జీవంలేని రాతిశిల్పం
గుడిలో వెలుగై కదిలిస్తుంది
ప్రాణంలేని తీగరాగం
మదిలో జ్వాలను రగిలిస్తుంది
మాటరాని మూగమనసు
మనిషి బ్రతుకును నడిపిస్తుంది
పాడలేని పిచ్చిగుండె
స్వర తంత్రులను తడిపేస్తుంది
ఉందో లేదో తెలియని గమ్యం
ఊర్ధ్వలోకాలకు తెరతీస్తుంది
అందీ అందని నీ సాంగత్యం
ఆనందపు బాధను మిగులుస్తుంది
అందని ఆకాశం కోసం
?ఆరాటమేగా జీవితం
స్పందించే నెచ్చెలి...
28, నవంబర్ 2014, శుక్రవారం
26, నవంబర్ 2014, బుధవారం
ఏదీ తప్పనిపించడం లేదు
కొంతమందితో మనకు ట్యూనింగ్ బాగా ఉన్నపుడు ఒక విచిత్రం జరుగుతుంది.వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారో మనకు తెలిసిపోతూ ఉంటుంది. దీనికి దూరంతో సంబంధం లేదు.దీనికి పెద్ద యోగశక్తి లాంటిదేమీ అవసరం లేదు.కొద్దిగా 'ఫీల్' అయ్యే తత్త్వం ఉన్నవారికి ఇది అనుభవమే.
అలాంటి మనుషులతో మనకు 'యాస్ట్రల్ కనెక్షన్' ఏర్పడటమే దీనికి కారణం. అలాంటి వారిలో చరణ్ ఒకడు.ఈరోజు తను వచ్చి కలుస్తాడేమో అని ఒక ఫ్లాష్ లాగా అనిపించడమూ అలాగే తను...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
25, నవంబర్ 2014, మంగళవారం
Jhuki Jhuki Si Nazar - Jagjit Singh
Youtube link
https://youtu.be/kiFyM_pmoik
ఘజల్స్ గానంలో "జగ్ జీత్ సింగ్" పేరు తెలియని వాళ్ళు ఉండరు. మంద్రస్వరంలో మధురగానాన్ని ఒలికించడంలో ఆయనకొక ప్రత్యేకత ఉన్నది.ఆయన గాత్రం నుంచి జాలువారిన ఈ గీతం 'Ardh' అనే సినిమాలోది.
ఇదొక అద్భుతమైన ప్రేమగీతం.
ప్రేయసి తన మనస్సులోని ప్రేమను వెల్లడించలేకపోతున్నది.దానికి అనేక కారణాలు ఆమెకు ఉండవచ్చు.అసలు ప్రేమనేది తనలో ఉందో లేదో కూడా ఆమెకు తెలీదు.ఒకవేళ...
లేబుళ్లు:
Hindi songs
గోంగూర పువ్వు
ఆఫీసులో వెహికల్స్ పార్కింగ్ చేసేచోట ఉన్న పిచ్చిచెట్లలో ఒక సౌందర్యం విరబూసి కనిపించింది.
పిచ్చిచెట్టు అనే పదం క్షంతవ్యం.చెట్లలో ఏ చెట్టూ పిచ్చిది కాదు.ఇది మాటవరసకు వాడబడిన పదం మాత్రమే.
'ఏమిటా?' అని చూచాను.
అదొక గోంగూర పువ్వు.
యధాప్రకారం దానిని పలకరించాను.
అది వింతగా చూచింది.
'అందరూ గులాబీలనే మెచ్చుకోలుగా చూస్తారు.మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.నీకు నేనెందుకు మిత్రమా?' అన్నది.
'అందరి...
లేబుళ్లు:
మనోవీధిలో మెరుపులు
22, నవంబర్ 2014, శనివారం
యమునా తీరం...
యమునా తీరం
అంతమెరుగని విరహవలయం
రాధాహృదయం
వింత వలపుల ప్రేమనిలయం
గోపికల గుండెల్లో
మిగిలి రగిలిన ప్రణయగాథ
ఓపికల అంచుల్లో
విరిగి ఒరిగిన మధురబాధ
ఓపలేని విరహంలో
వేగుతున్నదొక ఉదయం
తాపమింక సైపలేక
తూగుతున్నదొక హృదయం
దాచిఉన్న హృదయానికి
దరిజేరని అనంతం
పూచిపూచి...
లేబుళ్లు:
మనోవీధిలో మెరుపులు
19, నవంబర్ 2014, బుధవారం
కళ్ళు విప్పి చూడు నేస్తం...
కళ్ళు విప్పి చూడు నేస్తం
మూసిన ముంగిళ్ళు దాటి చూడు నేస్తం
మనసు వాకిళ్ళు తెరచి చూడు నేస్తం
హృదయపు లోగిళ్ళు తరచి చూడు నేస్తం
ఒక అతీతస్వర్గం దిగుతోంది నీకోసం
ఒక అమేయ రోచిస్సు ఉద్భవిస్తోంది నీకోసం
ఒక అద్భుతలోకం వేచింది నీకోసం
ఒక అమానుష తేజం నిలిచింది నీకోసం
విశ్వప్రభుని వేడుకుంటూ నీవు రాల్చిన ప్రతి కన్నీటిచుక్కా
ఆ స్వర్గానికి ఒక్కొక్క మెట్టుగా మారింది
బీటలు వారిన నిరాశలో నీవు చేసిన ప్రతి...
లేబుళ్లు:
మనోవీధిలో మెరుపులు
17, నవంబర్ 2014, సోమవారం
కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు-4
Creeping like a snakeTai Chi Pose1986 -Guntakal
30 ఏళ్ళ క్రితం గుంతకల్ లో నేను మార్షల్ ఆర్ట్స్ స్కూల్ నడిపే రోజుల్లో నాకు కాశీ అని ఒక శిష్యుడు ఉండేవాడు.మెయిన్ రోడ్డులోనే అతనికి ఒక ఫోటో స్టూడియో ఉండేది.
ఆ ఫోటో స్టూడియో వెనుకగా ఉన్న ఒక రూం లో ముఖ్యమైన శిష్యులతో నేను సీక్రెట్ ఫైటింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసేవాడిని.
జెనరల్ ప్రాక్టీస్ కోసం రైల్వే హైస్కూల్ గ్రౌండ్లో సాయంత్రం చీకటిపడిన తర్వాతనుంచి...
లేబుళ్లు:
వీర విద్యలు
15, నవంబర్ 2014, శనివారం
కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు -3
మరికొన్ని పాత ఫోటోలు ఇక్కడ ఇస్తున్నాను.
Lateral Swing Kick1985Guntakal
"లేటరల్ స్వింగ్ కిక్" అనే ఈ కిక్ నా ఫేవరేట్ కిక్స్ లో ఒకటి.ఇది కూడా ప్రమాదకరమైనదే.ఈ కిక్ ఏ వైపునుంచి వస్తున్నదో ప్రత్యర్ధికి అర్ధం కాకుండా మీద పడిపోతుంది. అందుకని దీనిని తప్పుకోవడం, చాలా అలర్ట్ గా ఉంటే తప్ప,చాలా కష్టం.
మార్షల్ ఆర్ట్స్ లో నేను నేర్పే సిస్టం చాలా ప్రమాదకరమైనది.ఇందులో ఎక్కువ సేపు ఫైటింగ్ ఉండదు.ఒకటి...
లేబుళ్లు:
వీర విద్యలు
13, నవంబర్ 2014, గురువారం
కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు-2
మరికొన్ని పాతఫోటోలను నా శిష్యులూ అభిమానుల కోసం ఇక్కడ ఇస్తున్నాను.
Powerful High Side Kick(1985)Guntakal
1985 ప్రాంతాలలో నేను హై కిక్స్ బాగా అభ్యాసం చేసేవాడిని.మనిషికి చేతులకంటే కాళ్ళు ఎక్కువ బలంగా ఉంటాయి.కనుక చేతులతో నాలుగు దెబ్బల కంటే కాలితో ఒక మంచి కిక్ చాలా ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది.తైక్వాన్ డో సిద్దాంతం ఇదే.
చేతులు వెనక్కు కట్టుకుని,కాళ్ళు మాత్రమే వాడుతూ-నాలుగు వైపులనుంచీ కమ్ముకునే...
లేబుళ్లు:
వీర విద్యలు
ఊహించినవి-జరిగినవి-28
శనీశ్వరుని వృశ్చికరాశి ప్రవేశ ఫలితాలను ఊహిస్తూ వ్రాసిన రెండు విషయాలు నిజమయ్యాయి.
ఒకటి
ముస్లిం ఉగ్రవాదం పెరుగుతుంది- అని వ్రాశాను.
ఆ తర్వాత కొన్ని రోజులకే వాఘా బార్డర్ సంఘటన జరిగింది.మన ప్రదానమంత్రికే డైరెక్ట్ గా హెచ్చరిక పంపేంత స్థాయిలో రెచ్చిపోయి వాళ్ళు తెగబడుతున్నారు.ఉగ్రవాదం పెరుగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రెండు
స్త్రీలలో గైనిక్ సమస్యలు ఎక్కువౌతాయి-అని సూచనాప్రాయంగా చెప్పాను.
కుటుంబ నియంత్రణ...
లేబుళ్లు:
కాలజ్ఞానం
11, నవంబర్ 2014, మంగళవారం
కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు-1
పాత ఫోటోలను వెదుకుతుంటే రెండేళ్ళక్రితం తీసిన కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫోటోలు కనిపించాయి.
రమేష్,గిరిధర్ నా దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి రెండేళ్ళ క్రితం వచ్చారు.కానీ అన్ని ఆరంభ శూరత్వాలలాగా వారిది కూడా అయింది.ఆ తర్వాత వారికి రావడమూ కుదరలేదు.నాకేమో నేర్పడమూ కుదరలేదు. నేర్పడానికి నేను సిద్ధంగా ఉన్నా,వారికి తీరిక లేకుంటే నేనేం చెయ్యగలను?ఒక దొంగ గురువు దగ్గర రమేష్ కొన్నేళ్ళు కష్టపడి కుంగ్...
లేబుళ్లు:
వీర విద్యలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)