ఓ చందమామా అందాల భామా ఎందున్నదో పల్కుమా...
అంటూ ఘంటసాల మధురస్వరంలోనుంచి జాలువారిన ఈ గీతం ' జయం మనదే' (1956) అనే చిత్రం లోనిది.60 ఏళ్ళు గడచినా కూడా ఇది ఈనాటికీ మరపురాని మధురగీతాలలో ఒకటి.ఈ పాటలో ఎన్టీ రామారావు అంజలీదేవి నటించారు.
అసలు పాటలో కొసరాజు వ్రాసిన రెండు చరణాలే ఉన్నాయి. కానీ ఇంతమంచి రాగానికి రెండు చరణాలు నాకు సరిపోలేదు.అందుకే చివరి రెండు చరణాలు నేనే వ్రాసి ఈపాటను నాలుగు చరణాల పాటగా మార్చాను. నా సాహిత్యాన్ని ఎర్రరంగులో ఉంచాను.
ఈ గీతాన్ని యూట్యూబ్ లో ఇక్కడ చూడండి
https://youtu.be/jxD9MDLuWnc
ఈ గీతాన్ని యూట్యూబ్ లో ఇక్కడ చూడండి
https://youtu.be/jxD9MDLuWnc
అర్ధాన్ని ప్రత్యేకంగా వివరించనవసరం లేదుకదా !
చిత్రం:--జయం మనదే (1956)
సాహిత్యం:- కొసరాజుచిత్రం:--జయం మనదే (1956)
సంగీతం:- ఘంటసాల వెంకటేశ్వరరావు
గానం:- ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల (ఆలాపన)
కరావోకే గానం :- సత్యనారాయణ శర్మ
Enjoy
Enjoy
----------------------------------------
ఓ చందమామ అందాలభామ ఎందున్నదో పల్కుమా – 2
సొగసూ వయసూ తన లావణ్యమే చాలనీ-2
సొగసూ వయసూ తన లావణ్యమే చాలనీ-2
పై సోయగాలు ఏలనీ లాలించుమా
సోయగాలు ఏలనీ లాలించుమా
ఓ చందమామ అందాలభామ ఎందున్నదో పల్కుమా
మదిలో మెదిలే మధురానందమే తాననీ – 2
ఇక ఆలసించరాదనీ బోధించుమా
ఇక ఆలసించరాదనీ బోధించుమా
ఆలసించరాదనీ బోధించుమా
ఓ చందమామ అందాలభామ ఎందున్నదో పల్కుమా
మనసే కరగీ ఈ రససీమలో తేలగా – 2
ఇక జాగుసేయనేలనీ సూచించుమా
జాగుసేయనేలనీ సూచించుమా
ఓ చందమామ అందాలభామ ఎందున్నదో పల్కుమా
జగమే మరచీ ప్రణయోల్లాసమే చిందగా – 2
ఇట ఓలలాడ రమ్మనీ శాసించుమా
ఓలలాడ రమ్మనీ శాసించుమా
ఓ చందమామ అందాలభామ ఎందున్నదో పల్కుమా...