నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, డిసెంబర్ 2015, మంగళవారం

2015 లో పంచవటిలో ఏం జరిగింది?

2015 అయిపోవస్తున్నది.

ఈ సంవత్సరంలో 'పంచవటి' లో చాలా మార్పులు చేర్పులు జరిగాయి.అనేక రకాలైన కార్యక్రమాలు ఊపందుకున్నాయి.నా దారిలో నడవడానికి ఇష్టపడే అనేక కొత్త మెంబర్లు 'పంచవటి' లో చేరారు.

కొందరేమో రకరకాల కారణాలవల్ల ఇక్కడ ఇమడలేక నిష్క్రమించారు.మరికొందరు ఇందులో మెంబర్స్ అయినప్పటికీ,రకరకాల మానసిక ఆలోచనలలో భయాలలో చిక్కుకుని,ఈయన్నసలు అనుసరించాలా వద్దా, అని తేల్చుకోలేక సైలెంట్ గా ఉంటున్నారు.వారికి కాలం వేగంగా వృధా అవుతున్నది. 'సంశయాత్మా వినశ్యతి'.

ఇకపోతే, కొద్దిమంది మాత్రం ఇదొక మహదవకాశంగా స్వీకరించి నేను చూపిన మార్గంలో మనస్ఫూర్తిగా నడుస్తున్నారు.అసలైన ఆధ్యాత్మిక మార్గంలో వారి అడుగులు పడుతున్నాయి.కలలో కూడా ఊహించలేని ఆధ్యాత్మిక అనుభవాలు వారికి కలుగుతున్నాయి.ఆ క్రమంలో వాళ్ళ జీవితాలు గొప్పదైన ఆత్మసంతృప్తితో నిండుతూ జీవనసాఫల్యతను సంతరించుకుంటున్నాయి. 


అన్నింటినీ మించి వీరందరికీ ఒక 'ఫేమిలీ ఫీలింగ్' ఏర్పడింది. గట్టిగా చెప్పాలంటే వారివారి 'ఫేమిలీ మెంబర్స్' కంటే కూడా గట్టిదైన బాండ్ "పంచవటి" సభ్యుల మధ్యన ఏర్పడింది. 

2015 సంవత్సరం 'పంచవటి'కి చాలా సంతృప్తిని మిగిల్చింది.ఈ ఏడాది మొత్తం మీద 13 కార్యక్రమాలు జరిగాయి.

పోయిన ఏడాది డిసెంబర్ చివరలో 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకం రిలీజ్ కావడం ఆ తర్వాతి శుభకార్యక్రమాలకు నాందీప్రస్తావన పలికింది.ఆయా కార్యక్రమాలను ఈ క్రింద చూడవచ్చు.
----------------------------
December - 2014
"శ్రీవిద్యా రహస్యం" పుస్తకావిష్కరణ - విజయవాడ.

February - 2015
మొదటి జ్యోతిష్య సమ్మేళనం-హైదరాబాద్
రెండవ జ్యోతిష్య సమ్మేళనం-విజయవాడ.

May - 2015
ఏడవ ఆధ్యాత్మిక సమ్మేళనం - శ్రీశైలం

June - 2015
'తారా స్తోత్రం' పుస్తకావిష్కరణ - విజయవాడ.

July - 2015
యోగా రిట్రీట్ - హైదరాబాద్

August - 2015
గురుపూర్ణిమ ఆధ్యాత్మిక సమ్మేళనం-గుంటూరు
జిల్లెళ్ళమూడి యాత్ర
మూడవ జ్యోతిష్య సమ్మేళనం - హైదరాబాద్

October - 2015
మొదటి మార్షల్ ఆర్ట్స్ క్లాస్ - గుంటూరు.

November 2015
మొదటి తంత్ర ఫౌండేషన్ మరియు ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్స్ క్లాస్ - గుంటూరు.

December 2015
నాలుగవ జ్యోతిష్య సమ్మేళనం - వైద్య జ్యోతిష్యం- హైదరాబాద్ 
రెండవ తంత్ర మరియు మార్షల్ ఆర్ట్స్ క్లాస్ - గుంటూరు

2016 లో నా అమెరికా ట్రిప్ తో మన "పంచవటి" కార్యక్రమాలు అమెరికాలో కూడా ప్రారంభం కాబోతున్నాయి.అక్కడి జిజ్ఞాసువులకు కూడా ఈ అమృతం అందబోతున్నది.నన్ను అనుసరించాలనీ నా మార్గంలో నడవాలనీ ఎదురుచూస్తున్న అమెరికా సభ్యులకు అప్పుడు దీక్ష ఇవ్వడం జరుగుతుంది.

పాతికేళ్ళ క్రితం పూజ్యపాద నందానందస్వామి వారు నాతో చెప్పిన మాట నేడు నిజమై ఈవిధంగా కళ్ళెదురుగా కనిపిస్తున్నది.

2016 లో "పంచవటి"లో ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు జరగాలనీ,మనదేశంలోనూ విదేశాలలోనూ ఉన్న పంచవటి సభ్యులు ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు ఎదగాలనీ,నిజమైన ఆత్మసాఫల్యతను అందుకోవాలనీ ఆశిస్తున్నాను.