Once you stop learning, you start dying

7, డిసెంబర్ 2014, ఆదివారం

క్రికెట్ ఆటగాడు P J Hughes - గండాంత జాతకం

క్రికెట్ ఆటగాడు P.J.Hughes గత నెలలో ప్రాక్టీస్ చేస్తుండగా బంతి మెడకు బలంగా తగలడం వల్ల చనిపోయిన సంగతి తెలిసిందే.

ఒక రీడర్ అడిగిన మీదట ఈ జాతకాన్ని పైపైన చూస్తున్నాను.

ఇతను 30-11-1988 న ఆస్ట్రేలియాలోని మేక్స్ విల్లి అనే ఊరిలో పుట్టాడు.జనన సమయం తెలియదు.నక్షత్రం ఆశ్లేషగాని మఖగాని అవుతుంది.చంద్రుడు ఆశ్లేషా నక్షత్రం నాలుగో పాదంలో 29 డిగ్రీలలో ఉన్నాడని నా ఊహ.ఇది గండాంతస్థితి. సామాన్యంగా ఇలాంటి జాతకులకు బాలారిష్టాలుంటాయి.లేదా అల్పాయుష్కులౌతారు.32 ఏళ్ళ లోపు పోతే అల్పాయుష్కులనుకోవచ్చు. ఇతను సరిగ్గా 26 చివరలో పోయాడు.కనుక అల్పాయుష్కుడే.

వృషభరాశి చెడిపోయిన వారికి గొంతు మెడలకు సంబంధించిన థైరాయిడ్ లేదా సెర్వికల్ స్పాండిలైటిస్ వంటి బాధలుంటాయి.ఇంకా చెడుఖర్మ ఉంటె ఇతనికి తగిలిన దెబ్బల వంటివి మెడ ప్రాంతంలో తగులుతాయి.ఇతనికి వృషభరాశిలో గురువు వక్రించి ఉండటం చూడవచ్చు.వృషభరాశికీ గురువుగారికీ సంబంధించిన రెమెడీలు చేసుకుని ఉంటే ఈ దోషం నివారణ అయ్యి ఉండేది.కానీ దృఢకర్మ ఉన్నపుడు రెమేడీలు చేసుకునే అవకాశం ఉండదు.

తృతీయంమీద కుజుని దృష్టి స్పోర్ట్స్ లో ప్రావీణ్యతను ఇస్తుంది.కానీ అదే ఇక్కడ అసహజ మరణానికి కూడా కారణం అయ్యింది.దానికి కారణం మోక్షరాశి అయిన మీనంనుంచి ఉన్న కుజదృష్టి.అసహజ మరణాలకు సంబంధించి నేను గతంలో ఎన్నోసార్లు చెప్పిన జైమినిమహర్షి సూత్రం ఇక్కడ స్మరణీయం.ఈ జాతకంలో కూడా ఆ సూత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. అష్టమంలో రాహువు వల్ల యాక్సిడెంటల్ డెత్ సూచింపబడుతున్నది.

ఇంతకంటే ఈ జాతకాన్ని చూడటానికి పెద్దగా ఏమీ లేదు.