక్కొని సంచులు కార్లో పడేసి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాం.
ఈసారి చరణ్ ఏమీ మాట్లాడటం లేదు.మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు.
'ఏంటి తమ్ముడు ఆలోచిస్తున్నావ్?' అడిగాను.
'మీరు చెప్పినదే అన్నగారు' అన్నాడు.
'ఏదైనా తట్టిందా?' అడిగాను.
'లేదు.అదే ఆలోచిస్తున్నాను.' అన్నాడు.
'ఇందులో అంత ఆలోచనకేముంది తమ్ముడూ? చెప్తా విను.' అంటూ అసలు విషయం మొదలుపెట్టా.
"తాను తానుగా ఉండలేక ఇంకొక దానిని కోరుకోవడమే అన్నిటికీ మూలం.అది తప్పుకాదు.ఎందుకంటే అసలు సృష్టి ఎలా మొదలైందో వేదం ఏమని చెప్పింది?సృష్టికి ముందు అఖండ ఏకస్వరూపంగా ఒక్కటిగా ఏదైతే ఉన్నదో అది అలా ఉండలేక రెండుగా మారింది.అలా రెండుగా మారాలనుకోవడమే ప్రధమసంకల్పం.అదే అన్నింటికీ మొదలు.అదే కోరిక.లేదా అవసరం.అదే ప్రతిమనిషిలోనూ భౌతికంగానూ మానసికంగానూ ప్రాణికంగానూ ప్రతిఫలిస్తున్నది.
రెండోదానిని గుర్తించడం మనస్సు ద్వారానే సాధ్యమౌతుంది.మనస్సు లేని గాఢనిద్రాస్థితిలోనూ కోమావంటి స్థితిలోనూ నీకు అనుభూతి ఏమీ ఉండదు.ఎందుకంటే రెండోది ఉన్నట్లు నీకు స్పృహ ఉండదు గనుక.
అందుకే "మనస్సే ద్వైతం" అని మహనీయులన్నారు.
అందుకే "మనస్సే ద్వైతం" అని మహనీయులన్నారు.
'తానుగాక రెండోది ఉన్నది'-అన్న ఎరుక ఎప్పుడైతే మనిషికి వచ్చిందో అప్పుడే అవసరం లేదా కోరిక అనేది మొదలౌతుంది.నీవు ఒక ఇంటిలో ఒక్కడివే ఉన్నావనుకో.నీవు నీవుగా ఉన్నంతవరకూ నీకు భయం ఉండదు. కానీ చీకట్లోంచి ఎవరో నిన్ను చూస్తున్నట్లో,ఎవరో నిన్ను గమనిస్తున్నట్లో అనిపించిందనుకో.ఆక్షణం నుంచీ నీకు భయమనేది మొదలౌతుంది.ఇది అందరికీ అనుభవమే.అవునా?' అడిగాను.
'అవును.కానీ అది భయం కదా?కోరిక కాదుగా?' అన్నాడు.
'భయం అంటే ఏమిటి?తనకేదో అయిపోతుంది అన్న ఫీలింగే కదా.అంటే తనకేమీ కాకూడదు బాగుండాలి అన్న ఫీలింగ్ దానిక్రింద ఉన్నట్లే కదా.అలా 'బాగుండాలి' అన్నదే కోరిక.కోరిక అనేది క్రింద ఉన్నది గనుక దానిమీద భయం అనేది వచ్చింది.
అసలు 'నేను సుఖంగా ఉండాలి' అన్న భావనే లేదనుకో.అప్పుడు భయం ఎక్కడనుంచి వస్తుంది?కనుక భయానికి కూడా కోరికేగా మూలం?' అడిగాను.
చరణ్ ఏమీ మాట్లాడలేదు.

'అంటే ఏమిటి? రెండవదాని ఉనికిని నీవు గుర్తించిన మరుక్షణం నీలో కల్లోలం మొదలౌతుంది.అలా నీవు గుర్తించకుండా ఉంటే నీవు నీవుగా ఉంటావు. అప్పుడు నీకు అవసరమూ లేదు కోరికా లేదు.అదే ఆత్మస్థితి.
ఇంకో ఉదాహరణ చెప్తా విను.ఒక మహాసౌందర్యవతి నీ పక్కనే ఉన్నప్పటికీ ఆమె ఉనికిని నీవు గుర్తించనంతవరకూ నీలో భౌతికంగాగానీ మానసికంగాగానీ ఎలాంటి చలనమూ ఉండదు.ఆమెవేరు నీవువేరు అని గుర్తించిన మరుక్షణమూ,నీవు మగవాడివి ఆమె ఆడది అని గుర్తించిన మరుక్షణమూ ఇబ్బంది తలెత్తుతుంది. అంతేనా?' అడిగాను.
'అవును' అన్నాడు.
'ఇప్పుడు సారాంశం చెబుతా విను.శరీరపు కోరికను అవసరం అంటున్నాం.మానసిక కోరికను కోరిక అంటున్నాం.రెండూ ఒకటే.స్థాయిలోనే భేదం ఉన్నది.అసలంటూ ఉన్నది కోరిక,లేదా అవసరం ఒక్కటే.రెండూ వేర్వేరు కావు.జిల్లెళ్ళమూడి అమ్మగారి ప్రసిద్ధవాక్యం 'సృష్టిలో ఉన్నది అవసరం ఒక్కటే నాన్నా!' గుర్తొచ్చిందా ఇప్పుడు?' అడిగాను.
చరణ్ ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది.
'అవునన్నగారు.' అన్నాడు.
'అద్వైతంలో ఏ అవసరమూ లేదు ఏ కోరికా లేదు.ద్వైతంలో అవి రెండూ ఉన్నాయి.సృష్టి అంటే ద్వైతమే కదా.నిజానికి కోరికా ద్వైతమూ రెండూ ఒకేసారి మొదలౌతాయి.అంటే కోరికే సృష్టికి మూలం.
కోరికలో ఉన్న మనిషి కోరికను దాటిన స్థితికి చేరుకోవడమే అసలు విషయం. అంటే సృష్టిలో ఉన్నవాడు సృష్టిని దాటాలి.ద్వైతంలో ఉన్నవాడు అద్వైతానికి చేరాలి.మనిషి జీవితం అంతా ద్వైతం నుంచి అద్వైతానికి పయనమే.
'సృష్టిలో అవసరమే ప్రధానం'-అని అమ్మ చెప్పిన మాటకు అర్ధం ఇదే. ఎందుకంటే సృష్టిలో 'అవసరం' తప్ప ఇంకేమీ లేదు.అవసరమే సృష్టి.అవసరం లేనివాడికి సృష్టితో పనిలేదు.వాడు ఆత్మారాముడే.' అన్నాను.

'అర్ధమైందన్నగారు.' అన్నాడు.
'ఇప్పుడు నీవడిగిన ప్రశ్నకు జవాబు చెబుతా విను.సృష్టి అవసరమా కోరికా అని నీవు అడిగావు కదా? రెండూ ఒకటే.ఉన్నది అదే.అవసరమే సృష్టి.కోరికే సృష్టి.నీవు చేసిన సృష్టికీ అదే మూలం,నిన్ను చేసిన సృష్టికీ అదే మూలం,నీ చుట్టూ ఉన్న సృష్టికీ అదే మూలం.కోరికే ద్వైతం.దానిని దాటగలిగావా అదే అద్వైతం.ఇదే వేదాంతసారం.' అన్నాను.
ఒక్కసారిగా కార్లో దట్టమైన మౌనం ఆవహించింది.
కారు ఏడో మైలురాయి వద్దకు వచ్చింది.దూరంగా జిల్లెళ్ళమూడి గ్రామం కనిపిస్తున్నది.అందరం మౌనం వహించాం.
కారు రోడ్డుమీదనుంచి క్రిందకు దిగి జిల్లెళ్ళమూడి వైపు పరిగెత్తుతున్నది.అందరం మౌనంగా ఉన్నాం.
చూస్తుండగానే 'అందరిల్లు' వచ్చేసింది.కారు ఒక వైపుగా పార్క్ చేసి అందరం క్రిందకు దిగాం.ఒక్కసారిగా మన సొంతింటికి మనం వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది.ఎన్నాళ్ళుగానో ఎక్కడో విదేశాలలో దూరంగా ఉండి,ఒక్కసారిగా కన్నతల్లి ఒడిలోకి చేరుకున్న ఫీలింగ్ కలిగింది.
కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.
(ఇంకా ఉన్నది)