“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

7, ఏప్రిల్ 2015, మంగళవారం

Noyono Shoroshi Keno - Kishore Kumar




నోయోనో షరోశీ కేనో...

కిషోర్ కుమార్ స్వయంగా రచించి,స్వరపరచి,గానం చేసిన బెంగాలీ ఆణి ముత్యాలెన్నో ఉన్నాయి. అటువంటి మరపురాని మధురగీతాలలో ఇదీ ఒకటి.

కిషోర్ కుమార్ అంటే మనకు తెలిసింది ఒక మంచి హిందీ గాయకుడని మాత్రమే.కానీ ఆయన బెంగాలీలో అత్యద్భుతమైన గీతాలను ఆలపించిన విషయం చాలామందికి తెలియదు. అంతేకాదు ఆయన ఒక మంచి పాటల రచయిత అన్న విషయమూ చాలా మందికి తెలియదు.

ఇలాంటి భావగీతాలను వ్రాయాలంటే ఆ వ్యక్తి ఒక గొప్ప భావుకుడై ఉండాలి.అంతేకాదు నిత్యజీవితపు సంఘటనలలోని విషాదాన్నీ, మానవ హృదయపు ఎదురు చూపులనూ,తీరని ఆశలనూ, ఆకాంక్షలనూ, వేదనలనూ తెలిసినవాడై ఉండాలి. అప్పుడే ఇలాంటి గీతాలను వ్రాయగలడు. లేకుంటే వ్రాయలేడు.

నేనెప్పుడూ ఒక మాటను అంటాను.భావుకుడు గాయకుడు కావచ్చు కాకపోవచ్చు.కాని గాయకుడు తప్పక భావుకుడై ఉండాలి.ఉంటాడు కూడా.

ఎందుకంటే,ఒక భావాన్ని తన స్వరంలో పలికించాలంటే ముందుగా దానిని తన హృదయంలో ఫీల్ అయ్యే శక్తి ఆ గాయకునికి ఉండాలి.అప్పుడే ఆ భావం అతని స్వరంలో అలవోకగా పలుకుతుంది.వినేవారిలో కూడా రసానుభూతిని కలిగిస్తుంది.అదే ఒకనిలో, రచనా పాటవమూ,సంగీతమూ కలిస్తే అది బంగారానికి సువాసన అబ్బినట్లే అవుతుంది.

కిషోర్ కుమార్ అలాంటి భావుకుడు, రచయిత, గాయకుడు, నటుడు, ప్రేమికుడు కూడా.బహుశా తన జీవితపు అనుభవాల నుంచే ఈ గీతాలను అతడు సృష్టించి ఉంటాడు.సామాన్యంగా అందరూ అనుకునేదేమంటే,కిషోర్ కుమార్ ఒక జోకర్ లాగా ప్రవర్తించేవాడని.అతను నటించిన పాత్రలు కూడా అలాంటివే.కానీ అలాంటివారి లోలోపల ఎంతో విషాదమూ తాత్త్వికతా గూడు కట్టుకుని ఉంటాయన్న విషయం చాలామంది సామాన్యులకు తెలియదు. 

జీవితంలో విషాదపు లోతులను చవి చూచినవారే తమ చుట్టూ ఉన్నవారితో హాస్యాన్ని పండించగలరు.ఇది ఒక నగ్నసత్యం.కిషోర్ కుమార్ ఆఖరిసారిగా లతా మంగేష్కర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను గమనిస్తే (ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ఉన్నది) అర్ధం అవుతుంది.అందులో అతను - "నా జీవితం తృప్తిగా గడిచింది.దేవుడు నాకన్నీ ఇచ్చాడు.ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవడానికి అంతా సర్దుకొని సిద్ధంగా ఉన్నాను"-అంటాడు.

అతనిలోని ఒక తాత్వికుడిని ఈ మాటలు చూపిస్తున్నాయి.

బెంగాలీ పదాలు కొంచం విచిత్రంగా ఉంటాయి.కొద్దిగా అర్ధం చేసుకుంటే వాటి సౌందర్యం తెలుస్తుంది.మనం 'నయనం' అనే పదాన్ని వారు 'నొయోనో' అంటారు.మనం సరస్సు అనే పదాన్ని వారు 'షరోషో' అంటారు. బెంగాలీ లో 'కేనో' అంటే 'ఎందుకు?' అని అర్ధం.దానిని వారు పలకడం కూడా 'కేనో' అని పలకరు.'క్యానో' అని ఒకరకంగా విరుస్తూ పలుకుతారు.'జొనోమో షోఫోలో హోబె'అంటే 'జన్మ సఫలం అవుతుంది' అని అర్ధం.ఇలా ప్రతి పదానికీ ఓత్వాలు బెంగాలీ భాషలో ఉంటాయి. 

ఈ పాటను అచ్చం కిషోర్ పాడినట్లు పాడాలని నేను ప్రయత్నించలేదు. ఆయనంత ఎక్కువగా బెంగాలీ దీర్ఘాలు తియ్యకుండా సాఫీగా పాడాను.

మిగతా పాట అంతా బాగానే పాడగలిగాను గాని- నిశిరాతె బీరోహేరో బాషి ఓరే కె బాజాయ్'(ఇంత అర్ధరాత్రిపూట ఈ విషాదరాగాన్ని ఎవరు ఆలపిస్తున్నారు? )- అన్న వాక్యం దగ్గర మాత్రం,గొంతు రుద్ధమై,ఈ పాటను నాలుగుసార్లు రికార్డ్ చెయ్యవలసి వచ్చింది.

మంచి భావగీతం.

Song:--Noyono Sharoshi Keno..
Lyrics:--Kishore Kumar
Music:--Kishore Kumar
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-----------------------------------------
Noyono shoroshi keno bhoreche jole
koto ki royeche lekha kajole kajole-2
Noyono sharoshi keno

bedonarokoli tumi dao bhalobeshe bodhu-2 
ful photanore chole- ami bhore debo modhu
sharamon keno tumi - chokhe shaaajale 
koto ki royechE lekha kajole kajole
Noyono sharoshi keno

Jonomo shofolo hobe- bodhuaro ghore aaj
shoromero Adalete -dekha jabe phuloshaj
nishiraate birohero...
nishiraate birohero...
bashi ore ke baajae

bhalobeshe keno bodhu 
aaj shudhu kedhe jae
shedhe shedhe keno tumi morono nile 
kotoki royeche lekha kajole kajole

noyono sharoshi keno- bhoreche jole
kotoki royeche lekha- kajole kajole

Noyono sharoshi....

తెలుగు స్వేచ్చానువాదం:--

నీ నయనాలనే కలువ సరస్సులు
ఎందుకు నీటితో నిండి ఉన్నాయి?
కాటుక అనే సిరాతో వాటిల్లో ఏం వ్రాసి ఉందో?

నీ కన్నులనే పూలరేకుల్లో
ఆ విషాదం ఎందుకు?
దాని స్థానే నాకోసం మెరుపులు నింపు
నేనొక చిలిపి తుమ్మెదగా మారి
ఆ పూలల్లో మధువును నింపుతాను
నీ హృదయపు కోటి కోర్కెలను
నీ కన్నుల వంపులలో నింపావు
కాటుక అనే సిరాతో వాటిలో ఏం వ్రాసుందో?

ఈ రాత్రి నా ప్రేయసి ఇంటిలో
నా జన్మ సఫలం అవుతుంది
సిగ్గుతో నిండిన ఆ కళ్ళలోనుంచి
తన సుకుమార సౌందర్యాన్ని దర్శిస్తాను

ఈ అర్ధరాత్రి పూట ఎవరు ఆలపిస్తున్నారు
ఈ అర్ధరాత్రి పూట ఎవరు ఆలపిస్తున్నారు
ఈ విషాద రాగాన్ని?

తన ప్రేమకు ప్రతిగా తన కళ్ళలో
కన్నీటినే ఈ రాగం రప్పిస్తుంది
ఓ ప్రియతమా?
ఎందుకు ఇలాంటి విషాదాన్ని
అక్కడ నింపావు?
కాటుక అనే సిరాతో
అక్కడ ఏం వ్రాసి ఉందో?

నీ నయనాలనే కలువ సరస్సులు
ఎందుకు నీటితో నిండి ఉన్నాయి?
కాటుక అనే సిరాతో వాటిల్లో ఏం వ్రాసి ఉందో?
నీ నయనాలనే కలువ సరస్సులలో...

English Meaning:--

Why the lily ponds of your eyes
are full of water(tears)?
I wonder what is written
with Kajal over there

Mystic flowers they are...my love
Let sparkles blossom in them
Wish I were an amorous bee
and fill them with lovely honey
All your heart’s desires
You embellish in the corners of your eyes
I wonder what is written
in the Kajal over there
Why? The lily ponds of your eyes...

Tonight my life will be blessed
In the abode of my beloved
Through the bashful shade of her eyes
I wish I could see her heavenly beauty

Who at this hour of midnight
Who at this hour of midnight
Keeps playing such a melancholic tune?

In return of her love
It brings only tears in her eyes
Why did you my dear,
Invoke such a desolation?
I wonder what is written
In the Kajal over there

Why the lily ponds of your eyes
are full of water?
I wonder what is written
with the Kajal over there
The lily ponds of your eyes....