క్యా గం హై జిస్కో చుపా రహే హో ...
అంటూ జగ్జీత్ సింగ్ మంద్ర స్వరంలోనుంచి జాలువారిన ఈ పాట "అర్ద్' అనే చిత్రం లోనిది.ఈ పాటను ఇంతకు ముందు కూడా పాడాను.కానీ అది వేరే ట్రాక్.ఇది వేరే ట్రాక్.మనకు ఒక పాట ఇష్టం అయితే దానిని ఎన్నిసార్లైనా పాడుకోవచ్చు.అందుకే మళ్ళీ ఇంకోసారి పాడుతున్నాను.
ఈ పాటను యూట్యూబ్ లో ఇక్కడ చూడండి.
https://youtu.be/IL7BVyGIEns
నాకు చాలా చాలా ఇష్టమైన పాటలలో ఒకటి.
ఈ పాటను యూట్యూబ్ లో ఇక్కడ చూడండి.
https://youtu.be/IL7BVyGIEns
ఇది ఇంకొక మధుర గీతం.దీనిని పాడినది ఘజల్ కింగ్ జగ్జీత్ సింగ్.
ఇందులో ఒకటి మూడు చరణాలు ఒక రాగంలో ఉంటాయి.రెండు నాలుగు చరణాలు కొద్ది తేడాతో అదే రాగంలో ఉంటాయి.
ఇందులో ఒకటి మూడు చరణాలు ఒక రాగంలో ఉంటాయి.రెండు నాలుగు చరణాలు కొద్ది తేడాతో అదే రాగంలో ఉంటాయి.
ఇది చాలా ఫిలసాఫికల్ సాంగ్.ప్రేమికుల మధ్యన ఉన్న సంబంధానికి ఫిలసాఫికల్ టచ్ తోడైతే అది అత్యంత అద్భుతంగా ఉంటుంది.మామూలు లోకప్రేమ కంటే ఎన్నో రెట్లు గొప్ప ఫీల్ ని ఇస్తుంది.
రచయిత కైఫీ ఆజ్మీ ఈ పాటలో గొప్ప తత్త్వాన్ని ఇమిడ్చి చెప్పాడు.
'ఎందుకంతగా నవ్వుతున్నావు?నీ హృదయంలో ఏ బాధను దాచుకున్నావో చెప్పు?' అంటూ ఒక సూఫీ మార్మిక వాదిలాగా పల్లవిలోనే ప్రశ్నిస్తాడు.
ఎక్కువగా నవ్వేవారికి లోలోపల భరించలేని బాధ ఉంటుందనీ ఆ బాధను పలుచన చేసుకోవడానికే అలా నవ్వుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారన్నది నగ్నసత్యం.సైకాలజిస్టులకు ఈ విషయం తెలుసు.యోగులకు ఇంకా బాగా తెలుసు.ఆ బాధేమిటో తెలియాలంటే వాళ్ళ కళ్ళలోకి చూడాలి. వారి పెదవుల మీద మాత్రమే చూస్తే ఉత్తనవ్వే కనిపిస్తుంది.కానీ కళ్ళలో నుంచి హృదయంలోకి తొంగిచూస్తె అప్పుడు మాత్రమే అక్కడున్న బాధేమిటో కనిపిస్తుంది.
మామూలు మనుషులు హృదయంలోకి తొంగి చూడలేరు.వారికా విద్య తెలియదు.భావుకులు మాత్రమే ఆ పని చెయ్యగలరు.యోగశక్తి ఉన్నవారు ఆ పనిని ఇంకా సులభంగా ఇంకా ఎఫెక్టివ్ గా చెయ్యగలరు.
మామూలు మనుషులు హృదయంలోకి తొంగి చూడలేరు.వారికా విద్య తెలియదు.భావుకులు మాత్రమే ఆ పని చెయ్యగలరు.యోగశక్తి ఉన్నవారు ఆ పనిని ఇంకా సులభంగా ఇంకా ఎఫెక్టివ్ గా చెయ్యగలరు.
"నీ కళ్ళలో తియ్యదనం కనిపిస్తున్నది.పెదవుల మీద చిరునవ్వు మెరుస్తున్నది.ఎందుకిలా నటిస్తున్నావు?నీ లోపల ఉన్నదేమిటి?నీవు బయటకు చూపిస్తున్నదేమిటి?"- అని అడుగుతాడు.
"ఉబికి వచ్చే కన్నీటిని నీవు ఇలాగే మౌనంగా దిగమ్రింగుతూ ఉంటె ఒకనాటికి ఆ కన్నీరు విషంగా మారుతుంది.అలా చెయ్యకు.ఆ కన్నీటిని ఎంజాయ్ చెయ్యకు. దానిని మౌనంగా భరించకు."-అని ఉద్బోదిస్తాడు.
"కాలం నయం చేసిన గాయాలను మళ్ళీమళ్ళీ ఎందుకు నీవు కెలుకుతున్నావు?ఎందుకు వాటిని నీవు మాననివ్వడం లేదు?బాధను ఎంజాయ్ చెయ్యడం నీకు సరదాగా ఉందా?"- అని ప్రశ్నిస్తాడు.
'రేఖావోం కా ఖేల్ హై ముకద్దర్..'అనే పాదంలో ఒక గొప్ప భావాన్ని కవి పలికించాడు.
విధి అనేది ఏమీ కాదు.అది నీ చేతిలోని గీతల ఆట.అంతే.
నీవు నీ చేతిలోని గీతల చేతిలోనే ఓడిపోతున్నావు.ఇది చాలా సింపుల్ విషయం. గ్రహించు."అని ఉపదేశిస్తూ,నీకు సంకల్పబలం ఉంటే నీ చేతి గీతలను నీవే మార్చుకోవచ్చని మార్మికంగా సూచిస్తాడు.
విధి అనేది ఏమీ కాదు.అది నీ చేతిలోని గీతల ఆట.అంతే.
నీవు నీ చేతిలోని గీతల చేతిలోనే ఓడిపోతున్నావు.ఇది చాలా సింపుల్ విషయం. గ్రహించు."అని ఉపదేశిస్తూ,నీకు సంకల్పబలం ఉంటే నీ చేతి గీతలను నీవే మార్చుకోవచ్చని మార్మికంగా సూచిస్తాడు.
చాలా గొప్పదైన భావాన్ని కొద్ది లైన్లలో చెప్పిన గొప్ప పాట.
నాకు చాలా చాలా ఇష్టమైన పాటలలో ఒకటి.
Movie:--Arth (1982)
Lyrics:--Kaifi Azmi
Music:--Jagjit Singh & Chitra Singh
Singer:--Jagjit Singh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------------
Tum Itna Jo
Muskura Rahe Ho -2
Kya Gham Hai Jisko Chhupa Rahe Ho -2
tum itna jo muskura rahe ho
Kya Gham Hai Jisko Chhupa Rahe Ho -2
tum itna jo muskura rahe ho
Aankhon Mein
Nami, Hansi Labon Par-2
Kya Haal Hai Kya Dikha Rahe Ho-2
kya gam hai jisko chhupa rahe ho-2
tum itna jo muskura rahe ho
Kya Haal Hai Kya Dikha Rahe Ho-2
kya gam hai jisko chhupa rahe ho-2
tum itna jo muskura rahe ho
Ban Jayenge
Zehar Peete Peete-2
Yeh Ashk Jo Pite Ja Rahe Ho-2
Yeh Ashk Jo Pite Ja Rahe Ho-2
Kya Gham Hai
Jisko Chhupa Rahe Ho -2
tum itna jo muskura rahe ho
tum itna jo muskura rahe ho
Jin Zakhmon Ko
Waqt Bhar Chala Hai-2
Tum Kyon Unhe Chhedhe Ja Rahe Ho-2
kya gam hai jisko chhupa rahe ho-2
tum itna jo muskura rahe ho
Tum Kyon Unhe Chhedhe Ja Rahe Ho-2
kya gam hai jisko chhupa rahe ho-2
tum itna jo muskura rahe ho
Rekhaon Ka Khel
Hai Muqaddar-2
Rekhaon Se Maat Kha Rahe Ho-2
kya gum hai jisko chhupa rahe ho
Tum Itna Jo...muskura rahe ho-2
Rekhaon Se Maat Kha Rahe Ho-2
kya gum hai jisko chhupa rahe ho
Tum Itna Jo...muskura rahe ho-2
kya gum hai
jisko chipa rahe ho-2
Tum Itna
Jo...muskura rahe ho
Meaning:--
Why are you smiling so much dear?
What is the grief you are hiding behind your smile?
Your eyes are wet
but your lips are smiling
What is your inner feel
and what are you showing to outside world?
Why are you trying to hide your sadness?
The tears that you keep on drinking
they will become poison ultimately
dont drink your tears
dont suppress your grief
The wounds that Time has healed almost
why do you rake them up again and again?
Fate is nothing but the lines on your palm
Know that you are inviting defeat
from your own hand lines
get up and change your lines
change your fate
Why are you smiling so much dear?
What is the grief you are hiding behind your smile?
తెలుగు స్వేచ్చానువాదం
ఎందుకు అంతగా నవ్వుతున్నావు?
ఏ బాధను నీ లోలోపల దాచుకుంటున్నావు?
నీ కళ్ళలో తడి
నీ పెదవులపైన చిరునవ్వు
నీలోపల ఏముంది?
బయటకు ఏం చూపిస్తున్నావు?
ఏ బాధను నీ లోలోపల దాచుకున్నావు?
ఎందుకు ఇంతగా నవ్వుతున్నావు?
నీవు ఏ కన్నీళ్ళనైతే త్రాగుతున్నావో
అవి చివరకు విషంగా మారుతాయి
నీ కన్నీళ్లను త్రాగకు
నీ బాధను అణచిపెట్టుకోకు
ఏ గాయాలనైతే కాలం చాలావరకూ నయం చేసిందో
ఆ గాయాలను ఎందుకు నీవు
మళ్ళీ మళ్ళీ కెలుకుతున్నావు
వాటినలా వదిలేయ్
విధి అంటే ఏమీ లేదు
అది నీ చేతి రేఖలే
నీ రేఖల చేతిలోనే నీవు ఓడిపోతున్నావు
అలా ఓడిపోకు
నీ గీతనీ నీ రాతనీ మార్చుకో
జీవితంలో నువ్వు ఓడిపోకూడదు
గెలవాలి
ఎందుకు అంతగా నవ్వుతున్నావు?
ఏ బాధను నీ లోలోపల దాచుకుంటున్నావు?