“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

8, అక్టోబర్ 2015, గురువారం

Yun Zindagi Ki Raah Me-Mehdi Hasan














యూ జిందగీ కి రాహ్ మే. తక్రా గయా కోయీ యూ ...
అంటూ మహాగాయకుడు మెహదీహసన్ గంధర్వస్వరంలో సాగే ఈ మధురగీతం హిందూస్తానీ రాగం 'ఖమాస్' లో స్వరపరచబడింది.

'తినగతినగ వేము తియ్యనుండు'- అన్నాడు వేమన.వేపాకు సంగతి ఏమో గాని,కొన్నిస్వీట్లు మాత్రం నమిలేకొద్దీ ఇంకా స్వీట్ గా ఉంటాయి. ఈ ఘజల్ కూడా ఆ స్వీట్ లాంటిదే. దీనిని ఎన్నిసార్లు వింటే అంత స్వీట్ గా ఉంటుంది. వినేకొద్దీ వినేకొద్దీ దీనిలోని మాధుర్యం అర్ధమౌతుంది. అర్ధం తెలుసుకుని వింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది.

ఘజల్స్ ప్రపంచంలో పితామహుడు ఎవరయ్యా అంటే మెహదీ హసన్ పేరు గుర్తుకొస్తుంది.ఆయన గంధర్వస్వరంలో నుంచి జాలువారిన ఘజల్స్ ఎన్నో ఉన్నాయి.'మెహదీ హసన్ స్వరంలో ఆ దేవుడే పలుకుతాడు'-అన్నది లతా మంగేష్కర్.ఈ ఒక్క మాట చాలు ఆయన ఎలాంటి గాయకుడో చెప్పడానికి.

ఒకసారి ఏదో కన్సర్ట్ సందర్భంలో జగ్జీత్ సింగ్ ను ఎవరో మెహదీహసన్ తో పోల్చారు.దానికి ఆయన ఎంతో వినమ్రంగా -'దయచేసి  అలాంటి పని చెయ్యకండి.మెహదీహసన్ హిమాలయ శిఖరాల మీద ఉన్నాడు. మేము హిమాలయాల పాదాల దగ్గర ఉన్నాము.ఆయనతో మమ్మల్ని పొల్చవద్దు. దానివల్ల మాలాంటి వాళ్లకి కూడా గర్వం రావచ్చు. అది మంచిది కాదు"- అని చెప్పాడు.మెహదీ హసన్ అంటే పాతతరం గాయకులకు ఎంత గౌరవం ఉండేదో దీనిని బట్టి తెలుసుకొవచ్చు. 

మెహదీహసన్ పాడిన పాటల నుంచి అన్ని భాషల్లోకీ కాపీలు లాగబడ్డాయి. అక్కడదాకా ఎందుకు?మన తెలుగులో కూడా ఘంటసాల పాతపాటలు కొన్ని మెహదీ హసన్ పాడిన ఘజల్స్ కు పక్కా కాపీలే.

మెహదీ హసన్ పాడిన ఒక అద్భుతమైన ఘజల్ ఇది.దీని అర్ధం కూడా ఎంతో సున్నితమైన భావుకతతో కూడి ఉంటుంది. అందుకే అర్ధాన్ని కూడా ఇస్తున్నాను.బేసిగ్గా ఇది ఒక నిష్టుర ప్రేమగీతం.ఒకప్పుడు అమితంగా ప్రేమించిన ప్రేయసి ఏదో కారణం చేత తనను మర్చిపోయింది. ఆ బాధను అతి సున్నితంగా వెలిబుచ్చుతూ పాడిన పాట ఇది.దీనిని 'ఆగ్' అనే పాకిస్తానీ సినిమాలో కూడా తీసుకున్నారు.

గతంలో పోస్ట్ చేసిన ఈ మహాగాయకుడి పాటకు పూర్తి న్యాయం జరగలేదని నాకనిపించింది.

ఎందుకంటే-
ఒకటి - దానిలో ఒక చరణం మిస్ అయింది.
రెండు - పాటలో భావం సరిగా పలకలేదు.
మూడు - ఆ పాటను ఇంకా బాగా పాడవచ్చు.

అందుకని మళ్ళీ పాడాను. ఇలాంటి అమరగీతాలను ఎన్నిసార్లు పాడినా ఇంకాఇంకా మాధుర్యం పెరుగుతూనే ఉంటుంది గాని తగ్గదు.అసలు మెహదీ హసన్ పాటల్ని పాడబోవడమే ఒక సాహసం.కొన్నింటిని అసలు పాడలేము కూడా.అంత కష్టంగా ఉంటాయి.కానీ ఆయన పాటల మీద ఉన్న ప్రేమ మనల్ని ఆ సాహసానికి పురికొల్పుతుంది.ఈ పాటలో అనేక వెర్షన్లున్నాయి.ఇదొక వెర్షన్. మరిన్నిసార్లు వినండి మరి.

Song:--Yoo Zindagi Ki Raah Me..
Lyrics:--Masrur Anwar
Singer:--Mehdi Hassan
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------------------------
Yoo- zindagi ki raah mein - takra gaya koi-2
Yoo - zindagi ki raah mein
Ik roshni andheron mein -bikhra gaya koi
Yoo zindagi ki raah mein -takra gaya koi
Yoo zindagi ki raah mein...

Wo haadsa- wo pehli mulakaat kyaa kahu
Itni ajab thi - soorathe haalate kya kahoon
Wo kehar wo gazab - wo jafa- mujko yaad hai
Wo uski berukhi ki
adaa- mujhko yaad hai
Mit
tha nahin hai zehan se - yoon chaa gaya koi
Yoo
-- zindagi ki raah mein takra gaya koi
Yoo - zindagi ki raah mein

Pehle wo mujhko dekh kar - barham si ho gayee-2
Fir apne hi haseen - khayalon me kho gayee
Bechargi pe meree - use - reham aa gaya
Shaayad mere tadapnka
- andaaz bhaa gaya
Saanson se bhi kareeb
- mere aa gaya koi
Yoon
-- zindagi ki raah mein- takra gaya koyee
Yoo zindagi ki rah mein

Yoon usne pyaar se meri - baahon ko choo liya-2
Manzil ne jaise shokh ke-  raahon ko choo liya
Ik pal mein dil pe kaisi - qayaamat guzar gayi
Rag rag mein uske husn ki
- khusboo bikhar gayi
Zulfon ko mere shaan pe
- lehraa gaya koi
Yoo - zindagi ki raah mein - takra gaya koi
Yoo - zindagi ki raah mein

Ab is dile-tabaah ki - haalat na poochiye-2
Benaam aarzoo kee - lazzat na poochiye
Ik ajnabi tha roohka - armaan ban gayaa
Ik haadsa tha pyaarka - unwaan ban gaya
Manzil ka raastaa mujhe
- dikhla gaya koi
Yoon
- zindagi ki raah mein - takra gaya koi
Yoon - zindagi ki raah mein
Ik roshni andheron mein - bikhra gaya koi
Yoon - zindagi ki raah mein - takra gaya koi
Yoon - zindagi ki raah mein.....

Meaning:--

I ran into someone on the road of my life
Some one who brought light into the dark surroundings of my life

What can I tell you about this first incident
when I  met her for the first time 
I cannot tell you how strange those circumstances were 
That strange day,her deceit and her ingratitude
I remember it all 
I also remember her pretented unfriendly behavior 
It was such a lasting impression
I am unable to remove from my mind 
I ran into someone on the road of my life
Some one who brought light into the darkness of my life

At first when she saw me, she got upset 
And then, she was lost in her own thoughts 
But she felt sad for my helpless condition 
Perhaps she liked the way I was pinned for her
She became close to me more than my breathing 
I ran into someone on the road of my life
Some one who brought light into the darkness of my life

She took my hands into her hands with love
Like God drawing all the paths of realization unto His bosom
Oh ! What a storm razed in my heart at that moment
In my every nerve,the fragrance of her beauty rushed mad
But alas ! She waved her hair on the face of my dignity
(and just disappeared)


Now do not ask the condition of my heart 
Do not ask me about my vanquished desires 
This stranger became the longing of my soul 
It was a strange incident but became a legend of love 
Some one showed me the road to my true destination   


తెలుగు స్వేచ్చానువాదం

నా జీవనపధంలో ఆమె నాకు తారసపడింది
నా జీవన తిమిరంలో ఆమె వెలుగును నింపింది
నా జీవనపధంలో ఆమె నాకు తారసపడింది

ఆమెతో నా మొదటి పరిచయం ఎలా జరిగిందో
నేను మీతో ఎలా చెప్పగలను?
ఆనాటి పరిస్థితులు ఎంత విచిత్రమైనవో ఎలా వివరించగలను?
అదొక విచిత్రమైన రాత్రి
ఆమె అహం,ఆమె పొగరు, ఆమె కృతజ్ఞతా రాహిత్యం
కావాలని ఆమె నటించిన శత్రుత్వం
అవన్నీ నా గుండెలో చెరగని ముద్ర వేశాయి
వాటిని మరచిపోవడం నాకు సాధ్యం కావడం లేదు

మొదట తను నన్ను చూచినప్పుడు
చాలా కలవరపడింది
కానీ తరువాత తన ఊహాలోకంలో మునిగిపోయింది
నా నిస్సహాయ స్థితికి తనకు జాలి కలిగింది
నేను తనను ఆరాధించడాన్ని తను ఇష్టపడి ఉండవచ్చు
ఆ తరువాత నా ఊపిరి కంటే తను నాకు దగ్గరైంది

దేవుడు ఎలాగైతే అందరినీ తన ఒడిలోకి తీసుకుంటాడో
అలాగే ఆమె నా చేతులను ప్రేమగా తన చేతులలోకి తీసుకుంది
ఆహ్! ఆ సమయంలో నా హృదయంలో ఎంత తుపాను రేగిందో?
నా ప్రతి నరంలో ఆమె సౌందర్యపు గుబాళింపు ప్రవహించింది
కానీ చివరకు, తన కురులను నా ఆత్మాభిమానపు ముఖంమీద
విసురుగా ఊపి ఆమె మాయమైపోయింది

ప్రస్తుతం నా హృదయపు దుస్థితిని మీరు అడుగవద్దు
పేరులేకుండా మాయమై పోయిన
నా కోరికల లజ్జను మీరు తెలుసుకోవద్దు
ఈ అపరిచితురాలు నా ఆత్మకు ఒక దాహంగా మారింది
అనుకోకుండా జరిగిన ఒక సంఘటన
ఒక ప్రేమకావ్యంగా మిగిలిపోయింది
అయితే, అదే నా అంతిమగమ్యానికి నాకు దారిని చూపింది

నా జీవనపధంలో ఆమె నాకు తారసపడింది
నా జీవన తిమిరంలో ఆమె వెలుగును నింపింది
నా జీవనపధంలో ఆమె నాకు తారసపడింది
నా జీవనపధంలో...