ఈ రోజు ఆశ్వయుజ పౌర్ణమి.
సరిగ్గా నిన్న సాయంత్రం ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్ లోనూ పాకిస్తాన్ లోనూ భూకంపం (7.5) వచ్చింది.ఈ భూకంపంలో దాదాపు 275 మంది చనిపోయి ఉండవచ్చని మీడియాలో అంటున్నారు.
ఈ ప్రకంపనలు ఉత్తరభారత దేశంలో కూడా కనిపించాయి.రాహు బుధుల సంయోగం భూతత్వ రాశి అయిన కన్యలో జరగడమే దీనికి కారణం అయి ఉండవచ్చు అనిపించినా అసలు కారణం సింహరాశిలో జరిగిన గురు-కుజ-శుక్రుల అతిసమీప సంయోగమే.శని కుజులకు పరస్పర దృష్టి ఉండటం గమనార్హం.ఇదే ఈ భూకంపాన్ని ట్రిగ్గర్ చేసింది.వీరు ముగ్గురూ శుక్ర నక్షత్రం అయిన పూర్వ ఫల్గునీ లో ఉండటం వల్ల ముస్లిం దేశం దెబ్బతిన్నది.శుక్రుడు ముస్లిం దేశాలకు సూచకుడని మనకు తెలుసు.
అమావాస్యా పౌర్ణములకు చంద్రప్రభావం భూమిమీద ఎక్కువగా ఉంటుందని దానివల్ల చాలా అనర్ధాలు జరుగుతాయనీ చెప్పడానికి ఇది మరో ఋజువు.