“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

3, ఏప్రిల్ 2015, శుక్రవారం

Bedona Modhur Hoye Joy - Jagjit Singh




Youtube Link
https://youtu.be/crKGf4rg9io

బేదోనా మొధుర్ హొయే జాయ్ ...తుమీ జొదీ దావ్...

నేను పాడిన మధురాతి మధురమైన బెంగాలీ గీతాన్ని ఈ పోస్ట్ లో మీకు పరిచయం చేస్తున్నాను.ఏ గాయకుడైనా ఇలాంటి పాటలను తన జీవితం మొత్తంలో ఒక పది పాడగలిగితే చాలు.అతని జన్మ ధన్యం అవుతుంది. డబ్బుకోసం గాయకులు నానా చెత్తపాటలూ పాడుతూ ఉంటారు.అది వారికీ ఇష్టం ఉండదు.ఆత్మతృప్తీ కలగదు.ఊరకే డబ్బుకోసం పాడతారు.కానీ కొన్ని పాటలు పాడినప్పుడు కలిగే ఆత్మసంతృప్తి ఎంత డబ్బుతోనూ రాదు.ఈ పాట అలాంటిది.మనసు పెట్టి వింటే ఈపాట మిమ్మల్ని సునాయాసంగా పరవశ స్థితిలోకి తీసుకుపోతుంది.

ఈ పాటను పాడింది మధురగాయకుడు- ఘజల్ కింగ్- జగ్ జీత్ సింగ్.పేరుకు తగినట్లే ఆయన తన మధురగానంతో ప్రపంచాన్నే జయించాడు.

బెంగాలీ చాలా simple and sweet language.సంస్కృతం దేవభాష అని మనం అంటాము.కానీ బెంగాలీ కూడా దేవభాషయే అని నేను భావిస్తాను.శ్రీ రామకృష్ణులు ఆ భాషను మాట్లాడటమే దానికి కారణం.ఆయన వాక్కు సోకి దానికి కూడా దైవత్వం వచ్చింది.

ఈ పాట భావాన్ని క్రింద ఇచ్చాను.ఆ భావం అర్ధం చేసుకుని ఈ పాటను వింటే అది పాట మాధుర్యాన్ని నూరు రెట్లు ఎక్కువ చేస్తుంది.

సంస్కృతంలో 'వేదన' అనే పదం ఉన్నది.తెలుగులో కూడా 'వేదన' అనే అంటాము.దాని అర్ధం 'బాధ' అని.బెంగాలీలో దానిని 'బేదోనా' అంటారు.మనం 'వ' అనే శబ్దాన్ని వారు 'బ' అని పలుకుతారు.అందుకే "వంగ దేశం" 'బెంగాల్" గా మారింది.మన తెలుగువారికున్న చెత్త టేస్ట్ తో,ఇలాంటి మధురమైన భావాలున్న మధుర గీతాలు తెలుగులో ఇంకొక నూరేళ్ళకైనా వస్తాయో రావో సందేహమే?

"బేదోనా మొధుర్ హోయే జాయ్, తుమి జొదీ దావ్" అంటే అర్ధం-- 'వేదనకూడా మధురంగా ఉంటుంది, నీ చేతితో దానిని ఇస్తే' - అని.

జగ్జీత్ సింగ్ ఈ పాటను ఎంత మధురంగా పాడాడో మాటల్లో చెప్పలేము.అదే మాధుర్యాన్ని నా పాటలో కూడా నింపడానికి ప్రయత్నం చేశాను.ఈ పాట సౌందర్యం అంతా దాని simplicity లోనూ,మధురమైన రాగంలోనూ ఉన్నది.

ఈ పాట నాకత్యంత ప్రియమైన పాటల్లో ఒకటి.అందుకే,దీనిని తెలుగులో నేనే వ్రాసుకున్నాను.రాగం ఇదే.కానీ లిరిక్స్ తెలుగువి.ఆ పాటను రేపు అందిస్తాను.అంతవరకూ ఈ పాటను వింటూ ఆనందసాగరంలో  తేలియాడండి.

ప్రశాంత వాతావరణంలో కూచుని, కళ్ళు మూసుకుని,తదేకంగా ఈ పాటను వింటే,ముందు మగతలోకి-ఆ తర్వాత మత్తులోకి-ఆ తర్వాత ట్రాన్స్ లోకి పోవడం ఖాయం.



Song:--Bedona Modhur Hoye Jaay
Singer:--Ghazal King Jagjit Singh
Album:--Trishna
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
--------------------------------------------

[BedOna modhur hoye jaTumi jodi dao..]-2
Mukher kothay hoyJegaan Tumi jodi gavo (2)
BedOnaa modhur hoye jaTumi jodi dao..

Kuashaye raat hoye bhor--Kete jaye adharEr ghor-2
Chokher  taraye naame shorgo--Tumi jodi chao-2
Bedona --modhur hoye jae--Tumi jodi dao-|2|

{JEyi din Jeneche yeyimon--Tumije aamaaar...
Shei thekeja peyecheShe--shobije tomaar} (2)

[Jotho bhul bhenge giye tayDekhi fool - jedike chai]-2
Dukkho hoy pritee orgho Jodi diye jao-2

BedOna -modhur hoye jaayTumi jodi dao-2

[Mukher kothay hoy jegaan Tumi jodi gao]-2
[Bedona modhur hoye jayTumi jodi dao]-2

Meaning:--

Pain becomes sweet
If offered by you
Every word becomes a song
If uttered by you

Dawn rises amid mist
the darkness of night drifts
Heavens shall descend in the sparkles of eyes
If wished by you

On the day my heart realized that you are mine
Whatever it earned-everything became yours

Breaking the barriers of pain
Where ever I cast my vision
I see only flowers
Sorrow becomes bliss
If offered by you...

Pain becomes sweet
If offered by you
Every word becomes a song
If uttered by you...