నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

31, జులై 2015, శుక్రవారం

గురువు - దేవుడు - ఆత్మ

"ఈశ్వరో గురురాత్మేతి"..అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.అంటే, దైవము, గురువు,ఆత్మా ఒక్కరే అని అర్ధం.

గురుపూర్ణిమ సందర్భంగా ఎవరెన్ని ఉపన్యాసాలు చెప్పినప్పటికీ అసలైన ఒక్క విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పడం లేదు.ఒకవేళ ఎవరైనా నాబోటివాడు చెప్పినా ఎవరూ పాటించడమూ లేదు.

అదేంటంటే - మనుషులు గురువును పూజిస్తారు గాని గురుబోధను పాటించరు.అలాగే దేవుడిని పూజిస్తారు గాని దేవుడిని (చేరాలని) కోరుకోరు.

ఇదే మానవజాతి ఆడుతున్న అతి పెద్దనాటకం.ఈ నాటకాన్ని గమనించలేనంత తెలివితక్కువ వాళ్ళు కారు దేవుడూ గురువూ.

గురుబోధను పాటించాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి.దీనికి ఎవ్వరూ సిద్ధంగా లేరు.

దైవాన్ని చేరుకోవాలంటే నువ్వే అదృశ్యం కావాలి.దీనికీ ఎవరూ సిద్ధంగా లేరు.

మరి మహాభక్తులుగా నటిస్తున్న ఈ లోకులందరూ ఏం చేస్తున్నారు?

"మేము నీ బోధను పాటించము.కానీ మేము కోరిన వరాలు మాకివ్వు. కష్టాల్లో మాకు అండగా ఉండు" - అని గురువు చుట్టూ చేరి గోల పెడుతున్నారు.

"నువ్వు మాకక్కర్లేదు.మేం చేసే పూజలు స్వీకరించి మేము కోరుకునే వరాలు మాత్రం మాకివ్వు" - అని దేవుడితో చెబుతున్నారు.

వెరసి దైవాన్నీ గురువునూ మానవులు అడ్డంగా తిరస్కరిస్తున్నారు.వాళ్ళ దగ్గర ఉన్న వరాలిచ్చే శక్తిని మాత్రం వీళ్ళు దోపిడీ చెయ్యాలని చూస్తున్నారు. అదికూడా పూజ అనే లంచం ఆశచూపించి.అంటే - లోకంలో ఆడే నాటకాలనే దైవం దగ్గర,గురువు దగ్గరా కూడా ఆడాలని వీళ్ళు చూస్తున్నారు. అంతేకాదు ఆడుతున్నారు కూడా.

మనుషులకు నిజంగా కావలసింది దేవుడూ కాదు గురువూ కాదు.వాళ్లకు కావలసింది సెక్యూరిటీ మాత్రమే.ఒక మానసిక ఆసరా మాత్రమే వాళ్లకు కావాలి.వారు ఆడే రోజువారీ నాటకాలకు ఒక డివైన్ సపోర్టూ డివైన్ శాంక్టిటీ మాత్రమే వారికి కావాలి.మేము చేస్తున్నవి పాపాలు కావు,మేము చేస్తున్నవి తప్పులు కావు - అన్న భరోసా మాత్రమే వారికి కావాలి.ఒకవేళ అవి తప్పులూ పాపాలూ అయినా సరే వాటిని ఎల్లకాలమూ క్షమిస్తూ, 'నీ పద్ధతి మార్చుకో' అని చెప్పకుండా,వీళ్ళు పెడుతున్న బెల్లమూ మరమరాలూ కొబ్బరి ముక్కలూ తింటూ నోర్మూసుకుని పడుండే దేవుడే వీరికి కావాలి.

"నువ్వు నడుస్తున్న దారి తప్పుదారి.అది సరియైన దారి కాదు.నువ్వు మారాలి." అని చెప్పే గురువునూ దేవుడినీ మనుషులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారు.

తమతమ స్వార్ధపూరిత అవసరాలకోసం,దేవుడిని పూజించినట్లు మనుషులు నటిస్తారు.గురువు చెప్పినది విన్నట్లు నటిస్తారు.కానీ ఈ రెండూ త్రికరణశుద్ధిగా మాత్రం ఎవ్వరూ చెయ్యరు.

ఈ క్రమంలో గురువుకూ దైవానికీ నిజానికి దూరం అవడమే గాక, వారికి ప్రతిరూపం అయిన తన ఆత్మకు కూడా దూరమై పోతున్నారు.ఈ మూటికీ దూరమైన వానికి జీవితంలో శాంతి ఎలా ఉంటుంది? అందుకే నేడు ఎవరి జీవితాలు చూచినా శాంతి మాత్రం లేదు.మిగిలినవన్నీ ఉండవచ్చు.కానీ శాంతి మాత్రం లేదు.

దానికి అసలైన కారణం దైవానికీ, గురువుకూ,ఆత్మకూ దగ్గరౌతున్నామన్న భ్రమలో ఉంటూ ఇంకా ఇంకా దూరం కావడమే.

మానవులు ఈ మోసపూరితమైన తమ మనస్తత్వాన్ని పోగొట్టుకోనంత వరకూ వారికి శాంతి ఎప్పటికీ దొరకదు.

ఇది రేపటి సూర్యోదయమంత నిజం.
read more " గురువు - దేవుడు - ఆత్మ "

30, జులై 2015, గురువారం

అబ్దుల్ కలాం మరణం -- సమయానికి అందని వైద్యసహాయం

అబ్దుల్ కలాం గారి మరణానికి వెనుక గల జ్యోతిష్య కారణాలనూ, రామేశ్వరంలో పుట్టిన ఆయన షిల్లాంగ్ లో మరణించడానికి వెనుక గల కర్మరహస్యాలనూ కొద్దిసేపు పక్కన ఉంచితే, ఒక పెద్ద పేరుగాంచిన విద్యాసంస్థలో ఉపన్యాసం ఇస్తూ ఇస్తూ కార్డియాక్ అరెస్ట్ కు గురైన ఒక దేశపు మాజీ రాష్ట్రపతికి వెంటనే అందవలసిన వైద్యసహాయం అందలేదనేది మాత్రం చేదువాస్తవం.

ఈ విషయాన్ని ఏ మీడియా అయినా చెబుతున్నదో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే నాకు ఈ దేశపు రాజకీయాల మీదా, వాటి తొత్తైన మీడియా మీదా ఏమాత్రం నమ్మకం లేదుగాబట్టి, నేను టీవీ చూడను గాబట్టి.

కలాంగారికి గోల్డెన్ అవర్ లో వైద్య సహాయం అందలేదు.

ఇది పచ్చినిజం.

మన దేశంలో మనుషులకు వాగుడెక్కువ,సమయానికి చెయ్యవలసిన పనిని చెయ్యడం మాత్రం తక్కువ అని నా నమ్మకం ఇప్పటిది కాదు.కనీసం నాకు ఊహ వచ్చినప్పటినుంచీ ఈ నమ్మకం నాలో ఉన్నది.ఆ నమ్మకం అనేక సంఘటనలను చూచిన మీదట ఏర్పాటైనది గాని ఏదో గాలివాటంగా ఏర్పరచుకున్నట్టిది కాదు.

గతంలో నా ఈ నమ్మకం ఎన్నోసార్లు రుజువౌతూ వచ్చింది. ప్రస్తుతం కలాం గారి మరణం చూచిన తర్వాత అది నిజమే అని మరొక్కసారి రుజువైంది.

ఒక మనిషికి C.A (Cardiac Arrest) అయినప్పుడు పది సెకన్ల లోపే గనుక C.P.R (Cardiac Pulmonary Resuscitation) గనుక చెయ్యగలిగితే అతన్ని నూటికి 99 కేసుల్లో తప్పకుండా బ్రతికించవచ్చు.ఈ సంగతి డాక్టర్లకందరికీ తెలుసు.డాక్టర్ల వరకూ ఎందుకు? నర్స్ ట్రైనింగ్ అయిన వారికి కూడా ఈ విషయం బాగా తెలుసు.ప్రస్తుతం సివిల్ వాలంటీర్లకు, ఎమర్జెన్సీ వర్కర్లకు, డిజాస్టర్ మేనేజిమెంట్ టీం మెంబర్లకు, సాధారణ పౌరులకు కూడా ఇలాంటి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడంలో శిక్షణ ఇస్తున్నారు.కానీ ఆ సమయంలో అక్కడ ఉన్న అంతమందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా C.P.R చెయ్యడానికి పూనుకోకపోవడమూ అంతేగాక ఆయన్ను వెంటనే కారులో పడేసి అరగంట సేపు డ్రైవ్ చేస్తూ ఆస్పత్రికి తీసుకు పోవడమూ వాళ్ళు చేసిన ఘోరమైన పొరపాటు.

ఆ సమయాన్నే గోల్డెన్ అవర్ అంటారు.ఆ సమయంలో ప్రతి నిముషమూ విలువైనదే.ఒక్కొక్క నిముషం గడచేకొద్దీ కార్డియాక్ అరెస్ట్ అయిన మనిషి పూర్తిగా మరణపు ఛాయలోకి అతివేగంగా జారిపోతూ ఉంటాడు.

అక్కడ ఉన్నవాళ్ళు వెంటనే C.P.R ప్రాసెస్ చెయ్యకపోవడమే కలాం గారి మరణానికి అసలైన కారణం.అంత ఉన్నత విద్యావంతులున్న I.I.M లో కనీసం కృత్రిమశ్వాస ఇవ్వడంలో శిక్షణ కూడా ఎవ్వరికీ లేదంటే ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు.మినిమం లైఫ్ సేవింగ్ స్కిల్స్ కూడా లేని అక్కడి ట్రెయినీలు బయటకొచ్చి చేసేదేమిటి? కంపెనీలు పెట్టి,వైట్ కాలర్ మోసాలూ ఆర్ధికనేరాలూ తెలివిగా చేసి అవినీతి రారాజులు కావడమా? లేక MNC ప్రాడక్ట్స్ మన దేశంలో విచ్చలవిడిగా అమ్మడానికి ఏజంట్లుగా మారి దేశసంపదను విదేశీకంపెనీలు కొల్లగొట్టడంలో తమవంతు పాత్రను నిస్సిగ్గుగా పోషించడమా?మినిమం లైఫ్ సేవింగ్ స్కిల్స్ లేని ఆ I.I.M ట్రెయినింగ్ అసలు ఎందుకు?

పైగా -- ఆయన ఇప్పటికే హార్ట్ పేషంట్ అని అందరికీ తెలుసు.అలాంటి హృద్రోగి అయిన ఒక మాజీ రాష్ట్రపతి పక్కన ఎమర్జెన్సీ సహాయానికి ఒక్క డాక్టరు కూడా లేకపోవడం ఏమిటి? సమయానికి ఇవ్వవలసిన వైద్య సహాయం అందక ఆయన అలా చనిపోవడం ఏమిటి? ఇప్పుడు ఎన్ని రాజలాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు చేస్తే మాత్రం ఉపయోగం ఏముంది?

మన దేశంలో ఉపన్యాసాలు ఇచ్చేవారు చాలా ఎక్కువ.ఉత్తమాటలు చెప్పేవారు కూడా చాలా ఎక్కువ.కానీ సమయానికి చెయ్యవలసిన పని చేసేవారు మాత్రం చాలా చాలా తక్కువ.

మాటలు తగ్గించి నైపుణ్యాలు పెంచుకోవడం చాలా అవసరం అనీ, సమయానికి ఉపయోగపడని స్కిల్స్ అన్నీ వృధా అనీ ఈ సంఘటన మళ్ళీ నిరూపిస్తున్నది.

రోడ్డు మీద యాక్సిడెంట్ అయి సమయానికి సహాయం అందక చనిపోయిన సామాన్యుడికీ, ఒక ఉపన్యాసం ఇస్తూ కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలిపోయి, సమయానికి వైద్య సహాయం అందక మరణించిన మాజీ రాష్ట్రపతికీ ఏమీ భేదం లేదు - ఘనత వహించిన మన దేశంలో.

సమన్యాయం అంటే ఇదేనేమో?

ఒకవేళ సమన్యాయం ఇదే అయితే మాత్రం, మన దేశంలో వెల్లివిరుస్తున్న ఈ రకమైన సమన్యాయాన్ని చూచి కొద్దిగానైనా ఆలోచనా,మనసూ మిగిలున్న కొద్దిమంది కూడా సిగ్గుతో తలలు వంచుకోక తప్పదు.

మారుమూల పల్లెలలో కూడా వైద్యులుండాలి.అతి పేదవాడికి కూడా వైద్యం అందాలి --అని స్టేజీలేక్కి అరిచే నాయకులు ఒక మాజీరాష్ట్రపతికి పట్టిన ఈ గతికి ఏం సమాధానం చెబుతారో?

అయినా, నా పిచ్చిగానీ, ఈ దేశంలో ఎవరు ఎవరికి జవాబుదారీ గనుక? ఎవరు ఎవరికి జవాబు చెప్పాలి గనుక?

మన గతిచూసి ఇతర దేశాలు పగలబడి నవ్వుతున్నాయన్న జ్ఞానం అయినా మనకు లేకపోవడం భావనైచ్యానికి పరాకాష్ట.

ఓ మహానుభావా! మళ్ళీ పుట్టవా? అని అరిచేవారంతా-, "ఓరి వెధవల్లారా!బ్రతికున్నపుడు చివరిక్షణంలో మీరు నాకేం చేశారు? రక్షించవలసిన సమయంలో ఆ పని చెయ్యకుండా అరగంట సేపు నన్నెందుకు కారులో పడేసి తిప్పారు? నా ప్రాణాలెందుకు మీ చేతులారా తీశారు? నేనెందుకు ఇలాంటి దేశంలో మళ్ళీ పుట్టాలి? మీ మధ్యకెందుకు నేను మళ్ళీ రావాలి?"- అని కలాం ఆత్మ ఎదురు ప్రశ్నిస్తే ఏం జవాబు చెబుతారో?  

ఇలాంటి ప్రజలతో ఈ దేశం అసలెప్పటికి బాగుపడుతుందో?
read more " అబ్దుల్ కలాం మరణం -- సమయానికి అందని వైద్యసహాయం "

Guru Purnima-2015 సందేశం



గురుపూర్ణిమ సందేశాన్ని ఇక్కడ వినండి
read more " Guru Purnima-2015 సందేశం "

28, జులై 2015, మంగళవారం

Dum Dum Diga Diga - Mukesh



Youtube link
https://youtu.be/eaYnmMb8uRo

డం డం డిగా డిగా మౌసం భిగా భిగా
బిన్ పియే మై తో గిరా మై తో గిరా మై తో గిరా...
హాయ్ అల్లా సూరత్ ఆప్ కీ సుభానల్లా...
హాయ్ అల్లా సూరత్ ఆప్ కీ సుభానల్లా...

1960 లో వచ్చిన Chhalia అనే సినిమాలోది ఈ పాట.ఈ సినిమాలో రాజ్ కపూర్,నూతన్ నటించారు.ఇదికూడా ముకేష్ స్వరంలో ధ్వనించిన నిత్యనూతన మెలోడీ గీతమే.ఈ పాటకి కళ్యాణ్ జీ ఆనంద్ జీ ఒక మంచి పాపులర్ రాగాన్ని స్వరపరిచారు.ఈపాట ఈరోజు విన్నా ఎంతో మధురంగా ఉంటుంది.

ఈ సినిమాలో కూడా - తనకు ఎక్కువగా అలవాటైన సామాన్యుడి పాత్రలోనే రాజ్ కపూర్ నటించాడు.అయితే ఈ సామాన్యుడికి మంచిహృదయం ఉంటుంది.ఇది రాజ్ కపూర్ సినిమాలలో సర్వసాధారణంగా కనిపించే అంశమే.

ఈ సామాన్యుడు తన చుట్టూ ఉన్న మనుషుల కష్టసుఖాలలో చొరవగా పాలు పంచుకుంటాడు.వర్షం పడినా, మంచి సూర్యోదయాన్ని చూచినా, మంచి ప్రకృతి దృశ్యాన్ని చూచినా మైమరచి నృత్యం చేస్తాడు.అంటే అంత సున్నితమైన మనసు కలిగినవాడన్నమాట.

Movie:--Chhalia (1960)
Lyrics:--Qamar Jalalabadi
Music:--Kalyanji Anandji
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
----------------------------------
dam-dam, diga-diga
mausam bhiga-bhiga
dam-dam, diga-diga
mausam bhiga-bhiga
bin piye main to gira, main to gira, main to gira
haay allaah!, soorat aap ki subhaan-allaah
haay allaah!, soorat aap ki subhaan-allaah
dam-dam, diga-diga
mausam bhiga-bhiga
bin piye main to gira, main to gira, main to gira
haay allaah!, soorat aap ki subhaan-allaah
haay allaah!, soorat aap ki subhaan-allaah

teri ada waah! waah! kya baat hai
haaye, teri ada
are, teri ada waah! waah! kya baat hai
ankhiyaan jhuki-jhuki, baaten ruki-ruki
ankhiyaan jhuki-jhuki, baaten ruki-ruki
dekho koi re aaj lut gaya
haay allaah ! soorat aap ki subhan allah
haay allaah!, soorat aap ki subhaan-allaah
dam-dam, diga-diga
mausam bhiga-bhiga
bin piye main to gira, main to gira, main to gira
haay allaah!, soorat aap ki subhaan-allaah
haay allaah!, soorat aap ki subhaan-allaah

sanam ham maana gareeb hain
haaye sanam ham
aji sanam ham maana gareeb hain
nasiba khota sahi, banda chhota sahi
nasiba khota sahi, banda chhota sahi
dil ye khazaana hai pyaar ka
haay allaah ! soorat aap ki subhan allah
haay allaah ! soorat aap ki subhan allah
dam-dam, diga-diga
mausam bhiga-bhiga
bin piye main to gira, main to gira, main to gira
haay allaah!, soorat aap ki subhaan-allaah
haay allaah!, soorat aap ki subhaan-allaah
haay allaah!, soorat aap ki subhaan-allaah
haay allaah!, soorat aap ki subhaan-allaah
read more " Dum Dum Diga Diga - Mukesh "

అబ్దుల్ కలాం జాతకం - కొన్ని విశేషాలు

ఉదయాన్నే ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగాడు.

'అబ్దుల్ కలాం పోయారు కదా. ఈరోజు ఆయన జాతకం నువ్వు వెయ్యబోతున్నావని నేను జోస్యం చెబుతున్నాను. ఇది ఖచ్చితంగా నిజం అవుతుంది చూడు'.

'సరే.నీ జోస్యం నిజమౌతుంది.ఇంత మంచి జోస్యం చెప్పినందుకు నీకు మంచి టీ పార్టీ ఇస్తాలే.' అన్నా నవ్వుతూ.

'అయినా నీకిదేం పని? ఎప్పుడూ పోయినవాళ్ళ జాతకాలు వేస్తుంటావ్?' అడిగాడు కొంచం అతిచనువుగా.

'మీలాంటి బ్రతికున్నవాళ్లకి గడ్డిపరక విలువ కూడా ఇవ్వకుండా పోయినవాళ్ళకే విలువ ఇస్తున్నానంటే నా దృష్టిలో మీ స్థాయి ఏమిటో ఇంకా అర్ధంకాలేదా? మీకంటే వాళ్ళే నయం అని నా అభిప్రాయం.వాళ్ళు మీలా అవాకులూ చవాకులూ వాగరు.Dead men never speak.అందుకే వాళ్ళ జాతకాలే నేను చూస్తా.' -నేనూ నవ్వుతూనే అంటించా.

'సరే ఉంటా మరి' అని వాడు ఫోన్ పెట్టేశాడు.

అబ్దుల్ కలాం గారిది విలక్షణమైన వ్యక్తిత్వం అనే విషయం అందరికీ తెలిసినదే.మీడియాలో అవన్నీ వస్తూనే ఉన్నాయి.తెలిసిన విషయాలనే మళ్ళీ ఊదరగొట్టడం నాకిష్టం లేదు.కొన్ని జ్యోతిశ్శాస్త్ర కోణాలను మాత్రం ఈ వ్యాసంలో స్పర్శిస్తాను.

కలాం గారు 15-10-1931 న తమిళనాడు రామేశ్వరంలో జన్మించాడు.పుట్టిన సమయం 11.30 అనీ 13.30 అనీ రెండు సమయాలు దొరుకుతున్నాయి. వాటిలో ఏది సరియైనదో మనకు తెలియదు.అందుకని విశ్లేషణలోకి లోతుగా పోవడం లేదు.

గురువు ఉచ్ఛస్థితిలో ఉండటం ఈ జాతకంలో ఒక మంచియోగం.అందుకే చిన్నప్పటినుంచీ సద్బ్రాహ్మణులతో సదాచారపరులతో స్నేహం ఈయనకు ఉన్నది.వారినుంచి ఈయన ఎంతో నేర్చుకున్నాడు.

లగ్నం కరెక్టే అనుకుందాం కాసేపు.దశమంలో ఉన్న బుధాదిత్యయోగం వల్ల విద్యారంగంలో రాణించడం,సంగీత సాహిత్యాలలో ప్రవేశం కలిగాయి.లగ్నంలో శనివల్ల పరిశోధనారంగంలో అభిరుచీ,పరిశ్రమా కలిగాయి.

సూర్యబుధుల పైన గురుదృష్టి వల్ల ఆయా బుధాదిత్యరంగాలలో గుర్తింపు లభించింది. నీచభంగరాజయోగం పట్టిన చంద్రునిపైన ఉన్న గురుదృష్టి ఆధ్యాత్మిక చింతనను ఇచ్చింది.

ప్రస్తుతం గోచార గ్రహాలకూ జనన గ్రహాలకూ సంబంధం గమనిద్దాం.

>>గోచార ఛాయాగ్రహాలు జననకాల స్థితికి పూర్తి వ్యతిరేక స్థితి.
>>గోచారశని, జననకాల చంద్రునిపై సంచారం.చంద్రుడు రక్తప్రసరణకు కారకుడని మనకు తెలుసు.హార్ట్ ఎటాక్ వచ్చినపుడు గుండెకు రక్తసరఫరా సరిగా జరగదు.దానివల్ల మరణం సంభవిస్తుంది.

శుక్ల ఏకాదశి రోజు పోవడం ఈయన పుణ్యాత్ముడని సూచిస్తోంది.

కలాంగారు ఇంద్రుడు చంద్రుడు మహనీయుడు అని పొగుడుతున్న వాళ్ళంతా ఆ గుణగణాలలో కొన్నైనా వారివారి రోజువారీ జీవితాలలో ఆచరించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లేకుంటే ఈ పొగడ్తలన్నీ దయ్యాలు వేదాలు వల్లించినట్లు తప్ప ఇంకే రకంగానూ ఉపయోగపడవు.

ఎవరినైనా ఉన్నన్నాళ్ళు తమ స్వార్ధానికి వాడుకోవడం,పోయినతర్వాత కులాసాగా వారిని మర్చిపోవడం మనకు అలవాటేగా??
read more " అబ్దుల్ కలాం జాతకం - కొన్ని విశేషాలు "

27, జులై 2015, సోమవారం

Ye Toh Kaho Kaun Ho Tum - Mukesh



ఏ తో కహో కౌన్ హో తుమ్...కౌన్ హో తుమ్....

ఈ పాట 1962 లో వచ్చిన 'ఆషిక్' అనే సినిమాలోది.ఈ సినిమాకి హృషీకేశ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇందులో రాజ్ కపూర్, నందా,పద్మిని నటించారు.యధాప్రకారం 53 ఏళ్ళు గడచిన తరువాత, ఈనాడు విన్నా కూడా ఈపాట ఎంతో మధురంగా ఉంటుంది.మళ్ళీమళ్ళీ ఎన్నిసార్లైనా వినాలనిపిస్తుంది.నిజమైన సాహిత్యానికి సంగీతానికి ఉన్న మహత్తు ఇదే.

ఈ పాట మొత్తంలో బాగా నచ్చినదీ పాడేటప్పుడు బాగా ఎంజాయ్ చేసినదీ కోరస్ గా వినిపించే -'జితన్ మరే హోషా' అనే పదమే.ఈ పదం అదేనో లేక ఇంకేదో కూడా తెలీదు.అసలదేం భాషో కూడా తెలీదు.కానీ అసలు పాటలో అలాగే వినిపించింది.తన పాటలలో శంకర్ ఇలాంటి పదప్రయోగాలు చెయ్యడంలో సిద్ధహస్తుడు,'రామయ్యా వస్తావయ్యా...' అనే తెలుగుమాటలను హిందీపాటలో తీసుకుపోయి పెట్టినట్లు.

Movie:--Aashiq (1962)
Lyrics:--Shailendra (Shankardas Kesarilal)
Music:--Shankar Jaikishan
Singer:--Mukesh (Mukesh Chand Mathur)
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
---------------------------------
ye to kaho
ye to kaho, kaun ho tum kaun ho tum
ye to kaho, kaun ho tum kaun ho tum
mujhse puchhe bina dilme aane lage
mujhse puchhe bina dilme aane lage
yeh toh kaho, kaun ho tum kaun ho tum
mithi najaro se bijili girane lage
mithi najaro se bijili giraane lage
yeh toh kaho, kaun ho tum kaun ho tum

rat bhi nirali, yeh rut bhi niraali
rang barsaaye umang matwaali
pyar bhari aankho ne jaal ye bichhaye
kaise koyi dil ki karega rakhwali
kaise koyi dil ki karega rakhwaali
ye to kaho ye to kaho, kaun ho tum kaun ho tum.... ha aaaaa
mithi najaro se bijili girane lage
mithi najaro se bijili girane lage
yeh toh kaho, kaun ho tum kaun ho tum
jitan mare hosha-4 (chorus)

mastiyo ke mele yeh khoyi khoyi raate
aa ke kare aankho se ras bhari baate
bhole bhale haivo magar dekhne me
mujhse kya chhupengi yeh lutne ki ghathe
mujhse kya chhupengi yeh lutne ki ghathe
ye to kaho ye to kaho, kaun ho tum kaun ho tum.... ha aaaaa
mujhse puchhe bina dilme aane lage
mujhse puchhe bina dilme aane lage
yeh toh kaho, kaun ho tum kaun ho tum

tumhi toh nahi ho, joh sapno me aake
chhupp gaye apni jhalak dikhlaa ke
tum hi toh nahi ho, main dhunda kiya jinnko
phir bhi tum na aaye main thakgaya bulake
phir bhi tum na aaye main thakgaya bulake
ye to kaho ye to kaho, kaun ho tum kaun ho tum... ha aaaaa
mujhse puchhe bina dil me aane lage
mujhse puchhe bina dil me aane lage
yeh toh kaho, kaun ho tum kaun ho tum
mithi najaro se bijili girane lage
mithi najaro se bijili girane lage
yeh toh kaho, kaun ho tum kaun ho tum

Meaning

Tell me this
tell me this...who you are ....who you are...
without telling me
you are coming into my heart
tell me this...who you are ....who you are...
emanating light from your sweet looks
tell me this...who you are ....who you are...

This night is different
and the season also is different
the enchanting energy is spilling joy
when the eyes filled with love throw their net
who can save his heart?

this enraptured night
is full of joyful games
telling lovely words though its glances
It is very respectful and naive
but only for the outward appearance
how can it hide its stealing tactics from me?

were it not you who came into my dreams
and flashed your shades of beauty?
Who else can I search for if not you?
Even then,after my repeated calling
you never turned up and
I remained in frustration

Tell me this
tell me this...who you are ....who you are...
without telling me
you are coming into my heart
tell me this...who you are ....who you are...
emanating light from your sweet looks
tell me this...who you are ....who you are...

తెలుగు స్వేచ్చానువాదం

ఈ ఒక్కటి చెప్పు...ఎవరు నువ్వు...ఎవరు నువ్వు
నాతో చెప్పకుండా నా హృదయంలోకి ఎలా వస్తున్నావు?
ఈ ఒక్కటి చెప్పు...ఎవరు నువ్వు...ఎవరు నువ్వు
తియతియ్యని నీ చూపులతో మెరుపులు వెదజల్లుతూ...
ఈ ఒక్కటి చెప్పు...ఎవరు నువ్వు...ఎవరు నువ్వు

ఈ రేయి ఏదోగా ఉంది
వాతావరణం కూడా ఏదోగానే ఉంది
మన ఉత్సాహం నలుదిక్కులా
వెలుగును విరజిమ్ముతోంది
ప్రేమతో నిండిన నీ కళ్ళతో నీవు వలను విసరితే
అందులో చిక్కుకోకుండా తన హృదయాన్ని
రక్షించుకోగల మొనగాడెవరు?
ఈ ఒక్కటి చెప్పు...ఎవరు నువ్వు...ఎవరు నువ్వు
నాతో చెప్పకుండా నా హృదయంలోకి ఎలా వస్తున్నావు?

మత్తిల్లిన ఈ రేయి
అనేక ముగ్ధత్వాల కలయికగా ఉంది
తన మత్తు కళ్ళతో
అనేక రసమయ ఊసుల్ని చెబుతోంది
బయటకు ఎంతో మర్యాదగా ఉన్నప్పటికీ
తన దొంగవేషాలను నానుంచి ఎలా దాచగలదు?
ఈ ఒక్కటి చెప్పు...ఎవరు నువ్వు...ఎవరు నువ్వు
నాతో చెప్పకుండా నా హృదయంలోకి ఎలా వస్తున్నావు?

నా కలలోకొచ్చి నీ అందంతో నా మతి పోగొట్టింది
నువ్వు గాకపోతే ఇంకెవ్వరు?
నిన్నుగాక ఇంకెవరికోసం నేను వెదకాలి?
మరెందుకు నేనింతగా పిలుస్తున్నా
పలక్కుండా నన్ను నిరాశలో పడేస్తున్నావు? 

ఈ ఒక్కటి చెప్పు...ఎవరు నువ్వు...ఎవరు నువ్వు
నాతో చెప్పకుండా నా హృదయంలోకి ఎలా వస్తున్నావు?
ఈ ఒక్కటి చెప్పు...ఎవరు నువ్వు...ఎవరు నువ్వు
తియతియ్యని నీ చూపులతో మెరుపులు వెదజల్లుతూ...
ఈ ఒక్కటి చెప్పు...ఎవరు నువ్వు...ఎవరు నువ్వు...
read more " Ye Toh Kaho Kaun Ho Tum - Mukesh "

25, జులై 2015, శనివారం

Ruk Ja O Janewali Ruk Ja - Mukesh




Raj Kapoor and Mukesh
Youtube Link
https://youtu.be/b7Rhz4b9PSU

రుక్ జా ఓ జానేవాలి రుక్ జా...

1959 లో వచ్చిన Kanhaiya అనే సినిమాలోది ఈ పాట.ఇందులో రాజ్ కపూర్ నూతన్ నటించారు.ఈ పాటను ఆధారంగా తీసుకుని అనేక భాషల్లో అనేక పాటలు వచ్చాయి. 1960 లో మన తెలుగు లో వచ్చిన "ఓ పోయేపోయే చినదానా నీ తీయని మనసు నాదేనా (ఉయ్యాల జంపాల)" అనే గీతంకూడా ఈ పాటకు దాదాపు అనుకరణే.

56 ఏళ్ళ క్రితం వచ్చిన గీతం అయినా ఈనాటికీ ఈ పాట సజీవంగా ఉందీ అంటే అది శైలేంద్ర వ్రాసిన సాహిత్యం, శంకర్ జైకిషన్ ఇచ్చిన సంగీతం,ముకేష్ గానాలే కారణం.వీరిలో శంకర్ మన తెలుగువాడే అన్నది మళ్ళీ గుర్తు చెయ్యవలసిన పనిలేదు.

Movie:--Kanhaiya (1959)
Lyrics:--Shailendra
Music:--Shankar Jaikishan
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-----------------------------------------
Mukesh,Shankar Jaikishan,Shailendra and RajKapur
Rukja O jaanewaali ruk Ja 
Me tho raahi teri manzil ka 
Nazron me teri me bura sahi 
Aadmi bura nahi me dil ka-2

Dekha Bhi Nahin Tujhko Surat Bhi Na Pehchani 
Tu Aake Chali Cham Se Jyu Dhoop Ke Bin Paani 
Ruk Ja... 
Ruk Ja O Jaanewaali Ruk Ja 
Maein To Raahi Teri Manzil Ka 
Nazron Me TeriMe Bura Sahi 
Aadmi Bura Nahi Me Dil Ka-2

Muddat Se Mere Dil Ke Sapnon Ki Tu Rani Hai 
Ab Tak Na Mile Lekin Pehchan Purani Hai
Ruk Ja...
Ruk Ja O Jaanewaali Ruk Ja 
Me To Raahi Teri Manzil Ka 
Nazron Me TeriMe Bura Sahi 
Aadmi Bura Nahi Me Dil Ka-2 

Aa Pyaar Ki Rahon Me Bahon Ka Sahara Le 
Duniya Jise Gaati Hai Us Geet Ko Dohra Le
Ruk Ja...
Ruk Ja O Jaanewaali Ruk Ja 
Me To Raahi Teri Manzil Ka 
Nazron Me TeriMe Bura Sahi 
Aadmi Bura Nahi Me Dil Ka-2

Meaning

Stop...O walking lady ...stop
I am a traveller to your destination
I might be a bad man in your eyes
but in my heart I am not a bad person
stop...

I never saw you clearly
and never recognized even your face
you just came and left in a flash
like running water without sunlight
stop...

From a long time
you are the queen of my dreams
we never met but
ours is a very ancient relation
stop...

Come and lend me your hand
in this path of love
Let us sing the song
that is sung by the world
stop...

Stop...O walking lady ...stop
I am a traveller to your destination
I might be a bad man in your eyes
but in my heart I am not a bad person
stop...
read more " Ruk Ja O Janewali Ruk Ja - Mukesh "

ఎదురుచూపు








ఎదురుచూపనేది
యుగయుగాలనుంచీ
మనిషికీ దేవుడికీ సమానమే

నేను కోరిన వరాలన్నీ
ఏ దేవుడిస్తాడా అని
మనిషి ఎదురుచూపు

నన్ను కోరుకునే మనిషి
ఒక్కడైనా కనిపించడా
అని దేవుని ఎదురుచూపు...
read more " ఎదురుచూపు "

బూటక భక్తి








డబ్బులిచ్చే దేవుడికే ఉత్సవాలు
డబ్బులిచ్చే భక్తులకే మర్యాదలు
లోకంలో డబ్బే దేవుడు గాని
అసలు దేవుడు ఎక్కడున్నాడో
ఎవరికీ తెలియదు

మనం చూచే జనుల భక్తి
పెద్ద బూటకనాటకం
డబ్బులివ్వని దేవుడిని ఎవరూ
కొలవకపోవడమే దీనికి తార్కాణం

పాత దేవుడుకంటే కొత్త దేవుడితో
బాగా కలిసొస్తుందనుకుంటే
సరాసరి దేవుడినే మార్చెయ్యడమే
దీనికి నిదర్శనం

దేవుడి పేరుతో జనం పూజించేది
డబ్బునే గాని దేవుడిని కాదనేది
నగ్నసత్యం

గుళ్ళూ గోపురాలూ
పక్కా వ్యాపార సంస్థలే
డబ్బులున్న భక్తులకు
ప్రత్యేక గౌరవాలే దీనికి తార్కాణం

మొక్కులూ నోములూ
యాత్రలూ స్నానాలూ
అంతా ఉత్త బూటకం
లోకంలో కనిపించే ఇదంతా
స్వార్ధపు వికృతనాట్యం

ఏ మతపు ప్రార్ధనాలయమైనా
అక్కడున్నది
మనిషి సృష్టించిన దేవుడే గాని
అసలు దేవుడు కాదు

ఎందుకంటే అసలుదేవుడు
ఎవరికీ అక్కర్లేదు
అంతేకాదు
అసలు దేవుడే ఎవరికీ అక్కర్లేదు

లోకంలో భక్తి అనేది
అసహ్యపు వ్యాపారం
ఇది మనుషులు మనుషులతో చేసే
అనైతిక వ్యవహారం...
read more " బూటక భక్తి "

24, జులై 2015, శుక్రవారం

Chandan Sa Badan Chanchal Chitwan - Mukesh.












చందన్ సా బదన్ చంచల్ చిత్ వన్....

1968 లో వచ్చిన 'సరస్వతీచంద్ర' అనే సినిమాలో ముకేష్ పాడిన ఈ పాట ఈ నాటికీ మరపురాని క్లాసిక్ మధురగీతమే.ఈ సినిమాలో మనీష్ నూతన్ లు నటించారు. గుజరాతీలో G.M.Tripathi వ్రాసిన 'సరస్వతీ చంద్ర' అనే నవల ఈ సినిమాకు ఆధారం.

Movie:--Saraswatichandra (1968)
Lyrics:-Indeevar
Music:-KalyanJi AnandJi
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy

----------------------------------------
{Chandan Saa Badan Chanchal Chitwan -- Dheere Se Teraa Ye Muskana}-2
Muze Dosh Naa Dena Jagwalo-2
Ho Jao Agar Mein Deewana
Chandan Sa Badan Chanchal Chitwan


{Ye Kaam Kamaan Bhawe Teree --Palako Ke Kinare Kajrare}-2
Maathepar Sinduri Suraj - Hothon Pe Dahakte Angare
Saaya Bhi Jo Tera Pad Jaye-2
Aabad Ho Dil Kaa Weerana
Chandan Sa Badan Chanchal Chitwan


{Tan Bhi Sundar Man Bhi Sundar - Too Sundarta Ki Murat Hai}-2
Kisi Aaur Ko Shayad Kam Hogi
Muze Teree Bahot Jarurat Hai
Pahale Bhi Bahot me tarasa hu-2

Too aur Naa Mujh Ko tarsana

Chandan Saa Badan Chanchal Chitwan
Dheere Se Teraa Ye Muskana
Muze Dosh Na Dena Jagwalo-2
Ho Jao Agar Mein Deewana
Chandan Sa Badan Chanchal Chitwan


Meaning

Your body is made of sandal
Your mind is lively and 
Your smile is so gentle
Let the world not find fault with me
If I fall in love with  you...

Your brows are thin and bent like a bow
your eyes smeared with Kajal
Your forehead shines with the sun of kumkum
Simmering embers on your lips
Even your passing shadow
causes the flowers of my heart to bloom
Your body is made of sandal
your mind is lively....

Your body is beautiful
your mind too is beautiful
you are nothing but personification of beauty
may be someone else needs you as well
but I need you more than anybody else
I have already suffered a lot without you
dont make me suffer anymore
your body is made of sandal
your mind is so lively...

Let the world not find fault with me..
If I fall in love with you....

తెలుగు స్వేచ్చానువాదం

చందనంతో చేసిన ఒళ్ళు నీది
చంచలమైన చురుకైన మనసు నీది
సుతారమైన చిరునవ్వు నీది
నేనీమె ప్రేమలో పిచ్చివాడినైతే
ఓ లోకమా ! నన్ను తప్పుపట్టకు... 

విల్లులా వంగిన నీ కనుబొమలు
కాటుకతో మెరిసే నీ కన్నులు
నుదుట వెలుగుతున్న కుంకుమ
పెదవులపై కాలుతున్న నిప్పులు
నీ నీడ సోకితే చాలు
నా హృదయపు సుమవనం విరగబూస్తోంది
చందనంతో చేసిన ఒళ్ళు నీది
చంచలమైన చురుకైన మనసు నీది

నీ శరీరం సుందరమైనది
నీ మనసూ సుందరమే
నువ్వే ఒక సౌందర్య రాశివి
ఇంకెవరికైనా నీ అవసరం ఉండవచ్చు
కానీ వారికంటే ఎక్కువగా నీ అవసరం నాకుంది
నీకు దూరమై ఇప్పటికే చాలా బాధపడుతున్నాను
ఇంకా నన్ను హింసించకు

చందనంతో చేసిన ఒళ్ళు నీది
చంచలమైన చురుకైన మనసు నీది
సుతారమైన చిరునవ్వు నీది
నేనీమె ప్రేమలో పిచ్చివాడినైతే
ఓ లోకమా ! నన్ను తప్పుపట్టకు...
read more " Chandan Sa Badan Chanchal Chitwan - Mukesh. "

23, జులై 2015, గురువారం

శూన్యమందిరం











అన్నీ అడిగి
కొనకుండా పోయే
బేరమెందుకు?

ఆత్మీయంగా
నిజంగా అనుసరిస్తే
దూరమెందుకు?

నీటిని చూచి దడుస్తూ
ఒడ్డున మాటలు చెప్పే
స్నానమెందుకు?

మనసుతో యుద్ధం చేస్తూ
మదిలో మునగలేని
ధ్యానమెందుకు?

దూరాన్ని లెక్కిస్తూ
కాలుకదపలేని
యానమెందుకు?

వినేవారు లేని
శూన్యమందిరంలో
గానమెందుకు?

మౌనమనే మత్తులో
మునిగి మదిరా
పానమెందుకు?

అంతా ఐనప్పుడు
విడిగా ఇంకొక
ప్రాణమెందుకు?
read more " శూన్యమందిరం "

తిరుగలి రాళ్ళు











నీవన్నది ఒక మాయ
నేనన్నది పెనుమాయ
నిన్నూ నన్నూ దాటిన
నువ్వేగా నిత్యసత్యం?

నీవూ నేనుల చెలిమిలో
సాగే మనిషి జీవితం
చావూ బ్రతుకుల కొలిమిలో
కాగే నిత్య నాటకం

భూమ్యాకాశాలనే
తిరుగలి రాళ్ళ మధ్య నలిగి
పిండి అవుతోంది జీవితం

నువ్వూ నేననే
గానుగ చట్రంలో నలిగి
జావగారుతోంది జీవితం

పగలూ రాత్రుల
పాదయాత్రలో అరిగి
పగులువారుతోంది జీవితం

భూమినీ ఆకాశాన్నీ దాటినదే
నీ దారి
గానుగనీ ఎద్దులనీ ఆపిచూడు
ఒకసారి

పగలూ రాత్రీ దాటి
పరవశించు ఒకసారి
నిన్నూ తననూ మరచి
నీలో మునుగు ఒకసారి

చెయ్యకపోతే ఈ పని
చెదిరిపోదు నీ భయం
చెందకపోతే దీనిని
తెరుచుకోదు ఆలయం

ఆగలేని యాత్రధారికి
విశ్రాంతిపై ఆశెందుకు?
లీనమైన పాత్రధారికి
విషాదమంటే భయమెందుకు?
read more " తిరుగలి రాళ్ళు "

22, జులై 2015, బుధవారం

Sab Kuch Seekha Hamne - Mukesh


Shailendra the Lyricist
Raj Kapoor,Shailendra,Mukesh and may be Shankar

sab kuch seekha hamne
na seekhee hoshiyaaree...


1959 లో వచ్చిన 'అనారి' అనే సినిమాలోది ఈ ప్రముఖగీతం.దీనిని ముకేష్ తనదైన విలక్షణ శైలిలో ఆలపించాడు.ఈ సినిమాకి హృషీకేష్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.భావప్రకటనా స్పష్టతలో రాజ్ కపూర్ ఈ పాటలో జీవించాడనే చెప్పాలి.

గీతరచయిత శైలేంద్రను నేను అమితంగా అభిమానిస్తాను.ఆయనలోని భావుకత నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఉదాహరణకు ఈ పాటలో ' దిల్ పే మర్నేవాలే మరేంగే బికారీ' అనే మాటను వ్రాయాలంటే ఎంత ఆర్ద్రమైన భావుకత ఉండాలో,ఎంత పరిశీలనాశక్తి ఉండాలో,తేలికగా మనం గ్రహించవచ్చు.పాతకాలపు సినిమా కవులలో కూడా మంచి భావనాశక్తి ఉండేది.ఇది ప్రస్తుతపు పాటల్లో దారుణంగా లోపిస్తున్నది.

ఈ పాట మొత్తానికీ ఈ ఒక్క లైన్ మకుటం లాంటిది.జాగ్రత్తగా వింటే ఈ లైన్ దగ్గర కళ్ళు చెమర్చని మనిషి ఉండడని నా నమ్మకం.ఈలోకంలో అందరూ డబ్బుకోసం హోదాకోసం పరుగులు తీసేవారే గాని, ఒక ప్రేమకోసం,ఒక హృదయం కోసం తపించేవారు ఎవ్వరూ ఉండరు.ఒకవేళ ఎవరైనా ఉంటే, వారు లౌకిక జీవితంలో విఫలం కాక తప్పదు.ఎందుకంటే ఇలాంటి భావజాలం ఉన్నవారిలో మోసం ఉండదు.కల్మషం ఉండదు.కనుక వారు ప్రపంచపు కుళ్ళుపరుగులో సక్సెస్ కాలేరు.అందుకని వారు బికారులు గానే మరణిస్తారు.

కానీ, ఈ ప్రపంచంలో వారు బికారులుగా మిగిలినా, పై ప్రపంచంలో మాత్రం వారు శ్రీమంతులే.ఇక్కడ శ్రీమంతులైనవారు అక్కడ బికారులే.ఈ సత్యాన్నే శైలేంద్ర ఈ గీతంలో ఎంతో చక్కగా చెప్పాడు.అందుకే శైలేంద్ర సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం.పై ఫోటోలోని శైలేంద్ర కళ్ళను బట్టి చెప్పవచ్చు అతను ఒక లోతైన చింతనాపరుడనీ, మంచి భావుకుడనీ.

Movie:--Anari (1959)
Lyrics:--Sailendra
Music:--Shankar Jaikishan
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy

---------------------------------
Sab kuch sikha hamne - na sikhi hoshiyari-2
Sach hai duniyawalo - ke ham hain anadi

Duniya ne kit - naa samajhaya, kaun hai apna kaun paraya
Phir bhi dil kee chot chupa kar, hamne aapka dil bahalaya
Khud hi mar mitne ki yeh - jid hai hamari - (2)
Sach hai duniyawalo ke ham hain anadi....

Dil kaa chaman - ujadte dekha - pyar kaa rang utarte dekha
Hamne har jee-newale ko - dhan daulat pe marte dekha
Dil pe marne wale - marenge bikaari - (2)
Sach hai duniyawalo - ke ham hain anadi....

Asli nakli chehre dekhe - dil pe sau sau pahre dekhe
Mere dukhte dil se pucho - kya kya khaab sunehre dekhe
Tuta jistare pe - najar thi hamari - (2)

Sab kuch sikha hamne - na sikhi hoshiyari
Sach hai duniyawalo - ke ham hain anadi

Meaning

Almost everything I learnt

but never learnt cunning smartness
What you say is correct, Oh people of the world
I am truly a silly stupid fellow

How truly the  world taught me?

who is my own and who is not
Yet,hiding my grief in my heart
I stood by your side firmly
and entertained you as much as I could
meanwhile destroying and extinguishing myself
how really stupid I am...

I saw my heart's flower garden withering

I saw my love's strength weakening
I saw every body dying
for money,status and wealth
But one who dies for his heart
will die as a poor beggar, true
how really stupid I am...

I saw the true faces, I saw the imposters

hundrends of conditions and restrictions
on the heart I have seen
Ask my sorrowful heart
how many lovely dreams it dreamt
Alas, my looks were always fixed
on the crumbling stars...
how really stupid I am...

Almost everything I learnt

but never learnt cunning smartness
What you say is correct, Oh people of the world
I am truly a silly stupid fellow....

తెలుగు స్వేచ్చానువాదం

ఈ ప్రపంచంలో
అన్నింటినీ నేను నేర్చుకున్నాను
మోసాన్ని కపటాన్ని తప్ప
ఓ లోకవాసులారా మీరనేది నిజమే
నేను ఒక చేతగానివాడినే...

ప్రపంచం నాకెంతో చెప్పింది
ఎవరు నావారో ఎవరు కారో
అయినా నా బాధను నాలోనే దాచుకుని
మిమ్మల్ని సంతోషపెట్టాను
ఈ క్రమంలో నేనెంతో నష్టపోయినా సరే..
నిజమే..నేను చేతకానివాడినే

నా హృదయపు పూదోట వాడిపోవడం చూచాను
నా ప్రేమ బలహీనమై ఎండిపోవడం చూచాను
మీలో ప్రతివారూ డబ్బుకోసం హోదాకోసం పాకులాడటం కూడా చూచాను
ఈలోకంలో ఒక హృదయం కోసం, ఒక ప్రేమకోసం పాకులాడేవాడు
చివరకు బికారిగానే మరణిస్తాడు.ఇది నిజం.
మీరనేది నిజమే...నేనలాంటి చేతకానివాడినే

నిజమైన ముఖాలను నేను చూచాను
నకిలీలను కూడా ఎన్నో చూచాను
హృదయం మీద మోపబడిన ఎన్నో
ఆంక్షలను కూడా చూచాను
దుఖభరితమైన నా హృదయాన్ని అడగండి
ఎన్ని మధురస్వప్నాలను అది కన్నదో చెబుతుంది
అయితే నేనొక తప్పు చేశాను
రాలిపోతున్న తారలపై నేను దృష్టి నిలిపాను
నిజమే...నేనొక చేతకానివాడినే

ఈ ప్రపంచంలో
అన్నింటినీ నేను నేర్చుకున్నాను
మోసాన్ని కపటాన్ని తప్ప
ఓ లోకవాసులారా మీరనేది నిజమే
నేను ఒక చేతగానివాడినే...
read more " Sab Kuch Seekha Hamne - Mukesh "