నిన్న గతించిన సుమధుర గాయకుడు విస్సంరాజు రామకృష్ణకు నివాళిగా ఈ పాటను పోస్ట్ చేస్తున్నాను.
ఇది నాకు ఇష్టమైన గీతాలలో ఒకటి.నాకేకాదు చాలామందికి ఇష్టమైన మధురగీతం.దానికి కారణాలు-సాహిత్యం సున్నితంగా ఉండటం, పాట రాగం చాలా మధురమైనది కావడం.అందుకే ఈ సినిమా విడుదలై 40 ఏళ్ళైనా ఈనాటికీ ఇది మరపురాని మధురగీతమే.
ఇది నాకు ఇష్టమైన గీతాలలో ఒకటి.నాకేకాదు చాలామందికి ఇష్టమైన మధురగీతం.దానికి కారణాలు-సాహిత్యం సున్నితంగా ఉండటం, పాట రాగం చాలా మధురమైనది కావడం.అందుకే ఈ సినిమా విడుదలై 40 ఏళ్ళైనా ఈనాటికీ ఇది మరపురాని మధురగీతమే.
సి.నారాయణరెడ్డిగారి సున్నితమైన భావసాహిత్యానికి మహాదేవన్ ఇచ్చిన ఘజల్ రాగం ఈ పాటకు జీవం పోసి ఎన్నాళ్ళకూ మాసిపోని మధురగీతంగా దీనిని నిలబెట్టింది.
Movie:--Mutyala Muggu (1975)
Lyrics:--C.Narayana Reddy
Music:--K.V.Mahadevan
Singer:--V.Ramakrishna
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------
ఏదో ఏదో అన్నది ఈఈ మసక వెలుతురూ
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు
ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురూ
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు
ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే వయ్యారం
ముడుచుకొనే కొలది మరీ మిడిసిపడే సింగారం
సోయగాల విందులకై వేయి కనులు కావాలీ
ఉ ఊ ఉ ...ఉ ఊ ఉ ...ఉ ఊ ఉ ...ఉ ఊ ఉ ...
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురూ
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు
నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమి నొసగేరో
పులకరించు మమతలతో పూలపాన్పు వేశారూ
ఉ ఊ ఉ ...ఉ ఊ ఉ ...ఉ ఊ ఉ ...ఉ ఊ ఉ ...
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురూ
ఆ ఆ ఆఆ ఆహాహా ...లాలలాల లాలలా..