అతనొక పేరుగాంచిన మల్లయోధుడు. మొత్తం తమిళదేశం అంతటిలోకీ అంతగొప్ప యోధుడు లేడు.అదే తమిళదేశంలో పొన్నాచ్చి అనే ఒక మంచి అందగత్తె ఉండేది.ఆమె మేనిఛాయ మేలిమి బంగారురంగుతో పోటీపడుతూ ఉండేది.అందుకే ఆమెకు పొన్నాచ్చి అనే పేరు వచ్చింది.తమిళంలో పొన్ను అంటే బంగారం అని కదా అర్ధం.ఆమె గొప్ప సౌందర్యవతేగాని అంతకంటే ఆమె కళ్ళు చాలా అందమైనవి. ఆమె కళ్ళవైపు ఎవరైనా చూస్తె తమ కళ్ళు తిప్పుకోలేకపోయేవారు.అంత అందమైన నేత్రాలు ఆమెకుండేవి.ధనుర్దాసు ఆమెను అమితంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఆమె అందాన్ని అతను అమితంగా ఆరాధించేవాడు.ఆమెను అమితంగా ప్రేమించేవాడు.అతను గొప్ప మల్లయోదుడే గాక గొప్ప సౌందర్యారాధకుడు కూడా.
ఒకరోజున ధనుర్దాసూ పొన్నాచ్చి శ్రీరంగంలో రంగనాధస్వామి దర్శనానికి వచ్చారు.తిరువీధిలో పొన్నాచ్చి గుడివైపు నడుస్తూ వస్తుంటే, ధనుర్దాసు ఆమెముందు నిలబడి ఆమె కళ్ళను చూచుకుంటూ ఆమెకు ఎండ తగులకుండా గొడుగుపడుతూ గుడివైపు వెనక్కు నడుస్తున్నాడు.తన శిష్యులతో అదేవీధిలో నడుస్తూ పోతున్న రామానుజస్వామి ఈ విచిత్రాన్ని గమనించారు.
"ఏమిటీ వింతప్రవర్తన?" అని ధనుర్దాసును ప్రశ్నించగా - 'ఇంత అందమైన కన్నులను చూడకుండా ఒక్క క్షణంకూడా తాను ఉండలేనని అందుకే ఇలా వెనక్కు నడుస్తున్నానని'- అతను జవాబిస్తాడు.నీ ప్రేయసి కన్నుల కంటే అందమైన కన్నులను చూపిస్తాను రమ్మని దేవాలయంలోకి తీసుకెళ్ళి స్వామి కన్నులను ధనుర్దాసుకు చూపిస్తారు రామానుజస్వామి.భగవంతుని దివ్యనేత్రాలను చూచిన ధనుర్దాసు ప్రేయసి కన్నుల పైన మోహం వీడి భక్తునిగా మారుతాడు.అతనూ పొన్నాచ్చీ రామానుజస్వామి శిష్యులౌతారు. ఇది నిజంగా జరిగిన కధ అని వైష్ణవులు చెబుతారు.

ఈ గాధను చదివినప్పుడు ఈ వ్యవహారమంతా నాకేమీ నచ్చలేదు.సృష్టి అంతా భగవంతుని చిద్విలాసమే అని భావించే రామానుజులు ధనుర్దాసుకు ఆ విధంగా ఎలా బోధించారో నాకైతే అర్ధంకాలేదు.ఈ కధలో అతిశయోక్తులు చాలా ఉన్నాయని నా నమ్మకం.సమాజంలోని అన్ని వర్గాలనూ రామానుజులు చేరదీసి వారికి వైష్ణవ మంత్రోపదేశం ఇచ్చి తన శిష్యులుగా మార్చారు.అలాంటివారిలో వీరిద్దరు కూడా ఒకరని నా వాస్తవికభావన. అంతేగాని ధనుర్దాసుకు దైవంయొక్క నిజమైన నేత్రాలను రామానుజులు సరాసరి దర్శనం చేయించారంటే నేను నమ్మలేను.అదంత తేలికైన విషయం ఏమీ కాదు.అప్పటికప్పుడు అలా చెయ్యడం సాధ్యమూ కాదు.
మల్లయోధులు సామాన్యంగా శూద్రకులాలలో ఉంటారు.నైష్టికులు తాకను కూడా తాకకుండా దూరంగా ఉంచే అలాంటివారిని చెయ్యిపట్టుకుని సరాసరి గర్భగుడిలోకి తీసుకెళ్ళి రంగనాధస్వామి నేత్రాలను అతిదగ్గరగా రామానుజులు చూపించి ఉండవచ్చు.తన శిష్యులుగా స్వీకరించి వారికి వైష్ణవదీక్షను ఇచ్చి ఉండవచ్చు.రామానుజుల విశాల దృక్పధానికి ఇది సరిగానే సరిపోతున్నది. ఆ కృతజ్ఞతతో ఆ భార్యాభర్తలు ఆయన ఆశ్రమంలో స్థిరనివాసం ఏర్పరచుకొని ఆయన శిష్యులుగా మారి ఉండవచ్చు.ఇది వాస్తవంగా జరిగిన కధ.అయితే సామాన్యంగానే ప్రతిదానికీ 'అతి' ఎక్కువగా చేసే వైష్ణవభక్తులు దీనికి చిలవలు పలవలుగా కధను అతికి అతిశయోక్తులు చేర్చి ఉండవచ్చు.
అయితే, పొన్నాచ్చి అందాన్ని నేను శంకించడం లేదు. అలాంటి అందగత్తెలు ఉండటం అసంభవం ఏమీకాదు.నేడు కూడా అలాంటి వాళ్ళున్నారు. ధనుర్దాసు వంటి సౌందర్యారాధకులూ నేడున్నారు.అతన్నీ నేను శంకించడం లేదు.కమలాక్షుని దివ్యనేత్రాలను ధనుర్దాసుకు రామానుజులు అప్పటికప్పుడు దర్శనం చేయించారన్న విషయాన్ని మాత్రమే నేను నమ్మడం లేదు.
సన్యాసజీవితానికి ముందు రామానుజుల సంసారజీవితం అంత సుఖవంతంగా ఏమీ సాగలేదు.ఆయన భార్య మహాగర్విష్టీ అహంభావీ మాత్రమేగాక ఈయనంటే ఆమెకు చాలా చిన్నచూపు ఉండేది.రామానుజుల సంసారంలో 'ప్రేమ' అనేది లేదు.అది మామూలు సాంప్రదాయబద్ధమైన సంసారమేగాని ప్రేమతో నిండిన సంసారం కాదు.అందుకే ఆయనకు సతియొక్క అనురాగపూరితమైన ప్రేమ అంటే ఏమిటో తెలియదని నా నమ్మకం.అందుకే మధురప్రేమికుడైన ధనుర్దాసును గుళ్ళోకి తీసుకెళ్ళి' - ఆ కన్నులలో ఏముందిరా పిచ్చివాడా ఈ కన్నులు చూడు' - అంటూ విగ్రహాన్ని చూపించి ఉండవచ్చు.తనకు తెలియనిది ఎదుటివారిలో కనిపిస్తే అర్ధంచేసుకోలేకపోవడం సామాన్యమే కదా !! పెద్ద పెద్ద గురువులు కూడా దీనికి అతీతులేమీ కారు.
రామానుజులకు రాతివిగ్రహంలో సౌందర్యం కనిపించింది.ధనుర్దాసుకు తన ప్రేయసి సజీవవిగ్రహంలోనే అది కనిపించింది.అందులో తప్పేముంది?అతన్ని తనలా మారమని ఆయన ఆదేశించడం ఏమిటో నాకైతే ఇప్పటికీ ఎంత గింజుకున్నా అర్ధం కాదు.

ఏదేమైనప్పటికీ - నా కవితాధోరణికి ఈ కధ కొంత ప్రేరకంగా మారింది."నేనే ధనుర్దాసునైతే" అన్న ఒక కవితను సృష్టింపజేసింది.పనిలో పనిగా రామదాసునూ దేవదాసునూ కూడా కవితలోకి లాక్కొచ్చాను.
చదవండి మరి.
నేనే ధనుర్దాసునైతే
రామానుజుల సన్యాసానికే చరమగీతం పాడించి
ఆయనకే ప్రేమోపదేశం గావించేవాణ్ని
ప్రియురాలి మనోహర నేత్రాలలో లేని సౌందర్యం
దేవుని విగ్రహంలో ఎక్కడుంది? (1)
నేనే ధనుర్దాసునైతే
నా గురువుకే నవ్యదీక్ష నిచ్చి
శుద్ధప్రేమ మంత్రాన్ని ఉపదేశించేవాణ్ని
ప్రేమపొంగే నయనాలలో లేని దివ్యత్వం
రాతి చెక్కడంలో ఎక్కడుంది? (2)
నేనే ధనుర్దాసునైతే
జగద్గురువులకే ప్రేమవిలువను బోధించి
నిజమైన ఆరాధనను నేర్పించేవాణ్ని
అలవిగాని విరహంలో లేని ఆనందం
ఆధ్యాత్మిక ఆచారాలలో ఎక్కడుంది? (3)
నేనే ధనుర్దాసునైతే
అసత్యబోధలు గావించే సద్గురువులందర్నీ
నిత్యజీవితపు అమరత్వంలోకి ఈడ్చుకొచ్చేవాణ్ని
ప్రేయసి ముగ్ధనయనాలలో మునగలేని సన్నాసి
ఆత్మసమర్పణ అవధులనేం అందుకోగలడు? (4)
నేనే ధనుర్దాసునైతే
పాండిత్య పంకపు పాపాత్ములనందర్నీ
ప్రేమగంగలో పవిత్రస్నానం చేయించేవాణ్ని
వలపు సరోవరంలో తేలే హంసకున్న ఆనందం
పుస్తకాలు మేసే పురుగులకెలా అందుతుంది? (5)
నేనే ధనుర్దాసునైతే
రాతి ఆలయాలకన్నింటికీ తాళాలు వేయించి
హృదయాలయాలను బార్లా తెరిపించేవాణ్ని
నీ గుండెలో నిత్యం వెలిగే ప్రేమవెలుగు
గుళ్ళలో వెలిగే నూనెదీపాలలో ఎక్కడుంది? (6)
నేనే ధనుర్దాసునైతే
లోకంలోని కృత్రిమపూజలన్నీ ఆపించి
స్వచ్చమైన ప్రేమారాధనను లోకానికి నేర్పేవాణ్ని
జీవంలో దైవాన్ని చూడలేని కపటి
జడంలో దైవాన్నెలా చేరుకోగలడు? (7)
నేనే ధనుర్దాసునైతే
పవిత్రగ్రంధాలన్నీ అవతల పారవేయించి
భక్తులచేత ప్రేమగీతాలు పాడించేవాణ్ని
ఆచరణకురాని శుష్కవేదాంతం కంటే
ఆత్మను ఆవహించే ప్రేమావేశం వాంఛనీయం కదూ? (8)
నేనే ధనుర్దాసునైతే
లోకులు కప్పుకున్న కాపట్యపు దుస్తులన్నీ తొలగించి
నగ్నసౌందర్యపు నవ్యత్వాన్ని వారికి నేర్పేవాణ్ని
సృష్టిలోని స్వచ్చసౌందర్యాన్ని కొలిచే దృష్టి లేనివాడు
తన సృష్టిలో సౌందర్యాన్ని ఎలా నింపుకోగలడు? (9)
నేనే ధనుర్దాసునైతే
కాకమ్మ కబుర్లు చెప్పే మతకాకులన్నింటినీ
మధురగీతాలు పాడే హంసలుగా మార్చేవాణ్ని
లోకులు తినిపారేసిన ఎంగిలి మాంసఖండాల కంటే
మానససరోవరపు తామరతూళ్ళు మంచివి కదూ? (10)
నేనే ధనుర్దాసునైతే
కోరికలతో మండే కుళ్ళు బ్రతుకులలో
చల్లని ప్రేమజలాలు చల్లించేవాణ్ని
తన చుట్టూ ఉన్న దైవాన్ని చూడలేనివాడు
ఎక్కడో ఉన్న దైవాన్ని ఎలా చేరుకోగలడు? (11)
నేనే ధనుర్దాసునైతే
హిమాలయాల శుద్ధ గంగాజలాన్ని
నీ ఇంటి ముంగిట్లో పారించేవాణ్ని
జీవంలేని గుడికి నిన్ను తీసుకెళ్లడంకాదు
జీవంతో వెలిగే దైవాన్నే నీ ఎదుటకు రప్పించేవాణ్ని (12)
నేనే ధనుర్దాసునైతే
మాయమతాలన్నింటినీ మాయం చేసేసి
ప్రేమమతాన్ని మాత్రమే ప్రచారం చేసేవాణ్ని
ద్వేషాన్నీ కపటాన్నీ పెంచే ఘరానా మతాలకంటే
ప్రేమను పంచే సామాన్యజీవితం ఉత్తమం కదూ? (13)
నేనే దేవదాసునైతే
పార్వతికే మదిరను పట్టించి
పరమానందాన్ని ఆమెకే రుచి చూపించేవాణ్ని
ఆమెకోసం నేనేడవటం కాదు
నాకోసం పడిచచ్చేలా ఆమెను మార్చేవాణ్ని
జీవితాన్ని భగ్నం చేసుకునే నిరాశామోహం కంటే
ఆనందంలో లగ్నంచేసే ప్రేమావేశం మంచిది కదూ? (14)
నేనే రామదాసునైతే
రాజుకివ్వాల్సింది రాజుకిచ్చి
రాముడికివ్వాల్సింది రాముడికిచ్చేవాణ్ని
పరాయి సొమ్ముతో రాతిగుళ్ళు కట్టి శిక్షలు పొందటం కంటే
ప్రేమగుండెలో దైవాన్ని ప్రతిష్టించుకోవడం ఉత్తమం కదూ? (15)
నేనే ధనుర్దాసు నైతే
బయటి యాత్రలన్నీ బహిష్కరింపించి
నీయాత్రను నీలోకే చేయించేవాణ్ని
దేశాలన్నీ తిరిగి దిక్కు తెలియక కూలబడటం కంటే
ఉన్నచోటే ఉండి సర్వం సాధించడం ఉత్తమోత్తమం కదూ? (16)
నేనే ధనుర్దాసు నైతే
నా ప్రేయసినే సజీవంగా నిలుపుకునేవాణ్ని
మనం చెక్కిన రాతిశిల్పాలకంటే
దైవం చెక్కిన సజీవశిల్పం మహాద్భుతం కదూ? (18)
నేనే ధనుర్దాసునైతే
ఏ శ్రీరంగానికీ వెళ్ళకుండా
నా అంతరంగంలోకే నేను ప్రవేశించేవాణ్ని
నిలువ జలాల మురికి పుష్కరిణిలో కాకుండా
అమృత సరస్సైన మానససరోవరంలో మునిగేవాణ్ని (19)
మనం కట్టుకున్న బాహ్యజలాశయాల కంటే
దైవం మనకిచ్చిన అంతరికసరోవరం మంచిది కదూ?
మనం బ్రతుకుతున్న కపట జీవితాల కంటే
దైవం ప్రసాదించిన సత్యజీవితం మనోహరం కదూ? (20)

వేవేల గోపికల విశ్వవల్లభునికి
సన్యాసపు సాంప్రదాయమేమిటని ప్రశ్నించేవాణ్ని
మనోహర నికుంజాలలో నిత్యరతిలో తేలే రసికుడికి
మడిపంచెల మసి హారతులేమిటని అడిగేవాణ్ని (17)
నేనే ధనుర్దాసు నైతే
దేవుని ప్రతిమస్థానంలోనా ప్రేయసినే సజీవంగా నిలుపుకునేవాణ్ని