నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, జూన్ 2015, శుక్రవారం

'తారాస్తోత్రమ్' - పుస్తకం ఆవిష్కరింపబడింది











'తారా స్తోత్రమ్' పుస్తకావిష్కరణ నిన్న విజయవాడ కనకదుర్గమ్మవారి సన్నిధిలో నిరాడంబరంగా జరిగింది.

కనకదుర్గమ్మ నిజానికి తారాదేవి రూపమే అని నా నమ్మకం.ఎందుకంటే చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ మన దేశాన్ని దర్శించినప్పుడు ఆయనకు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండమీద పెద్ద వెలుగు కనిపించిందని వ్రాశాడు.ఆ వెలుగు తారాదేవి యొక్క తేజస్సని  ఆయన అన్నాడు.

అందుకే తారాదేవి అనుగ్రహ ప్రవాహమైన ఈ పుస్తకాన్ని అమ్మ సన్నిధిలో అతి నిరాడంబరంగా ఆవిష్కరణ జరిపాను.పుస్తకాల కట్టను అమ్మ పాదాలవద్ద ఉంచి ఆ తర్వాత మా అబ్బాయి మాధవ్ చేతులమీదుగా పుస్తకావిష్కరణ జరిపాము.తను రెండువారాల సెలవులో ఇండియా వచ్చాడు.మళ్ళీ రెండురోజుల్లో డెట్రాయిట్ వెడుతున్నాడు.అందుకని తన ద్వారా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

పంచవటి ప్రచురణల నుంచి వెలువడిన రెండవ పుస్తకం ఇది.

మూడవ పుస్తకంగా- 'దక్షిణేశ్వర వైభవమ్-ఒంటిమిట్ట కోదండ రామస్తుతి'-త్వరలో రాబోతున్నది.

ఆ తర్వాత నాలుగో పుస్తకంగా--ప్రపంచ జ్యోతిష్య సాహిత్య చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోబోతున్న-Three Hundred Live charts-Exhaustive analysis of relevant Bhavas'- అనే అద్భుతమైన పుస్తకం - మూడువందల జాతకచక్రాల విశ్లేషణలతో ఇంగ్లీషులో రాబోతున్నది.

పుస్తకాలను అమ్మ పాదాల వద్ద ఉంచిన తర్వాత, కనకదుర్గమ్మ మెడలో ఉన్న దండను తీసి అర్చకులు నా మెడలో వెయ్యడం మరపురాని అనుభూతిని కలిగించింది.అమ్మ అనుగ్రహంగా దీనిని స్వీకరించాను.


ఈ సందర్భంగా పంచవటి సభ్యులకు,నా బ్లాగ్ చదువుతూ నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను.

హుటాహుటిన రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరి వచ్చి మాతో పాటు రోజంతా తిరిగి ద్వారకా తిరుమల,విజయవాడలలో కార్యక్రమం అంతా మాతో పాటు ఉన్న పంచవటి ట్రస్ట్ P.R.O రాజూ సైకం కు కృతజ్ఞతలు.

పుస్తకావిష్కరణ కోసం కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన మైధిలీరాం దంపతులకు,ముఖ్యంగా పబ్లిషర్ దగ్గర కూర్చుని మరీ సమయానికి పుస్తకాలను వచ్చేలా చేసి,ఆ తర్వాత మాకందరికీ ఉపాహారం అందించి,బిజీ షెడ్యూల్ తో కూడిన రోజు తర్వాత, రాత్రికి వంట చేసుకునే బాధను తప్పించిన మిసెస్ మైథిలీరాం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.