శ్రీశైలం సాధనా సమ్మేళనం-7 విశేషాలు (మే 2015)
|
Group Photo taken in front of Shivaji Sphurthi Kendram-Srisailam |
|
Group Photo taken in front of Shivaji Sphurthi Kendram-Srisailam |
|
|
Inside the Shivaji Kendram with Sri Nageshwar Rao garu,its secretary |
|
On the way to Pathala Ganga |
1-5-2015 నుండి 3-5-2015 వరకు శ్రీశైల మహాక్షేత్రంలో ఏడవ సాధనా సమ్మేళనం జరిగింది.పంచవటి గ్రూప్ లో ఉన్న 89 సభ్యులలో 21 మంది (నాతో సహా)మాత్రమే దీనికి హాజరవ్వగలిగారు.మిగిలినవారు ఈ అవకాశాన్ని అందుకోలేక పోయారు.ఈ సారికి వారికి అదృష్టం కలసి రాలేదు.
|
On the terrace where 2nd initiation was given |
|
Select 5 who had second level initiation on Chinnamasta Jayanthi |
వైశాఖ పౌర్ణమి ఛాయలో మూడు రోజులు శ్రీశైల మహాక్షేత్రంలో ఉంటూ ఇతర వ్యాపకాలు ఆలోచనలు ఏమీ లేకుండా 60 గంటలపాటు ఏకధాటిగా సాధనలో గడపడం జరిగింది.హాజరైన సభ్యులందరికీ,అంటే 20 మందికీ, First Level Initiation ఇవ్వడం జరిగింది.ఇది యోగ-తంత్ర పరిభాషలో 'ప్రాణ సంచాలన క్రియ' (Prana Adjustments Initiation) అనబడుతుంది.
మూడో రోజున,అంటే వైశాఖ పౌర్ణమి రోజున ఉదయం 5 గంటలకు ప్రశాంత ఉదయసంధ్యా సమయంలో వీరిలో ఎంచుకొనబడిన 5 గురికి రహస్యమైన Second Level Initiation ఇవ్వబడింది.ఇది 'కుండలినీ జాగరణక్రియ' (Kundalini Activation Initiation) అనబడుతుంది.మూడురోజులూ వారి సందేహాలకు సమాధానాలు ఇస్తూ,'శ్రీవిద్యా రహస్యం' నుంచి కొన్ని భాగాలను వారికి వివరిస్తూ,లోతైన ఆధ్యాత్మిక విషయాలను హాజరైన సభ్యులకు బోధించడం జరిగింది.
|
During Sadhana session |
ఈ సాధనా సమ్మేళనానికి వచ్చిన పంచవటి సభ్యులకు మొదటిరోజు నుంచే ఆధ్యాత్మిక అనుభవాలు అనేకం కలిగాయి.కొన్ని ఏళ్ళపాటు ఇతర మార్గాలలో సాధన చేసినా కలుగని అనుభవాలు వీరికి మొదటిరోజునుంచే కలిగాయి.ఇది వారిని చాలా ఆశ్చర్యపరచింది.
|
At the place where I stayed |
వైశాఖ పౌర్ణమి రోజున--ఈ మూడురోజుల సాధనలో వారికి కలిగిన అనుభవాలను నిత్యజీవితంలోకి ఎలా అనువదించాలి?నిత్యజీవితంలో వచ్చే రోజువారీ సమస్యలను యోగిక్ కోణంలో ఎలా డీల్ చెయ్యాలి? అన్న సూక్ష్మమైన విషయాలను వారికి ప్రాక్టికల్ గా వివరించి చెప్పడం జరిగింది.
|
Praying to Divine Father and Divine Mother
Before commencing Sadhana |
మేము అక్కడ అడుగుపెట్టిన సాయంకాల సమయంలో ఎన్నడూ లేని విధంగా ఒక సుడిగాలితో కూడిన వాన ఈ మండువేసవిలో హటాత్తుగా ప్రత్యక్షమై కొద్దిసేపు ఆ ప్రాంతాన్ని కుదిపేసి హటాత్తుగా మాయమైంది.ఈ సుడిగాలి అక్కడకు 16 కిమీ దూరంలో ఉన్న కదళీవనం వైపునుంచి వచ్చి మళ్ళీ ఆవైపుకే తిరిగి వెళ్ళిపోయింది.కదళీవనం మహాసిద్ధక్షేత్రమని తెలిసిన విషయమే.
|
Explaining relevant chapters from 'Sri
Vidya Rahasyam' |
మహాయోగిని అక్కమహాదేవి,వీరశైవ సిద్ధగురువైన అల్లమప్రభువే కాక, ఆదిశంకరాచార్యులు,అవతారమూర్తియైన దత్తాత్రేయులు ఇంకా ఎందఱో ప్రాచీన మహాసిద్ధులు అక్కడ తపస్సు చేసినారు.వీరిలో అక్కమహాదేవి, అల్లమప్రభువులు అక్కడనే విదేహముక్తిని పొంది పరమేశ్వరునిలో లీనమైనారు.మహాసిద్ధగురువుల నుంచి మా సాధనా సమ్మేళనానికి వచ్చిన అనుగ్రహంగా ఈ సూచనను స్వీకరించడం జరిగింది.
ఇవ్వబడిన సాధనను క్రమం తప్పకుండా చెయ్యమని,తద్వారా కొన్ని నెలలలో మళ్ళీ జరుగబోయే సాధనా సమ్మేళనంలో ఇంకా ఉన్నత స్థాయిలకు ఎదగాలని మొదటి రెండు దీక్షలను స్వీకరించిన అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాను.
|
Guiding the participants in sadhana |
|
A happy occasion |
భవిష్యత్తులో జరుగబోయే సాధనా సమ్మేళనాలకు హాజరయ్యే అర్హతను సంపాదించుకొమ్మని, ఈసారి హాజరు కాలేకపోయిన పంచవటి సభ్యులను ఈ సందర్భంగా ఉద్బోధిస్తున్నాను.