నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

11, అక్టోబర్ 2015, ఆదివారం

Hui Shaam Unka Khayal Aa Gaya-Mohammad Rafi



హుయీ షాం ఉన్ కా ఖయాల్ ఆగయా...
అంటూ మహమ్మద్ రఫీ మధురస్వరంలో నుంచి జాలువారిన ఈ పాథోస్ సాంగ్ చాలా అద్భుతమైన మెలోడీ గీతం.

ఇది 1968 నాటి "మేరె హందం మేరె దోస్త్" అనే చిత్రం లోనిది.

మెలోడీ పాథోస్ సాంగ్స్ ను ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ పాటను వినకుండా పాడకుండా ఉండలేరు.ఇది అంత అద్భుతమైన గీతం. తనకు దూరమైన ప్రియురాలిని మర్చిపోలేక త్రాగుతూ పాడుకునే ఒక విషాదగీతం ఇది.

ఈ సినిమాలో ధర్మేంద్ర షర్మిలా టాగోర్ నటించారు.ఈ పాటలో ధర్మేంద్ర నటన చాలా హృద్యంగా ఉంటుంది.అంతకంటే హృద్యంగా పాట భావాన్ని తన స్వరంలో మహమ్మద్ రఫీ పలికించిన తీరు అనితర సాధ్యం.

దీనిని నిజంగా ఎంజాయ్ చెయ్యాలంటే రాత్రి పది తర్వాత లైట్లు ఆపేసి వెన్నెల్లో ఒక్కరమే కూర్చుని ఫీలౌతూ వినాలి.అప్పుడు ప్రతివారికీ తమ గతం తప్పకుండా గుర్తొస్తుంది.అప్పుడు కన్నీరు ఉబికి పైకొస్తుంది.అలా ఎవరికైనా రాకపోతే వారి హృదయమే లేదని, ఒకవేళ ఉంటే కూడా అదొక పెద్ద పాషాణమని అర్ధం.

A really wonderful song !!

ఈ పాటను యూట్యూబ్ లో ఇక్కడ చూడండి.

https://youtu.be/GlIWoPqW3qk

Movie:-Mere Humdum Mere Dost (1966)
Lyrics:-Majrooh Sultanpuri
Music:--Laxmikant Pyarelal
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------------
Hui Shaam Unka Khayaal Aa gaya
Hui Shaam Unka Khayaal Aa gayaaaa
Vohee Zindagi kaa sawal aa gaya-2
Hui Shaam Unka - Khayaal Aa gaya-2

Abhee tak to hoton pe thaa
Tabassum ka ek silsilaa
bahot shaadmaa the hamunnko bhula kar
Achanak ye kya ho gaya
Ke chehre - pe Range malaal aa gaya-2
Hui Shaam Unka - Khayaal Aa gayaa-2

Hame tho yahee thaa guroor
Gume yaar hai humse door
Vahee gum jise hammne - kis kis jatan se
nikaalaa tha iss dilse door
Vo chalkar - qayamat ki chaal aa gaya-2
Hui Shaam Unka - Khayaal Aa gayaa
Vohee Zindagi kaa sawaaal aa gaya
Hui Shaam Unka - Khayaal Aa gaya-2

Meaning:--

Evening has descended
her memory comes to me again
and this became my life and death question

Till now there are false smiles on my lips
thinking that I have forgotten her totally
But what is this happening now?
Why my face has suddenly become pale in color?

I was so proud that I could keep my sorrow away
That same sorrow,after so much of suffering and pain
I thought I removed from my heart somehow
But now she came back like a cyclone
and all my old pain has started again

Evening has descended
her memory comes to me again
and this became my life and death question


తెలుగు స్వేచ్చానువాదం

సాయంత్రం వచ్చింది
ఆమె జ్ఞాపకాలను మళ్ళీ మోసుకొచ్చింది
అదే నాకు ప్రాణసంకటం అయింది

ఇప్పటివరకూ నా పెదవుల పైన ఉన్న చిరునవ్వు
ఎందుకు మాయమైపోయింది?
ఆమెను పూర్తిగా మరచిపోయాననే నేను అనుకున్నాను
కానీ ఉన్నట్టుండి ఎందుకు నా ముఖం పాలిపోయింది?

ఈ బాధను మరచిపోయాననే నేను ఇన్నాళ్ళూ అనుకున్నాను 
ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి
ఆమెను నా హృదయంలోనుంచి ఖాళీ చేశాననే అనుకున్నాను
ఇప్పుడు ఉన్నట్టుండి ఒక తుఫానులా ఆమె తిరిగొచ్చింది
మళ్ళీ నా పాత ఆవేదన తిరిగి నాకు మొదలైంది

సాయంత్రం వచ్చింది
ఆమె జ్ఞాపకాలను మళ్ళీ మోసుకొచ్చింది
అదే నాకు ప్రాణసంకటం అయింది