హోమియోపతి సిస్టం చాలా నిదానం అనీ, త్వరగా తగ్గదనీ లోకంలో ఒక అపప్రధ ఉన్నది.
అది నిజం కాదు.
రోగాన్ని బట్టి ఆ విధానం పనిచేస్తుంది.ఒక రోగం మన శరీరంలో పదేళ్ళ నుంచీ ఉందనుకుందాం.అది పూర్తిగా తగ్గడానికి ఒక ఏడాది లేదా రెండేళ్ళ ట్రీట్మెంట్ అవసరమౌతుంది.కానీ ఇప్పటికిప్పుడు వచ్చిన ఎక్యూట్ రోగం అయితే వెంటనే తగ్గిపోతుంది.ఆ తగ్గడం మనం ఊహించలేనంత వేగంగా తగ్గుతుంది.ఆవగింజల వంటి హోమియో మాత్రలు నాలుక మీద కరిగీ కరగక ముందే అంత రిలీఫ్ ఎలా వస్తుందో ఊహాతీతంగా ఉంటుంది.
ఎక్యూట్ కేసులలో క్షణాల మీద ఆ రిలీఫ్ వస్తుంది.అది ఎంత త్వరగా జరుగుతుందంటే,మాత్రలు ఇంకా నోటిలో కరిగీ కరగకముందే రిలీఫ్ వస్తుంది.
ఇది నమ్మలేని నిజం.
ఉదాహరణకు మొన్న జరిగిన ఒక సంఘటన వివరిస్తాను.
మొన్న గుంటూరులో జరిగిన సమ్మేళనం సందర్భంగా అందరం జిల్లెళ్ళమూడి నుంచి తిరిగి వస్తున్నాము.నా కారులోనే ఉన్న పంచవటి ట్రస్ట్ PRO రాజుకు పంటినొప్పి అనీ అతనికి మందివ్వమనీ నా శ్రీమతి రికమెండేషన్ తెచ్చింది.
'ఎప్పటినుంచీ?' డ్రైవ్ చేస్తూనే అడిగాను.
'కొన్నాళ్ళ నుంచీ ఉన్నది.ఇప్పుడు కొంచం ఎక్కువగా ఉంది.'అన్నాడు వెనుక సీట్లోంచి రాజు.
'దాని లక్షణాలు వివరించు' అన్నా.
'రాత్రి అయితే ఎక్కువౌతుంది' అన్నాడు.
'నొప్పి లక్షణం ఎలా ఉంటుంది?' అడిగాను.
'బాగా ఎక్కువైతే మాత్రం తలలోకి పాకుతుంది.' అన్నాడు.
ఇంక నేనేమీ అడగలేదు.
ఇంటికి వచ్చాక తను స్నానానికి వెళ్ళబోతూ ఉండగా ఆపి రెండు ఆవగింజల సైజులో ఉన్న హోమియో మాత్రలు నోట్లో వేశాను.కాసేపు కూచుని చప్పరించి అవి కరిగాక ఒక గుక్క నీళ్ళు త్రాగి స్నానానికి వెళ్ళమని చెప్పాను.
స్నానం చేసి వస్తూ వస్తూ 'నొప్పి మాయం' అన్నాడు.
అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా చూశారు.
'స్నానం చేస్తూ ఉండగా, నొప్పి పూర్తిగా మాయం అయిపోయింది అన్న విషయం గమనించాను.' అన్నాడు. అవసరమైతే హైదరాబాద్ వెళ్ళాక మళ్ళీ ఒకరి రెండుసార్లు అదే మందు రిపీట్ చెయ్యమని చెప్పాను.
సరైన మందును సెలక్ట్ చెయ్యడమే హోమియోపతిలో అత్యంత కీలకమైన విషయం.అది జరిగితే మాత్రం, క్షణాలలో రోగం నెమ్మదిస్తుంది.
సరైన మందును సెలక్ట్ చెయ్యడమే హోమియోపతిలో అత్యంత కీలకమైన విషయం.అది జరిగితే మాత్రం, క్షణాలలో రోగం నెమ్మదిస్తుంది.
నా జీవితంలో ఇలాంటి సంఘటనలు కొన్ని వందలసార్లు జరిగాయి. సామాన్యంగా అయితే ఇలాంటి విషయాలను చెబితే ఎవరూ నమ్మరు.కానీ ఇది రిట్రీట్ కు హాజరైన వారి కళ్ళ ఎదురుగా జరిగిన సంఘటన.
అనుమానం ఉన్నవారు రాజూ సైకం ను ఫోన్లో కనుక్కుని ఇది నిజమా కాదా నిర్ధారించుకోవచ్చు. (Cell: 9966007557)