ఇది 70 ఏళ్ళ నాటి పాట.
దీనిని పాడిన గాయకుడు Ch.Atma ఒక లెజెండ్.ఈయన పాతకాలపు హిందీ మధుర గాయకులలో ఒకరు.ఈ మధురగీతం ఆయన పాడిన ప్రైవేట్ పాటలలో ఒకటి.ఇప్పటివారికి ఇలాంటి మధుర గాయకుల గురించి అసలు తెలుసో లేదో అనుమానమే.
ఈయన 1923 లో జన్మించాడు.కాలేజీ రోజులనుంచే పాడటం ప్రారంభించిన ఈయన 1945 లో 'ప్రీతం ఆన్ మిలో' అనే పాటతో రంగప్రవేశం చేశాడు. దాదాపు 70 ఏళ్ళు గడచినా ఇప్పటికీ ఆ పాటను పాతపాటల ప్రేమికులు వింటూ పాడుకుంటూనే ఉంటారంటే దాని సాహిత్యపు విలువా,సంగీతపు విలువా అర్ధం చేసుకోవచ్చు.
ప్రస్తుత గీతం కూడా అలాంటిదే.
70 ఏళ్ళు గడచినా ఈనాటికీ ఇది మరపురాని మధురగీతంగానే నిలిచి ఉన్నది.అప్పట్లో పెద్దగా వాయిద్యాలు లేవు.నేటిలాగా ఎలెక్ట్రానిక్ వాయిద్యాల హోరు లేదు.కానీ అతి తక్కువ వాయిద్యాలతో,'ఘటం' లాంటి వాయిద్యాలు వాడి,రాగప్రధానంగా పాడిన ఆనాటి పాటలు కాలపరీక్షకు తట్టుకుని ఈనాటికీ నిలిచి ఉన్నాయంటే ఆ గొప్పదనం ఆ అమరరాగాలదే.
ఈ పాట చాలా గొప్ప మార్మికగీతం.దీనిని వ్రాసిన కవి "మీర్ తాకీ మీర్" సూఫీ భావజాలం ఉన్న వ్యక్తి.ఆయన వ్రాసిన అసలు పాటలో ఇంకా చాలా చరణాలున్నాయి.అవన్నీ చదివితే ఈ పాట అసలు భావం ఏమిటో అర్ధం అవుతుంది.
ఇందులో గాయకుడు 'మిత్రులారా నన్ను క్షమించండి.నేను మత్తులో ఉన్నాను' అంటాడు.అతడు చెబుతున్న ఈ మత్తు సారాయి త్రాగితే వచ్చే మత్తుకాదు.దివ్యప్రేమతో హృదయం నిండిపోయినప్పుడు కలిగే ఒక అద్భుతమైన మత్తు ఇది.ఆ కోణంలో ఈ పాటను అర్ధం చేసుకుంటే దీనిలో ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మికార్ధం కనిపిస్తుంది.
ఈ పాటలో "యారోం.." అంటే అప్పటివరకూ తనను అదుపులో ఉంచుకుని నడిపిస్తున్న ఇంద్రియదాస్యం అని అర్ధం.
"ఇన్నాళ్ళూ మీ స్నేహం చేశాను.ఇక చాలు.నన్ను క్షమించండి.ఇప్పుడు నన్ను మీకర్ధం కాని ఒక మత్తు ఆవహించింది.కనుక ఇంక మీ అవసరం నాకు లేదు.ఒకవేళ మీరు ఇంకా నాతో త్రాగించాలని అనుకుంటే(ఇంతకు ముందులాగా ఇంద్రియాకర్షణలతో ప్రలోభపెట్టాలని అనుకుంటే) కుదరదు. కనుక ఒక ఖాళీ పానపాత్రను ఇవ్వండి.చాలు.ఎందుకంటే ఇప్పటికే నాకు బాగా మత్తెక్కి ఉన్నది" అంటాడు.
"ఈ మత్తులో నా అడుగులు తడబడవచ్చు.అంటే మీకర్ధం కాని మాటలు నేను మాట్లాడవచ్చు.మీ దారిలో నేను రాకపోవచ్చు.నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు మీకర్ధం కాని మత్తెక్కింది." అంటాడు.
మీరిప్పుడు రెండు పనులు చెయ్యవచ్చు.
ఒకటి-నా చేతులను మీ చేతులలోకి తీసుకోండి.అంటే నేను పొందుతున్న ఆనందాన్ని మీరూ స్వీకరించండి.అది మీకూ అందాలంటే ఒక పానపాత్రను ప్రేమగా తీసుకున్నట్లు నా చేతులను మీరు పట్టుకోవాలి.
రెండు-ఒకవేళ నన్ను తాకడం మీకిష్టం లేకపోతే, నాతో కొంతదూరం నడచి చూడండి.అంటే, నేను నడుస్తున్న మార్గంలో మీరూ కొంతదూరం నడచి రండి.అప్పుడే నేను ఎలాంటి మత్తులో ఉన్నానో మీకూ తెలుస్తుంది." అంటాడు.
ఆధ్యాత్మిక సాధనలో ఇవి రెండే మార్గాలు.ఇవి తప్ప ఇంకే మార్గమూ అక్కడ లేదు.ఉండబోదు.
చాలా గొప్ప మార్మికార్ధం ఉన్న ఆధ్యాత్మిక గీతం.
కాకపోతే నాకెందుకు నచ్చుతుంది?
Song:--Yaro mujhe maaf karo mai nashe me hoo...
Movie:--Non film song (year not known)
Lyrics:-Mir Taqi Mir
Music:-Murali Manohar Swarup
Singer:-Ch.Atma
Karaoke Singer:- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------------
Yaro mujhe maaf karo-mai nashe me hoo-2
Ab do to jaam khaali hi do-mai nashe me hoo
Yaro mujhe maaf karo
Maajoor ho jo paav mera-Betara pade-2
Betaraa pade
Tum Sargaraa to mujh se na ho
Mai nashe me hoo..
Yaro mujhe maaf karo
Ya haatho haath lo mujhe-Jaise ke jaame mai-2
Jaise ke jaame mai
Ya thodi door saath chalo
Mai nashe me hoo
Yaro mujhe maaf karo
Mai nashe me hoo
Yaro mujhe maaf karo....
Meaning:--
Friends ! Forgive me ! I am intoxicated.
If you want to give, give me an empty goblet
For I am already intoxicated
Friends! Forgive me.
I seek your pardon if my feet take a mis-step
You wont be angry with me.
Will you?
For I am intoxicated.
Friends! Forgive me.
Either take me hand in hand,as you would a glass of wine
or walk a little distance with me
For I am intoxicated.
Friends! Forgive me.
I am intoxicated.
Enjoy
-------------------------------------------------
Yaro mujhe maaf karo-mai nashe me hoo-2
Ab do to jaam khaali hi do-mai nashe me hoo
Yaro mujhe maaf karo
Maajoor ho jo paav mera-Betara pade-2
Betaraa pade
Tum Sargaraa to mujh se na ho
Mai nashe me hoo..
Yaro mujhe maaf karo
Ya haatho haath lo mujhe-Jaise ke jaame mai-2
Jaise ke jaame mai
Ya thodi door saath chalo
Mai nashe me hoo
Yaro mujhe maaf karo
Mai nashe me hoo
Yaro mujhe maaf karo....
Meaning:--
Friends ! Forgive me ! I am intoxicated.
If you want to give, give me an empty goblet
For I am already intoxicated
Friends! Forgive me.
I seek your pardon if my feet take a mis-step
You wont be angry with me.
Will you?
For I am intoxicated.
Friends! Forgive me.
Either take me hand in hand,as you would a glass of wine
or walk a little distance with me
For I am intoxicated.
Friends! Forgive me.
I am intoxicated.