నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

17, జనవరి 2015, శనివారం

One day Astrology Workshop in February-2015

అనేకమంది చాలారోజుల నుంచి నన్ను కోరుతున్నారు జ్యోతిష్యంలో మీ విధానాన్ని మాకూ నేర్పించండి అని.నేర్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు.కానీ అనేక కారణాల వల్ల దానిని వాయిదా వేస్తూ వస్తున్నాను.

ఏ విద్య అయినా మనతోనే ఉండిపోకూడదు.మనతోనే నశించి పోకూడదు అని నేను నమ్ముతాను.నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉన్నవారికి నా వద్ద ఉన్న విద్యలు నేర్పడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను.

ఇప్పుడు,వారందరి అభ్యర్ధనను మన్నిస్తూ,ఫిబ్రవరి 2015 లో One day Astrology workshop నిర్వహించబడుతుందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను.

ఈ workshop  హైదరాబాద్ లో గాని,విజయవాడలో గాని అందరికీ వీలుగా ఉండేలా ఒక ఆదివారం రోజున జరుగుతుంది.ఉదయం ఒక సెషన్ మధ్యాన్నం ఒక సెషన్ ఉంటాయి.ఇందులో పాల్గొనేవారికి నేను అనుసరించే జ్యోతిష్య విశ్లేషణా విధానాన్ని మొదటి నుంచీ నేర్పించడం జరుగుతుంది.సబ్జెక్ట్ ను అతి ప్రాధమికస్థాయి నుంచి మొదలుపెట్టి అతి అడ్వాన్సుడు స్థాయివరకూ క్రమంగా నేర్పడం జరుగుతుంది.

ప్రతి రెండు లేదా మూడు నెలలకొకసారి ఈ విధమైన workshops నిర్వహించి ఉత్సాహం ఉన్నవారికి అసలైన జ్యోతిర్విద్యను నేర్పించాలని,ప్రస్తుతం ఎక్కడ చూచినా పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న కుహనా జ్యోతిష్కులకు విరుద్ధమైన అసలైన జ్యోతిర్విద్యా సాధకులను తయారు చెయ్యాలని నా సంకల్పం.

ఉత్సాహం ఉన్నవారు,మరిన్ని వివరాలకోసం,మా "పంచవటి" గ్రూపు సభ్యుడు శ్రీ రాజు సైకం ను ఈ క్రింది అడ్రస్ లో సంప్రదించగలరు.

E-mail:-- www.raju@gmail.com
Mobile:--9966007557