Shailendra the Lyricist |
Raj Kapoor,Shailendra,Mukesh and may be Shankar |
na seekhee hoshiyaaree...
1959 లో వచ్చిన 'అనారి' అనే సినిమాలోది ఈ ప్రముఖగీతం.దీనిని ముకేష్ తనదైన విలక్షణ శైలిలో ఆలపించాడు.ఈ సినిమాకి హృషీకేష్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.భావప్రకటనా స్పష్టతలో రాజ్ కపూర్ ఈ పాటలో జీవించాడనే చెప్పాలి.
గీతరచయిత శైలేంద్రను నేను అమితంగా అభిమానిస్తాను.ఆయనలోని భావుకత నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఉదాహరణకు ఈ పాటలో ' దిల్ పే మర్నేవాలే మరేంగే బికారీ' అనే మాటను వ్రాయాలంటే ఎంత ఆర్ద్రమైన భావుకత ఉండాలో,ఎంత పరిశీలనాశక్తి ఉండాలో,తేలికగా మనం గ్రహించవచ్చు.పాతకాలపు సినిమా కవులలో కూడా మంచి భావనాశక్తి ఉండేది.ఇది ప్రస్తుతపు పాటల్లో దారుణంగా లోపిస్తున్నది.
ఈ పాట మొత్తానికీ ఈ ఒక్క లైన్ మకుటం లాంటిది.జాగ్రత్తగా వింటే ఈ లైన్ దగ్గర కళ్ళు చెమర్చని మనిషి ఉండడని నా నమ్మకం.ఈలోకంలో అందరూ డబ్బుకోసం హోదాకోసం పరుగులు తీసేవారే గాని, ఒక ప్రేమకోసం,ఒక హృదయం కోసం తపించేవారు ఎవ్వరూ ఉండరు.ఒకవేళ ఎవరైనా ఉంటే, వారు లౌకిక జీవితంలో విఫలం కాక తప్పదు.ఎందుకంటే ఇలాంటి భావజాలం ఉన్నవారిలో మోసం ఉండదు.కల్మషం ఉండదు.కనుక వారు ప్రపంచపు కుళ్ళుపరుగులో సక్సెస్ కాలేరు.అందుకని వారు బికారులు గానే మరణిస్తారు.
కానీ, ఈ ప్రపంచంలో వారు బికారులుగా మిగిలినా, పై ప్రపంచంలో మాత్రం వారు శ్రీమంతులే.ఇక్కడ శ్రీమంతులైనవారు అక్కడ బికారులే.ఈ సత్యాన్నే శైలేంద్ర ఈ గీతంలో ఎంతో చక్కగా చెప్పాడు.అందుకే శైలేంద్ర సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం.పై ఫోటోలోని శైలేంద్ర కళ్ళను బట్టి చెప్పవచ్చు అతను ఒక లోతైన చింతనాపరుడనీ, మంచి భావుకుడనీ.
Movie:--Anari (1959)
Lyrics:--Sailendraగీతరచయిత శైలేంద్రను నేను అమితంగా అభిమానిస్తాను.ఆయనలోని భావుకత నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఉదాహరణకు ఈ పాటలో ' దిల్ పే మర్నేవాలే మరేంగే బికారీ' అనే మాటను వ్రాయాలంటే ఎంత ఆర్ద్రమైన భావుకత ఉండాలో,ఎంత పరిశీలనాశక్తి ఉండాలో,తేలికగా మనం గ్రహించవచ్చు.పాతకాలపు సినిమా కవులలో కూడా మంచి భావనాశక్తి ఉండేది.ఇది ప్రస్తుతపు పాటల్లో దారుణంగా లోపిస్తున్నది.
ఈ పాట మొత్తానికీ ఈ ఒక్క లైన్ మకుటం లాంటిది.జాగ్రత్తగా వింటే ఈ లైన్ దగ్గర కళ్ళు చెమర్చని మనిషి ఉండడని నా నమ్మకం.ఈలోకంలో అందరూ డబ్బుకోసం హోదాకోసం పరుగులు తీసేవారే గాని, ఒక ప్రేమకోసం,ఒక హృదయం కోసం తపించేవారు ఎవ్వరూ ఉండరు.ఒకవేళ ఎవరైనా ఉంటే, వారు లౌకిక జీవితంలో విఫలం కాక తప్పదు.ఎందుకంటే ఇలాంటి భావజాలం ఉన్నవారిలో మోసం ఉండదు.కల్మషం ఉండదు.కనుక వారు ప్రపంచపు కుళ్ళుపరుగులో సక్సెస్ కాలేరు.అందుకని వారు బికారులు గానే మరణిస్తారు.
కానీ, ఈ ప్రపంచంలో వారు బికారులుగా మిగిలినా, పై ప్రపంచంలో మాత్రం వారు శ్రీమంతులే.ఇక్కడ శ్రీమంతులైనవారు అక్కడ బికారులే.ఈ సత్యాన్నే శైలేంద్ర ఈ గీతంలో ఎంతో చక్కగా చెప్పాడు.అందుకే శైలేంద్ర సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం.పై ఫోటోలోని శైలేంద్ర కళ్ళను బట్టి చెప్పవచ్చు అతను ఒక లోతైన చింతనాపరుడనీ, మంచి భావుకుడనీ.
Movie:--Anari (1959)
Music:--Shankar Jaikishan
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------
Sab kuch sikha hamne - na sikhi hoshiyari-2
Sach hai duniyawalo - ke ham hain anadi
Duniya ne kit - naa samajhaya, kaun hai apna kaun paraya
Phir bhi dil kee
chot chupa kar, hamne aapka
dil bahalaya
Khud hi mar mitne ki yeh - jid hai
hamari - (2)
Sach hai duniyawalo ke ham hain anadi....
Dil kaa chaman - ujadte dekha - pyar kaa rang utarte dekha
Hamne har jee-newale
ko - dhan daulat pe
marte dekha
Dil pe marne wale - marenge bikaari - (2)
Sach hai duniyawalo - ke ham hain anadi....
Asli nakli chehre
dekhe - dil pe sau sau
pahre dekhe
Mere dukhte dil se
pucho - kya kya khaab
sunehre dekhe
Tuta jistare pe - najar thi hamari - (2)
Sab kuch sikha hamne - na sikhi
hoshiyari
Sach hai duniyawalo - ke ham hain anadi
Meaning
Almost everything I learnt
but never learnt cunning smartness
What you say is correct, Oh people of the world
I am truly a silly stupid fellow
How truly the world taught me?
who is my own and who is not
Yet,hiding my grief in my heart
I stood by your side firmly
and entertained you as much as I could
meanwhile destroying and extinguishing myself
how really stupid I am...
I saw my heart's flower garden withering
I saw my love's strength weakening
I saw every body dying
for money,status and wealth
But one who dies for his heart
will die as a poor beggar, true
how really stupid I am...
I saw the true faces, I saw the imposters
hundrends of conditions and restrictions
on the heart I have seen
Ask my sorrowful heart
how many lovely dreams it dreamt
Alas, my looks were always fixed
on the crumbling stars...
how really stupid I am...
Almost everything I learnt
but never learnt cunning smartness
What you say is correct, Oh people of the world
I am truly a silly stupid fellow....
తెలుగు స్వేచ్చానువాదం
ఈ ప్రపంచంలో
అన్నింటినీ నేను నేర్చుకున్నాను
మోసాన్ని కపటాన్ని తప్ప
ఓ లోకవాసులారా మీరనేది నిజమే
నేను ఒక చేతగానివాడినే...
ప్రపంచం నాకెంతో చెప్పింది
ఎవరు నావారో ఎవరు కారో
అయినా నా బాధను నాలోనే దాచుకుని
మిమ్మల్ని సంతోషపెట్టాను
ఈ క్రమంలో నేనెంతో నష్టపోయినా సరే..
నిజమే..నేను చేతకానివాడినే
నా హృదయపు పూదోట వాడిపోవడం చూచాను
నా ప్రేమ బలహీనమై ఎండిపోవడం చూచాను
మీలో ప్రతివారూ డబ్బుకోసం హోదాకోసం పాకులాడటం కూడా చూచాను
ఈలోకంలో ఒక హృదయం కోసం, ఒక ప్రేమకోసం పాకులాడేవాడు
చివరకు బికారిగానే మరణిస్తాడు.ఇది నిజం.
మీరనేది నిజమే...నేనలాంటి చేతకానివాడినే
నిజమైన ముఖాలను నేను చూచాను
నకిలీలను కూడా ఎన్నో చూచాను
హృదయం మీద మోపబడిన ఎన్నో
ఆంక్షలను కూడా చూచాను
దుఖభరితమైన నా హృదయాన్ని అడగండి
ఎన్ని మధురస్వప్నాలను అది కన్నదో చెబుతుంది
అయితే నేనొక తప్పు చేశాను
రాలిపోతున్న తారలపై నేను దృష్టి నిలిపాను
నిజమే...నేనొక చేతకానివాడినే
ఈ ప్రపంచంలో
అన్నింటినీ నేను నేర్చుకున్నాను
మోసాన్ని కపటాన్ని తప్ప
ఓ లోకవాసులారా మీరనేది నిజమే
నేను ఒక చేతగానివాడినే...